Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

G20 virtual summit: ప్రధాని మోడీ అధ్యక్షతన వర్చువల్ G20 సమ్మిట్‌.. హాజరుకానున్న వ్లాదిమిర్ పుతిన్.. ఆ అంశాలపైనే చర్చ..

భారత్ వేదికగా సెప్టెంబర్ నెలలో దేశ రాజధాని ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో జీ 20 శిఖరాగ్ర సదస్సును విజయవంతంగా నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ నెలలో గ్రూప్ ఆఫ్ 20 భారత్ అధ్యక్ష పదవిని ముగించే ముందు ఢిల్లీ డిక్లరేషన్‌ను అమలు చేయడంపై చర్చించడానికి ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం సాయంత్రం వర్చువల్ G20 నాయకుల శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించనున్నారు.

G20 virtual summit: ప్రధాని మోడీ అధ్యక్షతన వర్చువల్ G20 సమ్మిట్‌.. హాజరుకానున్న వ్లాదిమిర్ పుతిన్.. ఆ అంశాలపైనే చర్చ..
Pm Modi Putin
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Nov 22, 2023 | 9:08 AM

భారత్ వేదికగా సెప్టెంబర్ నెలలో దేశ రాజధాని ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో జీ 20 శిఖరాగ్ర సదస్సును విజయవంతంగా నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ నెలలో గ్రూప్ ఆఫ్ 20 భారత్ అధ్యక్ష పదవిని ముగించే ముందు ఢిల్లీ డిక్లరేషన్‌ను అమలు చేయడంపై చర్చించడానికి ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం సాయంత్రం వర్చువల్ G20 నాయకుల శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ G20 సమ్మిట్‌ వర్చువల్ సమావేశానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హాజరు కానున్నట్లు క్రెమ్లిన్ ధృవీకరించింది. అయితే, న్యూఢిల్లీలో జరిగిన జీ20 సదస్సుకు పుతిన్, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌లు గైర్హాజరయ్యారు. రష్యా ప్రతినిధి బృందానికి ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్, చైనాకు దాని ప్రధాన మంత్రి లీ కియాంగ్ నాయకత్వం వహించారు. ఈ క్రమంలో తాజాగా జరిగే సమావేశానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హాజరుకానున్నారు. అయితే, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ హాజరుపై ఆ దేశం ఎలాంటి వివరాలను ప్రకటించలేదు. ఈ సమావేశానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, పలు దేశాల అధినేతలు పాల్గొననున్నారు.

అయితే, వర్చువల్G20 లీడర్స్ సమ్మిట్ సాయంత్రం 5:30 గంటల నుంచి జరగనుంది. వర్చువల్ సమ్మిట్‌లో గ్లోబల్ లీడర్‌లు ప్రసంగించనున్నారు. ప్రధానంగా కీలక సమస్యలను పరిష్కరించేలా అగ్రనేతల మధ్య చర్చ జరగనుంది. సెప్టెంబర్‌లో జీ20 సమ్మిత్ తీర్మానాలు.. వాటిని అమలు చేయడం.. అప్పటి నుండి జరిగిన పరిణామాలను సమీక్షించనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న సమస్యలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, వాతావరణ ఎజెండా, డిజిటలైజేషన్, ఇతర అంశాలపై సుధీర్ఘంగా చర్చించనున్నారు. ఈ G20 వర్చువల్ సమ్మిట్ UN జనరల్ అసెంబ్లీ అత్యున్నత స్థాయి వారం 78వ సెషన్, SDG సమ్మిట్ ముగిసినప్పటి నుండి ప్రపంచ నాయకుల ప్రధాన సమావేశం అవుతుంది” అని G20 షెర్పా విలేకరుల సమావేశంలో అమితాబ్ కాంత్ తెలిపారు.

సెప్టెంబరు 10న G20 సమ్మిట్ ముగింపు కార్యక్రమంలో నవంబర్ 22న భారతదేశం G20 ప్రెసిడెన్సీ ముగియడానికి ముందు భారతదేశం ఒక వాస్తవిక G20 లీడర్స్ సమ్మిట్‌ను నిర్వహిస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగే వర్చువల్ G20 లీడర్స్ సమ్మిట్ కు ఆఫ్రికన్ యూనియన్ నేతలు సహా మొత్తం G20 సభ్యుల నాయకులు, అలాగే తొమ్మిది అతిథి దేశాలు, 11 అంతర్జాతీయ సంస్థల అధిపతులను ఆహ్వానించారు. వర్చువల్ G20 సమ్మిట్ “సంబంధిత జాతీయ -అంతర్జాతీయ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా సహా వివిధ G20 నిర్ణయాలను సమర్థవంతంగా అమలు చేయడానికి ముందుకు వస్తుందని” విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..