- Telugu News Photo Gallery Political photos Rahul Gandhi's Diminishing Team: These 11 Congress Leaders Quit Party Fold In Last Five Years
Biggest Congress Exits: దెబ్బమీద దెబ్బ.. గడచిన ఐదేళ్లలో కాంగ్రెస్ పార్టీని వీడిన ఆ 11 మంది సీనియర్ నేతలు వీరే!
రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర ఈ రోజు (జనవరి 14) ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే ఇదే రోజున కాంగ్రెస్‌కు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. కేంద్ర మాజీ మంత్రి మిలింద్ దేవరా పార్టీని వీడారు. ఆయన మహారాష్ట్రలో ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో చేరే అవకాశం ఉంది. మరోవైపు అపూర్బా భట్టాచార్య కూడా అస్సాంలో కాంగ్రెస్ కార్యదర్శి పదవికి రాజీనామా చేశారు. గత లోక్‌సభ ఎన్నికల నుంచి అంటే 2019 నుంచి పలువురు సీనియర్ నేతలు కాంగ్రెస్‌కు వరుసగా గుడ్‌బై చెబుతున్నారు. గత ఏడాది మే 16న సీనియర్ నేత కపిల్ సిబల్ కాంగ్రెస్‌ను వీడి, ఎస్పీ మద్దతుతో..
Updated on: Jan 14, 2024 | 8:15 PM

రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర ఈ రోజు (జనవరి 14) ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే ఇదే రోజున కాంగ్రెస్‌కు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. కేంద్ర మాజీ మంత్రి మిలింద్ దేవరా పార్టీని వీడారు. ఆయన మహారాష్ట్రలో ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో చేరే అవకాశం ఉంది. మరోవైపు అపూర్బా భట్టాచార్య కూడా అస్సాంలో కాంగ్రెస్ కార్యదర్శి పదవికి రాజీనామా చేశారు.

గత లోక్‌సభ ఎన్నికల నుంచి అంటే 2019 నుంచి పలువురు సీనియర్ నేతలు కాంగ్రెస్‌కు వరుసగా గుడ్‌బై చెబుతున్నారు. గత ఏడాది మే 16న సీనియర్ నేత కపిల్ సిబల్ కాంగ్రెస్‌ను వీడి, ఎస్పీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా రాజ్యసభలో చేరారు.

మరో సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ 2022లో కాంగ్రెస్‌ను వీడారు. ప్రస్తుతం అతను జమ్మూ కాశ్మీర్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ సభ్యుడు.

గత ఏడాది కాంగ్రెస్‌కు చెందిన పలువురు ప్రముఖులు వరుసగా పార్టీని వీడారు. గుజరాత్ కాంగ్రెస్ నాయకులలో ఒకరైన హార్దిక్ పటేల్ 2022 మేలో కాంగ్రెస్‌ను వీడి, బీజేపీలో చేరారు.

సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఎకె ఆంటోనీ కుమారుడు అనిల్ ఆంటోనీ గత ఏడాది జనవరిలో కాంగ్రెస్‌ను విడిచిపెట్టి ఒక నెల తర్వాత బీజేపీలో చేరారు.

కేంద్ర మాజీ మంత్రి అశ్వనీ కుమార్ 2022 ఫిబ్రవరిలో హస్తం పార్టీని వీడారు. ఆయన మొదటి యూపీఏ ప్రభుత్వంలో సీనియర్ మంత్రిగా పనిచేశారు.

పంజాబ్ కాంగ్రెస్ సీనియర్ నేతల్లో ఒకరైన సునీల్ జఖర్ 2022లో అప్పటి పంజాబ్ ముఖ్యమంత్రిని బహిరంగంగా విమర్శించినందుకు గానూ.. ఆయనను పార్టీ నుంచి బహిష్కరించారు. ఆ తర్వాత పార్టీ మారిన ఆయన పంజాబ్ బీజేపీ చీఫ్ అయ్యారు.

ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ నేత ఆర్పీఎన్ సింగ్ గతేడాది జనవరిలో పార్టీని వీడారు. ప్రియాంక గాంధీ నేతృత్వంలోని అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కార్నర్ కావడం వల్ల ఆయన రాజీనామా చేశారు. తర్వాత బీజేపీలో చేరారు.

రాహుల్ గాంధీ సన్నిహితుడు, కేంద్ర మాజీ మంత్రి జితిన్ ప్రసాద్ 2021లో కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు.

కేంద్ర మాజీ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా గత లోక్‌సభ ఎన్నికల తర్వాత కమల్‌నాథ్‌తో విభేదాల కారణంగా 2020 జనవరిలో కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు.

గుజరాత్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే అల్పేష్ ఠాకూర్ 2019లో పార్టీని విడిచిపెట్టి, బీజేపీలో చేరారు.




