Rafale deal: ఫ్రెంచి పోర్టల్ వార్తతో రఫేల్ విమానాల డీల్‌పై మళ్లీ రగడ.. కాంగ్రెస్-బీజేపీ మధ్య మాటల యుద్ధం!
రఫెల్ రగడ కాంగ్రెస్-బీజేపీ మధ్య మళ్లీ మాటల యుద్దానికి దారితీసింది.రఫేల్ యుద్ద విమానాల కొనుగోలుపై రగడ ఇప్పట్లో చల్లారే అవకాశాలు కనిపించడం లేదు.
Rafale deal Controversy: రఫెల్ రగడ కాంగ్రెస్-బీజేపీ మధ్య మళ్లీ మాటల యుద్దానికి దారితీసింది.రఫేల్ యుద్ద విమానాల కొనుగోలుపై రగడ ఇప్పట్లో చల్లారే అవకాశాలు కనిపించడం లేదు. రఫేల్ కొనుగోళ్లల మధ్యవర్తులకు ముడుపుల వ్యవహారం మళ్లీ తెరపైకి రావడం సంచలనం రేపుతోంది. రఫెల్ యుద్ద విమానాలను తయారు చేసే ఫ్రాన్స్ కంపెనీ దసో కంపెనీ అటు యుపీఏ హయాంలోను, ఇటు ఎన్‌డీఏ హయంలో ముడుపులు చెల్లించినట్టు తాజాగా ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై ఆధారాలు ఉన్నప్పటికి సీబీఐ, ఈడీ లాంటి సంస్థలు విచారణ జరపలేదని ఫ్రెంచ్ పోర్టల్ మీడియా పార్ట్‌లో వచ్చిన వార్త తాజాగా తీవ్ర కలకలం రేపుతోంది. మీడియా పార్ట్‌లో వచ్చిన వార్తపై కాంగ్రెస్ – బీజేపీ నేతల మధ్య మాటలయుద్దం జరుగుతోంది.
రఫేల్ యుద్ద విమానాల కొనుగోళ్లలో మధ్యవర్తిగా ఉన్న సుషేన్ గుప్తాకు రూ.110 కోట్ల ముడుపులు ముట్టినట్టు తాజాగా మీడియా పార్ట్‌లో కథనం వెలువడింది. 2002-2012 వరకు రఫెల్ యుద్ద విమానాల కొనుగోళ్ల డీల్‌లో సుషేన్ గుప్తాకు దసో సంస్థ ఈ ముడుపులు ఇచ్చినట్టు తాజాగా ఆరోపణలు వస్తున్నాయి. సుషేన్‌గుప్తాకు ముడుపుల వ్యవహారంపై భారత దర్యాప్తు సంస్థల దగ్గర ఆధారాలు ఉన్నప్పటికి విచారణ జరపడంలో విఫలమైనట్టు విమర్శలు వస్తున్నాయి.
ఆగస్టా-వెస్ట్ ల్యాండ్ కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లలోనే రఫెల్ ముడుపుల వ్యవహారానికి సంబంధించిన చెల్లింపుల వివరాలు ఉన్నట్టు తెలుస్తోంది. 2007-2012 యుపిఏ హయాం లోనే ఈ ముడుపులు చెల్లించారని బీజేపీ ఆరోపించింది. బీజేపీపై అసత్య ఆరోపణలు చేశారని అన్నారు ఆ పార్టీ అధికార ప్రతినిధి సంబిద్ పాత్ర. కాంగ్రెస్ పార్టీ పేరును i need commission గా మార్చుకుంటే బాగుంటుందని సెటైర్ విసిరారు. అయితే ఈ ఆరోపణలను కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. ప్రధాని కార్యాలయం ఒత్తిళ్ల తోనే రఫెల్ ముడుపుల వ్యవహారంపై సీబీఐ ,ఈడీ దర్యాప్తు జరపడం లేదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా ఆరోపించారు. రఫెల్ యుద్ద కొనుగోళ్ల వ్యవహారంలో దేశ ఖజానాకు భారీ నష్టం జరిగిందని, దీనిపై జేపీసీతో దర్యాప్తు జరిపించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.