Father-In-Law Property: రూ.300 కోట్ల ఆస్తి కోసం కోడలి కిరాతకం.. సొంత మామకే స్కెచ్! కట్‌చేస్తే దిమ్మతిరిగే షాక్
చక్కని సంసారం, కోట్ల ఆస్తి, ఒద్దికైన కుటుంబం.. ఇవన్నీ ఉన్నా ఆమెకు తృప్తికలగలేదు. ఏకంగా అత్తింటి ఆస్తినే కాజేచాలనే దుర్భుద్ధి ఆమెలో పుట్టింది. దీంతో సమాజంలో మంచి హోదా, గౌరవం ఉన్నా మామను హత్య చేస్తే.. రూ.300 కోట్ల ఆస్తికి తానొక్కతే రాణి అవుతుందని కలలు కంది. అంతే రూ. కోటి సుపారీ ఇచ్చి మామను కారుతో ఢీ కొట్టి చంపించింది. కాని విధి ఆమెను పట్టించింది. ఈ దారుణ ఘటన నాగపూర్‌లో..
నాగపూర్, జూన్ 13: చక్కని సంసారం, కోట్ల ఆస్తి, ఒద్దికైన కుటుంబం.. ఇవన్నీ ఉన్నా ఆమెకు తృప్తికలగలేదు. ఏకంగా అత్తింటి ఆస్తినే కాజేచాలనే దుర్భుద్ధి ఆమెలో పుట్టింది. దీంతో సమాజంలో మంచి హోదా, గౌరవం ఉన్నా మామను హత్య చేస్తే.. రూ.300 కోట్ల ఆస్తికి తానొక్కతే రాణి అవుతుందని కలలు కంది. అంతే రూ. కోటి సుపారీ ఇచ్చి మామను కారుతో ఢీ కొట్టి చంపించింది. కాని విధి ఆమెను పట్టించింది. ఈ దారుణ ఘటన నాగపూర్‌లో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం..
అర్చన మనీశ్ పుట్టెవార్ (53) ప్రభుత్వ టౌన్ ప్లానింగ్ విభాగంలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేస్తుంది. ఆమె భర్త మనీశ్ వృత్తిరిత్యా డాక్టర్. అయితే అర్చనకు మామ పురుషోత్తం పుట్టెవార్ (82) ఆస్తిపై కన్ను పడింది. అత్త శకుంతల అనారోగ్యంతో ఎలాగూ మంచం పట్టింది. మామను కూడా అడ్డు తొలిగించుకుంటే రూ.300 కోట్ల ఆస్తి మొత్తం తన సొంతం అవుతుందని అత్యాశకు పోయింది. వెంటనే మామ హత్యకు కుట్ర పథకం పన్ని తన భర్త వద్ద డ్రైవర్‌గా పని చేసే బగ్డే, అతడి స్నేహితులు నీరజ్ నిమ్జే, సచిన్ ధార్మిక్‌కు రూ. కోటి ఇచ్చి మామను అంతమొందించే పని అప్పగించింది.
ఈ క్రమంలో 15 రోజుల క్రితం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భార్య శకుంతలను కలిసి పురుషోత్తం బయటకు వస్తుండగా.. బగ్డే, అతడి మిత్రులు కారుతో ఢీ కొట్టి వేగంగా పరారయ్యారు. ఈ ఘటనలో పురుషోత్తం అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. హత్య కేసు దర్యాప్తు ఇది ప్రమాదవశాత్తూ జరిగిన ఘటన కాదని పోలీసులు అనుమానించారు. నిశితంగా దర్యాప్తు జరపగా హత్యవెనుక కోడలు అర్చన హస్తం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో పోలీసులు ఆమెతో పాటు ముగ్గురు నిందితులను కూడా అరెస్టు చేశారు. అంతేకాకుండా నిందితురాలు అర్చన టౌన్‌ప్లానింగ్ శాఖలో అనేక అక్రమాలకు పాల్పడ్డట్లు పోలీసుల విచారణలో బయటపడింది. వీరిపై హత్య నేరంతో పాటు ఐపీసీ, మోటారు వాహనాల చట్టం కింద ఇతర సెక్షన్ల కింద అభియోగాలు మోపారు. రెండు కార్లు, బంగారు నగలు, మొబైల్ ఫోన్లు వీరి నుంచి స్వాధీనం చేసుకున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.