NEET UG 2024 Controversy: నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ నిలిపివేతకు సుప్రీంకోర్టు నో.. వారికి మళ్లీ ఎగ్జాం!

నీట్‌ యూజీ 2024 కౌన్సెలింగ్‌పై స్టే ఇవ్వబోమని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు వెకేషన్‌ బెంచ్‌ నీట్ కౌన్సిలింగ్ నిలిపివేతకు గురువారం (జూన్ 13) నో  చెప్పింది. 'కౌన్సెలింగ్ కొనసాగుతుంది. మేము దానిని ఆపం. వారికి మళ్లీ ఎగ్జామ్ జరిగితే అంతా సజావుగా మారుతుంది. కాబట్టి భయపడాల్సిన పనిలేదని' సుప్రీం కోర్టు పేర్కొంది. నీట్‌ యూజీ పరీక్ష సమయంలో నష్టపోయిన సమయాన్ని భర్తీ చేయడానికి..

NEET UG 2024 Controversy: నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ నిలిపివేతకు సుప్రీంకోర్టు నో.. వారికి మళ్లీ ఎగ్జాం!
NEET UG 2024 Controversy
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 13, 2024 | 12:23 PM

న్యూఢిల్లీ, జూన్ 13: నీట్‌ యూజీ 2024 కౌన్సెలింగ్‌పై స్టే ఇవ్వబోమని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు వెకేషన్‌ బెంచ్‌ నీట్ కౌన్సిలింగ్ నిలిపివేతకు గురువారం (జూన్ 13) నో  చెప్పింది. ‘కౌన్సెలింగ్ కొనసాగుతుంది. మేము దానిని ఆపం. వారికి మళ్లీ ఎగ్జామ్ జరిగితే అంతా సజావుగా మారుతుంది. కాబట్టి భయపడాల్సిన పనిలేదని’ సుప్రీం కోర్టు పేర్కొంది. నీట్‌ యూజీ పరీక్ష సమయంలో నష్టపోయిన సమయాన్ని భర్తీ చేయడానికి ‘గ్రేస్ మార్కులు’ పొందిన 1563 మంది అభ్యర్థుల ఫలితాలను సమీక్షించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు ఎన్టీయే విచారణ సమయంలో సుప్రీంకోర్టుకు తెలిపింది. గ్రేస్ మార్కులు పొందిన 1,563 నీట్‌ యూజీ అభ్యర్థుల స్కోర్‌కార్డులను రద్దు చేయాలని కమిటీ నిర్ణయం తీసుకుందని, ఆ ప్రకారంగా ఈ విద్యార్థులకు గ్రేస్ మార్కులు తొలగిస్తామని సుప్రీంకోర్టు కి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది. వీరికి మరోసారి పరీక్ష రాసే అవకాశం కూడా కల్పిస్తామని వెల్లడించింది. జూన్ 23న పరీక్షలు నిర్వహించి, జూన్ 30లోపు ఫలితాలు ప్రకటిస్తామని ఎన్టీయే అత్యున్నత ధర్మాసనానికి తెలిపింది.

కాగా వైద్య విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పేపర్ లీక్‌ ఆరోపణలతో పాటు ఫలితాల వివాదం తీవ్ర దుమారం రేపుతోంది. నీట్‌ ఎగ్జామ్ రద్దు చేసి మళ్లీ నిర్వహించాలంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేసింది. నీట్‌ పరీక్షను రద్దు చేయడం అంత సులువు కాదని స్పష్టం చేసింది. క్యాన్సిల్ చేస్తే పరీక్షకు ఉన్న గౌరవం, పవిత్రత దెబ్బతింటుందని, అలాగే కౌన్సెలింగ్‌ ప్రక్రియపై స్టేకు కూడా సుప్రీంకోర్టు నిరాకరించింది. పరీక్షపై వస్తున్న ఆరోపణలకు సమాధానాలు కావాలని ఎన్టీయేను ధర్మాసనం ఆదేశించింది. ఎగ్జామ్‌లో జరిగిన అవకతవకలపై వివరణ ఇవ్వాలంటూ నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA)కి నోటీసులు జారీ చేసింది.

కాగా మే 5న నీట్ యూజీ-2024 ప్రవేశ పరీక్ష జరిగింది. అయితే మొదట జూన్‌ 14న ఫలితాలను వెల్లడిస్తామని చెప్పిన అధికారులు.. అంతకంటే ముందే జూన్‌ 4న రిజల్ట్‌ విడుదల అయ్యాయి. నీట్ ఫలితాల్లో 67 మంది విద్యార్థులకు ఆలిండియా మొదటి ర్యాంక్‌ రాగా, వారిలో ఒకే పరీక్ష కేంద్రానికి చెందిన ఆరుగురు విద్యార్థులకు 720కి 720 మార్కులు రావడం పలు అనుమానాలకు దారితీసింది. దీంతో పేపర్‌ లీకేజీ జరిగిందని, ఫలితాల్లోనూ అక్రమాలు చోటు చేసుకున్నాయని కాంగ్రెస్‌ సహా పలు విపక్షాలు ధ్వజమెత్తాయి. దీంతో ఆరోపణలపై విచారణకు యూపీఎస్సీ మాజీ ఛైర్మన్‌ సారథ్యంలో కేంద్రం నలుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం