AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breakfast: బ్రేక్ ఫాస్ట్ తినడానికి బెస్ట్ సమయం.. ఇంటర్నేషనల్‌ స్టడీ ఏం చెబుతుందంటే!

ఒక మనిషి ఆరోగ్యంగా ఉండేందుకు ఉదయం తినే అల్పాహారం చాలా ముఖ్యం. అలాగే మధ్యాహ్నం, రాత్రి భోజనం సమయాలు కూడా ఇంపార్టెన్సే. ఇవి గుండె ఆరోగ్యంపై నేరుగా ప్రభావం చూపిస్తాయని అంటున్నారు నిపుణులు. కాబట్టి బ్రేక్ ఫాస్ట్, భోజనం తినడానికి ఒక సమయం ఖచ్చితంగా కావాలి. ఉదయం బ్రేక్ ఫాస్ట్ ఏ సమయానికి తింటే మంచిదో.. తాజాగా జరిగిన అంతర్జాతీయ అధ్యయనం సూచిస్తుంది. అదే విధంగా ఏ సమయానికి తింటే మంచిదో వివరిస్తోంది. మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ తినడంలో అలసత్వం కారణంగా గుండె సంబంధిత వ్యాధులు, షుగర్, బీపీ..

Breakfast: బ్రేక్ ఫాస్ట్ తినడానికి బెస్ట్ సమయం.. ఇంటర్నేషనల్‌ స్టడీ ఏం చెబుతుందంటే!
ఉదయం బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోవడం వల్ల వచ్చే ప్రమాదం ఏం లేదని.. పైగా ఆరోగ్యానికి మంచిది అని అంటున్నాయి తాజా పరిశోధనలు. ఇంతకీ బ్రేక్ ఫాస్ట్ చేస్తే మంచిదా..? చేయక పోతే మంచిదా? తాజా పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే..
Chinni Enni
| Edited By: |

Updated on: Jan 15, 2024 | 12:35 PM

Share

ఒక మనిషి ఆరోగ్యంగా ఉండేందుకు ఉదయం తినే అల్పాహారం చాలా ముఖ్యం. అలాగే మధ్యాహ్నం, రాత్రి భోజనం సమయాలు కూడా ఇంపార్టెన్సే. ఇవి గుండె ఆరోగ్యంపై నేరుగా ప్రభావం చూపిస్తాయని అంటున్నారు నిపుణులు. కాబట్టి బ్రేక్ ఫాస్ట్, భోజనం తినడానికి ఒక సమయం ఖచ్చితంగా కావాలి. ఉదయం బ్రేక్ ఫాస్ట్ ఏ సమయానికి తింటే మంచిదో.. తాజాగా జరిగిన అంతర్జాతీయ అధ్యయనం సూచిస్తుంది. అదే విధంగా ఏ సమయానికి తింటే మంచిదో వివరిస్తోంది. మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ తినడంలో అలసత్వం కారణంగా గుండె సంబంధిత వ్యాధులు, షుగర్, బీపీ, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే అవకాశాలు పెరుగుతున్నట్టు ఈ అధ్యయనం చెబుతుంది.

నేచర్ కమ్యూనికేషన్స్ జర్నల్లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. రోజులో మీరు తినే మొదటి భోజనం మీ గుండెపై ప్రభావాన్ని చూపిస్తుంది. ఫ్రాన్స్‌కు చెందిన పరిశోధనా బృందం ఈ అధ్యయనాన్ని నిర్వహించింది. లక్ష మందిపై ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. ఈ అధ్యయనంలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఎన్ని గంటలకు తింటే మంచిది?

భోజనం తినడం లేట్ అవుతున్న కొద్దీ గుండె కొట్టుకునే వేగంలో కూడా మార్పులు ఉంటున్నాయని, ఇది హ‌ృదయ సంబంధ వ్యాధులకు కూడా కారణం అవుతున్నట్లు వెల్లడించారు. రక్త పోటులో హెచ్చుతగ్గులు, గుండె లయ మారడం, స్ట్రోక్, హార్ట్ ఒక్కసారిగా ఆగిపోవడం వంటివి పెరుగుతాయి. ఉదయం అల్పాహారం ఆలస్యం అయ్యే కొద్దీ గంటకు 6 శాతం గుండె పోటు వచ్చే అవకాశాలు ఉన్నాయట. అందుకే ప్రతి రోజూ సమయానికి తినాలి. ప్రతి రోజూ ఉదయం 8 గంటలకు బ్రేక్ ఫాస్ట్ తినడం అలవాటు చేసుకుంటే గుండె వ్యాధులు రాకుండా జాగ్రత్త పడొచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఏ సమయానికి భోజనం చేస్తే మంచిది?

