AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sharmistha met Modi: ప్రధాని మోదీని కలిసి ప్రత్యేక బహుమతి ఇచ్చిన ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ట

రచయిత, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ఠ ముఖర్జీ సోమవారం భారత ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఈ సందర్భంగా శర్మిష్ఠ ముఖర్జీ తన 'ప్రణబ్ మై ఫాదర్.. ఎ డాటర్ రిమెంబర్స్' పుస్తకాన్ని ప్రధాని మోదీకి బహూకరించారు. ఈ పుస్తకావిష్కరణ సందర్భంగా తీవ్ర దుమారం రేగింది. ప్రస్తుతం సమయంలో శర్మిష్ఠ భేటీ కావడం ప్రధాన సంతరించుకుంది.

Sharmistha met Modi: ప్రధాని మోదీని కలిసి ప్రత్యేక బహుమతి ఇచ్చిన ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ట
Sharmistha Met Modi
Balaraju Goud
|

Updated on: Jan 15, 2024 | 3:56 PM

Share

రచయిత, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ఠ ముఖర్జీ సోమవారం భారత ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఈ సందర్భంగా శర్మిష్ఠ ముఖర్జీ తన ‘ప్రణబ్ మై ఫాదర్.. ఎ డాటర్ రిమెంబర్స్’ పుస్తకాన్ని ప్రధాని మోదీకి బహూకరించారు. ఈ పుస్తకావిష్కరణ సందర్భంగా తీవ్ర దుమారం రేగింది. ప్రస్తుతం సమయంలో శర్మిష్ఠ భేటీ కావడం ప్రధాన సంతరించుకుంది.

శర్మిష్ట ముఖర్జీ ప్రధాని మోదీని కలిసిన ఫోటోను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో ఇలా రాశారు, “నేను నా పుస్తకం ‘ప్రణబ్ మై ఫాదర్: ఎ డాటర్ రిమెంబర్స్’ కాపీని ఆయనకు ఇచ్చాను. ఎప్పటిలాగే, అతను నా పట్ల అదరాభిమానాన్ని చాటారని, బాబా (ప్రణబ్ ముఖర్జీ) పట్ల అతని గౌరవం ఏమాత్రం తగ్గలేదు. ధన్యవాదాలు అండి.” అంటూ సోషల్ మీడియా వేదికగా రాసుకొచ్చారు శర్మిష్ఠ.

శర్మిష్ట ముఖర్జీ రాసిన పుస్తకం ‘ప్రణబ్ మై ఫాదర్: ఎ డాటర్ రిమెంబర్స్’ దేశ వ్యాప్తంగా దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గురించి పలు విషయాలు వెల్లడయ్యాయి. ఈ పుస్తకంలో తన తండ్రి ప్రణబ్ ముఖర్జీ చెప్పిన విషయాన్ని ప్రస్తావిస్తూ, రాహుల్ గాంధీని తాను అపరిపక్వ నాయకుడిగా భావిస్తున్నానని, చాలా విషయాలపై ఆయనకున్న పట్టు బలహీనంగా ఉందని శర్మిష్ట పేర్కొన్నారు.

ఒకసారి తన తండ్రిని (ప్రణబ్ ముఖర్జీ) తాను ప్రధాని ఎందుకు కాలేదా అని అడిగానని, ముఖర్జీ పుస్తకంలో రాశారు. ఈ సందర్భంగా దివంగత ప్రణబ్ ముఖర్జీ సమాధానం ఇస్తూ సోనియా గాంధీ తనను ప్రధానిని చేయరని చెప్పారని శర్మిష్ఠ తన పుస్తకంలో పేర్కొన్నారు. ప్రణబ్ ముఖర్జీ డైరీ ఎంట్రీల ఆధారంగా ఈ పుస్తకం రూపొందించడం గమనార్హం.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…