దారుణం.. ఒకే యువతిపై.. వేర్వేరుగా.. ముగ్గురు కామాంధుల దుశ్చర్య..
దిశ చట్టం వచ్చినా.. నిర్భయ చట్టం ఉన్నా.. కామాంధులకు మాత్రం ఏమాత్రం భయం కలగడం లేదు. ఒంటరిగా మహిళలు, అమ్మాయిలు కనిపిస్తే చాలు.. అత్యాచారాం చేయడం.. లేదంటే హతమార్చడం.. ఇది నిత్యం దేశంలో ఎక్కడో ఓ చోట జరుగుతున్న దారుణాలు. తాజాగా నవీ ముంబైలో జరిగిన దారుణ ఘటన.. సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేస్తోంది. కేవలం రెండు గంటల్లోనే.. ఓ 19 ఏళ్ల యువతిపై రెండు సార్లు అఘాయిత్యం జరిగింది. అది కూడా వేర్వేరుగా సాగిన ఘటనల్లో. […]

దిశ చట్టం వచ్చినా.. నిర్భయ చట్టం ఉన్నా.. కామాంధులకు మాత్రం ఏమాత్రం భయం కలగడం లేదు. ఒంటరిగా మహిళలు, అమ్మాయిలు కనిపిస్తే చాలు.. అత్యాచారాం చేయడం.. లేదంటే హతమార్చడం.. ఇది నిత్యం దేశంలో ఎక్కడో ఓ చోట జరుగుతున్న దారుణాలు. తాజాగా నవీ ముంబైలో జరిగిన దారుణ ఘటన.. సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేస్తోంది.
కేవలం రెండు గంటల్లోనే.. ఓ 19 ఏళ్ల యువతిపై రెండు సార్లు అఘాయిత్యం జరిగింది. అది కూడా వేర్వేరుగా సాగిన ఘటనల్లో. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని నవీ ముంబైలో ముగ్గురు కామాంధులు.. ఓ యువతిపై అత్యాచారం చేసిన దారుణం వెలుగుచూసింది. ఓ యువతి తన బంధువులతో కలిసి ఘట్‌కోపర్ రైల్వేస్టేషన్ వద్ద రైల్ ఎక్కే క్రమంలో అంతా ఎక్కినా.. ఈ యువతి రైలు ఎక్కలేకపోయింది. ఒక ట్రైన్ ఎక్కే బదులుగా మరో ట్రైన్ ఎక్కడంతో.. దారి తప్పింది. దీంతో రాత్రి థానేలోని ముంబ్రా రైల్వేస్టేషనుకు వచ్చి అక్కడే నిద్రపోయింది. ఆ తర్వాత.. ముంబ్రా నుంచి మరో రైలు ఎక్కి.. దివా రైల్వేస్టేషనులో దిగింది. తన చేతిలో డబ్బులు లేకపోవడంతో.. తన ముక్కుపుడకను అమ్మేసి డబ్బులు తీసుకునేందుకు ప్రయత్నించింది.
అయితే అక్కడ ఎవరూ సహాయం చేయకపోవడంతో.. రాత్రి కావడంతో స్టేషన్ బయటకు దూరంగా రోడ్డుపైకి వచ్చింది. అయితే తిరిగి మళ్లీ రైల్వే స్టేషన్ వెళ్లేందుకు ఓ ఆటో ఎక్కగా.. సదరు ఆటో డ్రైవర్ నవీ ముంబైలోని ఓ నిర్మానుష్య భవనంలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం అక్కడి నుంచి ఆ యువతిని మరో దగ్గర వదిలేసి పరారయ్యాడు. ఈ క్రమంలో మరో ఇద్దరు రైల్వే స్టేషన్‌కు తీసుకెళ్తామని చెప్పి.. ఘన్సోలీ ప్రాంతానికి తీసుకెళ్లి ఆమెపై ఇద్దరు అత్యాచారానికి ఒడిగట్టి పారిపోయారు. దీంతో నవీ ముంబై పోలీసుల వద్దకు వెళ్లి.. ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. అనంతరం సదరు బాధిత యువతిని వైద్యపరీక్ష కోసం ఆసుపత్రికి పంపించారు.