ప్రస్తుత కాలంలో గుండె సంబంధిత వ్యాధులతో బాధ పడేవారి సంఖ్య రోజు రోజుకి పెరుగి పోతుంది. డబ్ల్యూహెచ్వో చెబుతున్న లెక్కల ప్రకారం.. ప్రతి సంవత్సరం కోటి డబ్బై లక్షల మందికి.. గుండె జబ్బులతో మరణిస్తున్నట్టు వెల్లడించింది. అదే విధంగా మధ్యాహ్నం భోజనం కూడా ఒంటి గంటలోపు తినేయాలట. అలాగే రాత్రి 7:30 లోపు ముగిస్తే మంచిది. రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేసే అలవాటు ఉన్నవారిలో గుండె సమస్యలు పెరిగిపోయే అవకాశం ఎక్కువ ఉందని పరిశోధకులు తెలిపారు. ఇలా తినే సమయం పెరుగుతున్నకొద్దీ.. శరీరంలో అనేక మార్పులు చోట చేసుకుంటాయని.. దీని వల్ల వ్యాధులు త్వరగా వచ్చే ఛాన్స్ ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.

Follow Us
శనివారం వెంకటేశ్వర స్వామి దీపారాధన.. ఒక్కసారి చేసేయండి, డబ్బు..
శనివారం వెంకటేశ్వర స్వామి దీపారాధన.. ఒక్కసారి చేసేయండి, డబ్బు..
ఎయిర్ ఇండియా చేసిన పనికి వెనక్కి వచ్చిన విమానం!
ఎయిర్ ఇండియా చేసిన పనికి వెనక్కి వచ్చిన విమానం!
సిలిండర్‌ 14.2 కేజీలే ఎందుకు ఉంటుంది? 15 కేజీలు ఎందుకు ఉండదు?
సిలిండర్‌ 14.2 కేజీలే ఎందుకు ఉంటుంది? 15 కేజీలు ఎందుకు ఉండదు?
భారతదేశంలో ఎప్పటికీ ఫెయిల్యూర్ కాని 5 టాప్ బిజినెస్ ఐడియాలివే!
భారతదేశంలో ఎప్పటికీ ఫెయిల్యూర్ కాని 5 టాప్ బిజినెస్ ఐడియాలివే!
గ్లోబల్ సైజుకు తీసుకెళదామనుకున్న సినమాకు గుర్తింపు లేదా?
గ్లోబల్ సైజుకు తీసుకెళదామనుకున్న సినమాకు గుర్తింపు లేదా?
బ్యాడ్ కొలెస్ట్రాల్ కు చెక్.. గుండెపోటు రాకుండా 5 సూపర్ టిప్స్
బ్యాడ్ కొలెస్ట్రాల్ కు చెక్.. గుండెపోటు రాకుండా 5 సూపర్ టిప్స్
ఉగాది రోజున ఇల్లు శుభ్రం చేస్తుండగా ఘోరం..!
ఉగాది రోజున ఇల్లు శుభ్రం చేస్తుండగా ఘోరం..!
చాణక్యుని 4 సూత్రాలతో మీ రోజును మొదలుపెడితే జీవితంలో విజయం ఖాయం
చాణక్యుని 4 సూత్రాలతో మీ రోజును మొదలుపెడితే జీవితంలో విజయం ఖాయం
మండే ఎండల్లో మిమ్మల్ని చలచల్లగా ఉంచే సూపర్ డ్రింక్స్.. తాగేద్దామా
మండే ఎండల్లో మిమ్మల్ని చలచల్లగా ఉంచే సూపర్ డ్రింక్స్.. తాగేద్దామా
వాస్తు టిప్స్: తడి బట్టలు ఇంట్లో ఆరేస్తున్నారా..అదృష్టం పోయినట్లే
వాస్తు టిప్స్: తడి బట్టలు ఇంట్లో ఆరేస్తున్నారా..అదృష్టం పోయినట్లే