AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ayodhya Township: అయోధ్యలో అద్భుతమైన టౌన్‌షిప్.. ప్రత్యేకత ఏంటో తెలుసా?

రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే భూమిని పొందిన 'నవీ అయోధ్య' భారతదేశపు మొట్టమొదటి వాస్తు ఆధారిత టౌన్‌షిప్ అని ఆయన మీడియా నివేదికలో తెలిపారు. జనవరి 22న రామమందిరం ప్రారంభోత్సవం జరగనుండగా, ఈ ప్రాంతంలో వాణిజ్య, నివాసాల అభివృద్ధికి డెవలపర్లు భూములు సేకరించేందుకు పందెం కాస్తున్నారు. కొత్త అయోధ్య దేశంలోని అత్యుత్తమ నగరాల్లో ఒకటిగా మారబోతోందని..

Ayodhya Township: అయోధ్యలో అద్భుతమైన టౌన్‌షిప్.. ప్రత్యేకత ఏంటో తెలుసా?
Ayodhya Township
Subhash Goud
|

Updated on: Jan 15, 2024 | 10:24 AM

Share

అయోధ్యలో రామ మందిర నిర్మాణం ప్రారంభమైనప్పటి నుంచి అయోధ్య మ్యాప్‌ను మార్చేందుకు సన్నాహాలు కూడా ప్రారంభమయ్యాయి. జనవరి 22న ఆలయంలో ప్రాణ ప్రతిష్ట నిర్వహించనున్నారు. దీనితో పాటు అయోధ్య పునర్నిర్మాణానికి సన్నాహాలు కూడా ప్రారంభమవుతాయి. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అయోధ్యలో 1,000 ఎకరాల విస్తీర్ణంలో టౌన్‌షిప్‌ను ప్లాన్ చేసింది. ఇది ఆధునిక, సాంప్రదాయ నిర్మాణాల సమ్మేళనంగా ఉంటుందని రాష్ట్ర గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి నితిన్ గోకర్న్ మీడియాకు తెలిపారు.

దేశంలోనే ఇది తొలి టౌన్‌షిప్‌

రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే భూమిని పొందిన ‘నవీ అయోధ్య’ భారతదేశపు మొట్టమొదటి వాస్తు ఆధారిత టౌన్‌షిప్ అని ఆయన మీడియా నివేదికలో తెలిపారు. జనవరి 22న రామమందిరం ప్రారంభోత్సవం జరగనుండగా, ఈ ప్రాంతంలో వాణిజ్య, నివాసాల అభివృద్ధికి డెవలపర్లు భూములు సేకరించేందుకు పందెం కాస్తున్నారు. కొత్త అయోధ్య దేశంలోని అత్యుత్తమ నగరాల్లో ఒకటిగా మారబోతోందని గోకర్ణ్ అన్నారు.

ఇటీవలే ఓ హోటల్ కోసం భూమిని వేలం వేశామని, అక్కడ రిజర్వు ధర చదరపు మీటరుకు రూ.88,000, విజయవంతమైన బిడ్ చదరపు మీటరుకు రూ.108,000. నానాటికీ పెరుగుతున్న డిమాండ్‌ను ప్రభుత్వం దృష్టిలో ఉంచుతోందని గోకర్న్ అన్నారు. రాష్ట్ర అతిథి గృహాల కోసం ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ప్రారంభించింది. అలాగే తరువాత వాణిజ్య అభివృద్ధి ప్లాట్లను వేలానికి ఉంచింది. క్లీన్ ప్రాపర్టీల కొరత ఉందని, డెవలపర్‌లకు అలాంటి భూమిని స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన అన్నారు.

50 శాతం ధర పెరిగింది

ఆగస్టు 2020లో గ్రాండ్‌ రామ్‌ టెంపుల్‌ శంకుస్థాపన జరిగినప్పటి నుంచి నగరంలో భూముల ధరలు, ఆస్తులకు సంబంధించిన లావాదేవీలు 50 శాతం పెరిగాయి. రియల్ ఎస్టేట్ సంస్థ 2A కో వ్యవస్థాపకుడు, ఎండీ అమిత్ అగర్వాల్ మాట్లాడుతూ, పర్యాటకుల రద్దీని పెంచే విధంగా అయోధ్యలో భూమిని కొనుగోలు చేయడానికి దేశవ్యాప్తంగా డెవలపర్లు ఆసక్తిగా ఉన్నారు. ప్రభుత్వ భూమి డెవలపర్‌లకు సురక్షితమైన ఎంపిక. ప్రణాళికాబద్ధమైన టౌన్‌షిప్‌లు భారీ పెట్టుబడిని ఆకర్షిస్తాయి. భూసేకరణ నిబంధనలపై అనిశ్చితి కారణంగా దేశీయ పెట్టుబడిదారులు మాత్రమే అయోధ్యలో అమ్మకాలను పెంచుతున్నారు. ఈ సెక్టార్‌లో రోజుకు సగటు డీల్‌ల సంఖ్య ఈవెంట్‌కు ముందు 15-20 నుండి 25-30 మధ్య పెరిగింది.

రోజుకు లక్ష మంది భక్తులు వస్తారని అంచనా

రామమందిర్ ట్రస్ట్ అంచనా ప్రకారం.. ఆలయానికి రోజుకు 80,000-100,000 మంది సందర్శకులు రావచ్చని అంచనా. 16వ శతాబ్దానికి చెందిన మసీదును కూల్చివేసిన నగరంలోని వివాదాస్పద మత స్థలాన్ని సుప్రీంకోర్టు హిందువులకు అప్పగించిన వెంటనే, 2019లో అయోధ్యలో ఆస్తుల ధరలు 25-30 శాతం పెరుగుతాయని అంచనా. ప్రస్తుతం ఉన్న రాయితీలు, ప్రోత్సాహకాల విధానాల ప్రకారం.. పెట్టుబడిదారులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని పరిపాలన తెలిపింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి