ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ మండిపాటు, సింగపూర్ హర్షం, ఉభయ దేశాలూ కోవిడ్ పై పోరులో భాగస్వాములేనని ప్రకటన
సింగపూర్ వేరియంట్ కారణంగా పిల్లల్లో కోవిడ్ లక్షణాలు కనబడుతున్నాయని, వెంటనే సింగపూర్ కి ఇండియా నుంచి విమానాలను నిలిపివేయాలని, అలాగే అక్కడి నుంచి ఇక్కడికి ఆ దేశ విమాన సర్వీసులను క్యాన్సిల్ చేయాలంటూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చేసిన...
సింగపూర్ వేరియంట్ కారణంగా పిల్లల్లో కోవిడ్ లక్షణాలు కనబడుతున్నాయని, వెంటనే సింగపూర్ కి ఇండియా నుంచి విమానాలను నిలిపివేయాలని, అలాగే అక్కడి నుంచి ఇక్కడికి ఆ దేశ విమాన సర్వీసులను క్యాన్సిల్ చేయాలంటూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చేసిన ప్రకటనతో సింగపూర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ దేశంలో ప్రమాదకరమైన వేరియంట్లు ఏవీ లేవని, ఈ ప్రకటనను ఖండిస్తున్నామని ఆ దేశ విదేశాంగ శాఖ అసహనం వ్యక్తం చేసింది. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయరాదని అంటూ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చెందింపజేసేవారిపై చర్యలు తీసుకోవడానికకి ఉద్దేశించి తమ దేశంలో ఉన్న చట్టాన్ని వినియోగించుకుంటామని కూడా హెచ్చరించింది.. అయితే కొద్దిలో డ్యామేజీ తప్పిపోయింది. విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్.. వెంటనే స్పందించి..ఢిల్లీ సీఎం ఇండియా కోసం మాట్లాడరని, కోవిడ్19 వేరియంట్ పై మాట్లాడే సత్తా ఆయనకు లేదని వివరించారు. దీంతో సింగపూర్ మెత్తబడి హర్షం వ్యక్తం చేసింది. కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్య ఆయన వ్యక్తిగతమని భారత హోమ్ శాఖ కూడా స్పష్టం చేసింది. నిజానికి కోవిద్ పై పోరులో ఇండియా, సింగపూర్ దేశాలు కలిసికట్టుగా కృషి చేస్తున్నాయని, ఇవి భాగస్వామ్య దేశాలని ఇండియాలోని సింగపూర్ హైకమిషనర్ సైమన్ వాంగ్ అన్నారు.
ఒక దశలో కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలపై సింగపూర్ లోని భారత హైకమిషనర్ కుమారన్ ని పిలిపించి తమ నిరసనను వ్యక్తం చేయాలని కూడా సింగపూర్ ప్రభుత్వం యోచించింది. అసలు సింగపూర్ వేరియంట్ అన్నది లేనే లేదని ఆ దేశ ప్రభుత్వం మళ్ళీ పేర్కొంది. నిజానికి ఇటీవలే ఇండియాలో కోవిద్ రోగులకోసమని సింగపూర్ ప్రభుత్వం కొన్ని క్రయోజెనిక్ ఆక్సిజన్ సిలిండర్లను కూడా పంపింది.
మరిన్ని చదవండి ఇక్కడ : Lockdown Violation : నాగిని డ్యాన్స్ వేపించిన పోలీసులు…వైరల్ అవుతున్న వీడియో.లాక్ డౌన్ నియమాలు అతిక్రమిస్తే ఇక అంతే ..