AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ayodhya: అయోధ్యకు రాముడు రావడం లేదు.. బీహార్ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు

అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠాపన కార్యక్రమం మొత్తం ఎన్నికల స్టంట్ అని బీహార్ మంత్రి, మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజ్ ప్రతాప్ సింగ్ అన్నారు. ఆదివారం ఆయన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

Ayodhya: అయోధ్యకు రాముడు రావడం లేదు..  బీహార్ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు
Tej Pratap Yadav
Balaraju Goud
|

Updated on: Jan 15, 2024 | 4:13 PM

Share

అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠాపన కార్యక్రమం మొత్తం ఎన్నికల స్టంట్ అని బీహార్ మంత్రి, మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజ్ ప్రతాప్ సింగ్ అన్నారు. ఆదివారం ఆయన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జనవరి 22 న అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి రాముడు రాడని స్పష్టం చేశారు. ఈ విషయం స్వయంగా రాముడే తన కలలోకి వచ్చి చెప్పాడని వివరించారు. అయోధ్యలో ఇప్పుడు హిపోక్రసీ నెలకొందని, అలాంటి చోటుకు తాను వెళ్లబోనని చెప్పాడన్నారు. ఎన్నికలు అయిపోయాక అంతా మరిచిపోతారని వ్యాఖ్యానించినట్లు తేజ్ ప్రతాప్ తెలిపారు.

ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరు కావడంలేదంటూ నలుగురు శంకరాచార్యులు ఇప్పటికే ప్రకటించారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఆ నలుగురు శంకరాచార్యుల కలలోకి వెళ్లి ఇదే విషయం చెప్పినట్లు రాముడు తనతో పేర్కొన్నాడన్నారు. అందుకే వారు అయోధ్యకు రావడం లేదని తేజ్ ప్రతాప్ వివరించారు. కాగా, తేజ్ ప్రతాప్ వ్యాఖ్యలపై కానీ, అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం విషయంపై కానీ ఆయన సోదరుడు, బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ ఎలాంటి కామెంట్ చేయలేదు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

ఆయిల్ ఫ్రీ ఆమ్లెట్.. చుక్క నూనెలేకుండా టేస్టీటేస్టీగా చేసుకోండి
ఆయిల్ ఫ్రీ ఆమ్లెట్.. చుక్క నూనెలేకుండా టేస్టీటేస్టీగా చేసుకోండి
భారత గడ్డపై డారిల్ మిచెల్ అన్ స్టాపబుల్ రికార్డ్
భారత గడ్డపై డారిల్ మిచెల్ అన్ స్టాపబుల్ రికార్డ్
భద్రతా దళాలు-ఉగ్రవాదుల మధ్య భీకర ఎన్‌కౌంటర్!
భద్రతా దళాలు-ఉగ్రవాదుల మధ్య భీకర ఎన్‌కౌంటర్!
సిపిఐ శతాబ్ది ఉత్సవాలు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం..
సిపిఐ శతాబ్ది ఉత్సవాలు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం..
క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లించకపోతే మిమ్మల్ని అరెస్టు చేయవచ్చా?
క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లించకపోతే మిమ్మల్ని అరెస్టు చేయవచ్చా?
ఒకే రోజు ఏడు వాహనాలపై భక్తులను క‌టాక్షించ‌నున్న మలయప్ప స్వామి
ఒకే రోజు ఏడు వాహనాలపై భక్తులను క‌టాక్షించ‌నున్న మలయప్ప స్వామి
ఆటోలో అనుమానాస్పదంగా కనిపించిన నీలి రంగు పెట్టె..!
ఆటోలో అనుమానాస్పదంగా కనిపించిన నీలి రంగు పెట్టె..!
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
ఒకే బ్యాటర్ పై మూడు సార్లు అటాక్..హర్షిత్ హ్యాట్రిక్ రికార్డ్
ఒకే బ్యాటర్ పై మూడు సార్లు అటాక్..హర్షిత్ హ్యాట్రిక్ రికార్డ్
ఆలయానికి ఏ పండు తీసుకెళ్తే శుభ ప్రదం.? ఎలాంటి ఫలితం వస్తుందో..
ఆలయానికి ఏ పండు తీసుకెళ్తే శుభ ప్రదం.? ఎలాంటి ఫలితం వస్తుందో..