G20 Summit: ప్రపంచ వారసత్వ ప్రదేశం హంపిలో నేటి నుంచి G20 సమ్మిత్.. 8 రోజుల పాటు జరగనున్న సమావేశాలు
నేటి నుంచి జూన్ 13 వరకు జీ20 దేశాల కల్చరల్ వర్కింగ్ గ్రూప్ సమావేశం జరగనుంది. ఈ బృందం భారతీయ సంస్కృతితో పాటు వివిధ అంశాలపై చర్చిస్తుంది. అంతేకాకుండా, సభ్య దేశాలోని చారిత్రక వారసత్వాన్ని భవిష్యత్ తరాలకు అందించేలా పరిరక్షించడంపై జి-20 దేశాలు సుదీర్ఘంగా చర్చించనున్నాయి
ఈసారి జి-20 సమ్మిత్‌కు భారతదేశం అధ్యక్షత వహించింది. ఇప్పటికే రెండు సమావేశాలను నిర్వహించగా.. నేడు జి 20 సదస్సు మూడవ ముఖ్యమైన సమావేశం ప్రారంభం కానుంది. జూన్ 09 నుండి జూన్ 16 వరకు 8 రోజుల వరకూ జరగనున్న ఈ సదస్సుకు కర్ణాటకలోని ప్రపంచ వారసత్వ ప్రదేశం హంపి వేదిక కానుంది. ఈ సదస్సుతో విజయనగర సామ్రాజ్య నిర్మాణ శైలిని, విజయనగర సామ్రాజ్య వైభవాన్ని ప్రపంచం మొత్తానికి పరిచయం చేయడానికి హంపిలో G20 సమ్మిత్ నిర్వహించనున్నారు.
నేటి నుంచి జూన్ 13 వరకు జీ20 దేశాల కల్చరల్ వర్కింగ్ గ్రూప్ సమావేశం జరగనుంది. ఈ బృందం భారతీయ సంస్కృతితో పాటు వివిధ అంశాలపై చర్చిస్తుంది. అంతేకాకుండా, సభ్య దేశాలోని చారిత్రక వారసత్వాన్ని భవిష్యత్ తరాలకు అందించేలా పరిరక్షించడంపై జి-20 దేశాలు సుదీర్ఘంగా చర్చించనున్నాయి. దేశ, విదేశాల నుంచి 252 మంది ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు.
G20 షెర్పా సమావేశం జూన్ 13 నుంచి 16 వరకు జీ20 షెర్పా సమావేశం జరగనుంది. జీ20 దేశాల ప్రధానమంత్రులతో నేరుగా పరిచయం ఉన్న అధికారులు షెర్పా సమావేశంలో పాల్గొంటారు. జి20 దేశాల సమావేశాల్లో ఇదొక ప్రత్యేక సమావేశం. 20 దేశాలలో 19 దేశాల నుంచి 30 మంది ప్రతినిధులు, 9 ఆహ్వానిత దేశాల నుంచి 16 మంది ప్రతినిధులు, 4 సంస్థల ప్రతినిధులు సహా మొత్తం 52 మంది ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొంటారు. ఈ రెండు సమావేశాల్లో 200 మందికి పైగా అధికారులు కూడా పాల్గొంటారు.
రాజస్తాన్ లోని ఉదయ్‌పూర్‌లో, అస్సాంలోని కుమార్‌గామ్‌లో ఇప్పటికే షెర్పా సమావేశాలు జరిగాయి. 3వ షెర్పా సభ కర్ణాటకలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం.. ప్రపంచ ప్రఖ్యాత వారసత్వ ప్రదేశం సాంస్కృతికి నిలయం అయిన హంపిలో జరగనుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..