AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సినీ ఫక్కీలో కిడ్నాప్..కథ అడ్డం తిరిగి ఇలా..

సినీ ఫక్కీలో జరిగిన యువతి కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. ఆమెను అపహరించడంతో పాటు భారీ పేలుడుకు నిందితుడు పక్కా స్కేచ్ వేశాడు. యువతిని కిడ్నాప్ చేసే సమయంలో ఇంట్లో పెట్రోల్ చల్లి రెండు గ్యాస్ సీలిండర్లు లీక్ చేశాడు.

సినీ ఫక్కీలో కిడ్నాప్..కథ అడ్డం తిరిగి ఇలా..
Jyothi Gadda
|

Updated on: Feb 27, 2020 | 8:14 PM

Share

కడప జిల్లాలో సినీ ఫక్కీలో జరిగిన యువతి కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. ఆమెను అపహరించడంతో పాటు భారీ పేలుడుకు నిందితుడు పక్కా స్కేచ్ వేశాడు. యువతిని కిడ్నాప్ చేసే సమయంలో ఇంట్లో పెట్రోల్ చల్లి రెండు గ్యాస్ సీలిండర్లు లీక్ చేశాడు. కానీ, అతడి ప్లాన్ బెడిసి కొట్టింది. చివరకు పోలీసులకు చిక్కి కటకటలాపాలయ్యాడు. వివరాలు పరిశీలించగా…

కడప జిల్లాలో అత్యంత సినీ ఫక్కీలో జరిగిన కిడ్నాప్ కేసును కొద్ది గంటల్లోనే చేధించారు పోలీసులు. కడపలోని ఓ ప్రైవేట్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న వ్యక్తి.. ఓ యువతిని కిడ్నాప్ చేయాలని ప్లాన్ వేశాడు. ఆమెను కిడ్నాప్ చేసే సమయంలో ఇంట్లో పెట్రోల్ జల్లాడు. ఇంట్లో ఉన్న రెండు గ్యాస్ సిలిండర్లను లీక్ చేశాడు. సిలిండర్ పేలి అందులో యువతి సజీవదహనం అయిపోయి ఉంటుందని అందరూ భావించాలని పక్కాగా స్కేచ్ వేశాడు. యువతి చనిపోతే కనీసం ఎముకలు, పుర్రె అయినా మిగులుతాయి కదా అని డౌట్ వచ్చింది. దీంతో శ్మశానంలోకి వెళ్లి ఎముకలు, పుర్రెలు తీసుకొచ్చాడు. ఇంట్లో పుర్రెలు ఉంచాడు. అయితే, అతడి కథ అడ్డం తిరిగింది.

యువతిని గుర్తు తెలియని కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేసినట్లుగా పోలీసులకు ఫిర్యాదు అందింది. కిడ్నాపర్లు బురఖాలు వేసుకుని వచ్చినట్లుగా ఫిర్యాదులో వెల్లాడించారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు స్థానికంగా ఉన్న సీసీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. కిడ్నాప్‌నకు గురైందని ఫిర్యాదు అందిన కొన్ని గంటల్లోనే నిందితుడిని, బాధితురాలిని పట్టుకున్నారు. తమిళనాడులోని వేలూరులో వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ప్లాన్ వేసినట్టు సిలిండర్ పేలి ఉంటే భారీ ఆస్తి, ప్రాణ నష్టం కలిగి ఉండేదని పోలీసులు తెలిపారు. నిందితుడు యూట్యూబ్ చూసి ఇదంతా ప్లాన్ చేసినట్లుగా పోలీసు విచారణ వెల్లడైంది.

Follow Us
తెలివైన భర్తకు పిసినారి పెళ్ళాం... సంసారంలో శాంతికి అదే ముఖ్యం!
తెలివైన భర్తకు పిసినారి పెళ్ళాం... సంసారంలో శాంతికి అదే ముఖ్యం!
ఛోటా ప్యాకెట్‌తో సిరాజ్‌ మాటల యుద్ధం.. మధ్యలో తెలుగోడి ఎంట్రీ
ఛోటా ప్యాకెట్‌తో సిరాజ్‌ మాటల యుద్ధం.. మధ్యలో తెలుగోడి ఎంట్రీ
పారిశుద్ధ్య కార్మికురాలిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన దుండగులు!
పారిశుద్ధ్య కార్మికురాలిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన దుండగులు!
పెళ్లి, సంతానం, సొంతింటి కోరికలు నెరవేరుతాయట.. ఈ వరాహస్వామి ఆలయం
పెళ్లి, సంతానం, సొంతింటి కోరికలు నెరవేరుతాయట.. ఈ వరాహస్వామి ఆలయం
కలెక్టర్ జాబ్ వదిలేసి సినిమాల్లోకి.. ఫస్ట్ మూవీకే జాతీయ అవార్డ్..
కలెక్టర్ జాబ్ వదిలేసి సినిమాల్లోకి.. ఫస్ట్ మూవీకే జాతీయ అవార్డ్..
శాసనసభ గొడవపై తాటా మధు వివరణ..
శాసనసభ గొడవపై తాటా మధు వివరణ..
హాట్ కాఫీ + ప్రోటీన్ పౌడర్.. తాగొచ్చా? అసలు విషయం ఏంటంటే!
హాట్ కాఫీ + ప్రోటీన్ పౌడర్.. తాగొచ్చా? అసలు విషయం ఏంటంటే!
బిగ్‌బాస్ మొదటి వారం నామినేషన్స్‌లో ఉన్న కంటెస్టెంట్స్ వీళ్లే!
బిగ్‌బాస్ మొదటి వారం నామినేషన్స్‌లో ఉన్న కంటెస్టెంట్స్ వీళ్లే!
డబ్బు, ఉద్యోగం, వ్యాపారం.. ఈ నక్షత్రాలకు గోల్డెన్ టైమ్ స్టార్ట్
డబ్బు, ఉద్యోగం, వ్యాపారం.. ఈ నక్షత్రాలకు గోల్డెన్ టైమ్ స్టార్ట్
స్థానిక ఎన్నికలే అసలు పరీక్ష.. టీడీపీ ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు
స్థానిక ఎన్నికలే అసలు పరీక్ష.. టీడీపీ ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు