Rahul Gandhi: ఈ సమస్యలపై గళాన్ని వినిపించేందుకే భారత్ జోడో న్యాయ్ యాత్ర: రాహుల్ గాంధీ
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర రెండో రోజుకు చేరుకుంది. సోమవారం తెల్లవారుజామున మణిపూర్‌లోని ఇంఫాల్ వెస్ట్ నుంచి తిరిగి యాత్రను ప్రారంభించారు రాహుల్ గాంధీ. పార్టీ సోషల్ మీడియా ప్రతినిధి సుప్రియా ష్రినేట్ ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేసారు.

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర రెండో రోజుకు చేరుకుంది. సోమవారం తెల్లవారుజామున మణిపూర్‌లోని ఇంఫాల్ వెస్ట్ నుంచి తిరిగి యాత్రను ప్రారంభించారు రాహుల్ గాంధీ. పార్టీ సోషల్ మీడియా ప్రతినిధి సుప్రియా ష్రినేట్ ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేసారు. “న్యాయం కోసం గళం విప్పుతూ ప్రతి అన్యాయానికి వ్యతిరేకంగా మీ వెంట ఉంటాను, మీ మాట వింటాను” అంటూ రాహుల్ గాంధీ యాత్రలో జోష్ నింపారు. దేశంలోని నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, పేదరికం, నేరాలు, అభద్రతపై తన గళాన్ని వినిసిస్తూ ఐక్యంగా ఒక పరిష్కారాన్ని కనుగొంటామంటున్నారు.
కాగా, ఆదివారం మణిపూర్‌లోని తౌబాల్ నుంచి పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, వాయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ యాత్రను జెండా ఊపి ప్రారంభించారు. యాత్ర ప్రారంభానికి ముందు రాష్ట్రంలో జరిగిన హింసాకాండలో మృతి చెందిన వ్యక్తులకు పార్టీ నాయకులు, కార్యకర్తలు శ్రద్ధాంజలి ఘటించారు. ఆ కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ మృతులకు నివాళులర్పించారు. దేశంలో ‘తీవ్ర అన్యాయం’ జరుగుతున్నందున ప్రజలకు న్యాయం జరిగేలా తమ పార్టీ భారత్ జోడో న్యాయ్ యాత్రను ప్రారంభించిందని రాహుల్ గాంధీ ఆదివారం అన్నారు.
“భారత్ జోడో న్యాయ్ యాత్ర ఎందుకు అనే ప్రశ్నలు తలెత్తాయన్నారు రాహుల్ గాంధీ. దీనికి సమాధానంగా.. భారతదేశంలో మనం చాలా అన్యాయానికి గురవుతున్నాము. ఇది సామాజిక, రాజకీయ, ఆర్థికంగా ఇలా అన్ని రకాలుగా ఉంటుందని మణిపూర్‌లోని తౌబాల్ నుండి తన యాత్రను ప్రారంభించిన తర్వాత రాహుల్ గాంధీ అన్నారు. జాతి కలహాలతో అట్టుడుకుతున్న రాష్ట్రానికి దేశ ప్రధాని ప్రజల కన్నీళ్లు తుడవడానికి రాకపోవడం సిగ్గుచేటని అన్నారు.
गर्व है अपने नेता पर, फ़क्र है कि मैं इस ऐतिहासिक मुहिम का हिस्सा हूँ
ये वो उड़ान है जो आरंभ है संघर्ष का हर उस अन्याय के ख़िलाफ़ जो दस साल इस देश ने झेला है
• बेरोज़गारी का अन्याय• महंगाई का अन्याय• आर्थिक असमानता का अन्याय • ग़रीबी का अन्याय • टैक्स के आतंक का… pic.twitter.com/BBOxUJk2uZ
— Supriya Shrinate (@SupriyaShrinate) January 14, 2024
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








