ఎంతకు తెగించార్రా.. ఇల్లు అద్దెకు తీసుకొని ఏకంగా డ్రగ్స్ ఫ్యాక్టరీని చేశారు
ఉత్తరప్రదేశ్‌లో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్న విదేశీయులు డ్రగ్స్ తయారుచేయడం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే ఆఫ్రికాకు చెందిన తొమ్మిది మంది వ్యక్తులు గ్రేటర్ నోయిడాలోని ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. అయితే వీళ్లు అనుమానం రాకుండా డ్రగ్స్ తయారు చేయడం మొదలుపెట్టారు.

ఉత్తరప్రదేశ్‌లో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్న విదేశీయులు డ్రగ్స్ తయారుచేయడం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే ఆఫ్రికాకు చెందిన తొమ్మిది మంది వ్యక్తులు గ్రేటర్ నోయిడాలోని ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. అయితే వీళ్లు అనుమానం రాకుండా డ్రగ్స్ తయారు చేయడం మొదలుపెట్టారు. గుట్టుచప్పుడు కాకుండా కొంతకాలం పాటు ఈ వ్యవహారాన్ని నడిపించారు. అయితే ఈ నిందితులు ఇంట్లో ఉంటూ డ్రగ్స్ తయారు చేసి సరఫరా చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం చేరింది. ఆ ఇంటిపై సోదాలు చేసి ఎట్టకేలకు తొమ్మిదిమంది విదేశీయుల్ని అరెస్టు చేశారు.
వారి నుంచి అంతర్జాతీయ మార్కెట్‌లో రూ.200 కోట్ల విలువైన 46 కిలోల మేథాంఫెటమైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు సుమారు రూ.100 కోట్ల విలువైన మెథాంఫెటమైన్‌ను ఉత్పత్తి చేయడానికి ఉపయోగించే ముడిసరుకును కూడా స్వాధీనం చేసుకున్నారు. వారి నుంచి స్వాధీనం చేసుకున్న వాటిలో మిథైల్ ఆల్కహాల్, హైపో ఫాస్ఫారిక్ యాసిడ్, హైడ్రోసల్ఫ్యూరిక్ యాసిడ్, అయోడిన్ క్రిస్టల్స్, అమ్మోనియా, ఎఫిడ్రిన్, అసిటోన్, సల్ఫర్, కాపర్ సాల్ట్ లాంటివి ఉన్నట్లు తెలిపారు.




మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..




