CM KCR: మతతత్వ శక్తులపై పోరాటం కొనసాగించాల్సిందే.. సీఎం కేసీఆర్‌ను అభినందించిన మాజీ ప్రధాని దేవెగౌడ..

HD Devegowda - CM KCR: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న మతతత్వ విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకు సర్వత్రా మద్ధతు లభిస్తున్నది. ఈ మేరకు.. మాజీ ప్రధాని,

CM KCR: మతతత్వ శక్తులపై పోరాటం కొనసాగించాల్సిందే.. సీఎం కేసీఆర్‌ను అభినందించిన మాజీ ప్రధాని దేవెగౌడ..
Hd Devegowda Cm Kcr
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Feb 15, 2022 | 5:32 PM

HD Devegowda – CM KCR: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న మతతత్వ విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకు సర్వత్రా మద్ధతు లభిస్తున్నది. ఈ మేరకు.. మాజీ ప్రధాని, జనతాదళ్ సెక్యులర్ (JDS) జాతీయ అధ్యక్షుడు హెచ్.డి. దేవెగౌడ (HD Devegowda).. సీఎం కేసీఆర్ పోరాటానికి తన సంపూర్ణ మద్ధతు ప్రకటించారు. దేశంలో మతతత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నందుకు దేవగౌడ.. సీఎం కేసీఆర్‌ను అభినందించారు. ఈ మేరకు మంగళవారం సీఎం కేసీఆర్‌ (CM KCR) కు దేవెగౌడ ఫోన్ చేసి ప్రత్యేకంగా సంభాషించారు. ఈ సందర్భంగా దేవగౌడ మాట్లాడుతూ.. ‘‘ రావు సాబ్.. మీరు అద్భుతంగా పోరాడుతున్నారు. పెద్ద యుద్దమే చేస్తున్నారు.. మతతత్వ శక్తుల మీద ఎవరైనా పోరాటాన్ని కొనసాగించాల్సిందే. దేశ లౌకికవాద సంస్కృతిని, దేశాన్ని కాపాడుకునేందుకు మేమందరం మీకు అండగా వుంటాం.. మీ యుద్దాన్ని కొనసాగించండి.. మా సంపూర్ణ మద్దతు మీకు ఉంటుంది.’’ అంటూ దేవగౌడ తన మద్దతును ప్రకటించారు. కాగా.. తాను త్వరలోనే బెంగళూరుకు వచ్చి సమావేశమవుతానని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్.. దేవగౌడకు తెలిపారు.

కాగా.. కేంద్ర బడ్జెట్ నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. రాష్ట్రాల హక్కులను కేంద్రం హరిస్తుందంటూ పేర్కొంటున్నారు. అంతేకాకుండా.. అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలను సైతం ఖండించారు. దీంతోపాటు కేంద్రం అనుసరిస్తున్న తీరుపై సీఎంలు మమతా బెనర్జీ, ఉద్ధవ్ ఠాక్రే, ఎంకే స్టాలిన్ తో కూడా మాట్లాడారు.

Also Read:

CM KCR: తెలంగాణ సీఎం కేసీఆర్‌‌పై కేసు నమోదు చేయనున్న అస్సాం పోలీసులు.. మరింత ముదురుతున్న వివాదం..

Delhi Police: వృద్ధురాలిపై లైంగిక దాడికి పాల్పడిన కామాంధుడి అరెస్ట్.. 16 గంటల్లో..