AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bandi Sanjay: కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన బండి సంజయ్.. వీడియో చూశారా..?

కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్.. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలోని నార్త్ బ్లాక్‌లోని హోంశాఖ కార్యాలయంలో బండి సంజయ్ బాధ్యతలు చేపట్టారు. భద్రతా కారణాల రీత్యా కార్యకర్తల అట్టహాసం, నాయకుల సందడి లేకుండానే ఛార్జ్ తీసుకున్నారు.

Bandi Sanjay: కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన బండి సంజయ్.. వీడియో చూశారా..?
Bandi Sanjay
Shaik Madar Saheb
|

Updated on: Jun 13, 2024 | 1:23 PM

Share

కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్.. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలోని నార్త్ బ్లాక్‌లోని హోంశాఖ కార్యాలయంలో బండి సంజయ్ బాధ్యతలు చేపట్టారు. భద్రతా కారణాల రీత్యా కార్యకర్తల అట్టహాసం, నాయకుల సందడి లేకుండానే ఛార్జ్ తీసుకున్నారు. జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతి విద్యారణ్య భారతి స్వామీజీ సమక్షంలో హోం మంత్రిత్వ శాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలు ఫైళ్లపై సంతకాలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా మార్గదర్శకత్వంలో దేశ భద్రత కోసం పనిచేసేందుకు అహర్నిశలు కృషిచేస్తానని బండి సంజయ్ పేర్కొన్నారు.

వీడియో చూడండి..

కాగా.. బండి సంజయ్ కుమార్.. 2019లో తొలిసారిగా కరీంనగర్‌ నుంచి ఎంపీగా గెలిచారు. తరువాత భారతీయ జనతా పార్టీ (BJP) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ వ్యాప్తంగా పార్టీ విస్తరణకు చర్యలు తీసుకున్నారు. 2020 మార్చి 11 నుంచి 2023 జులై 3వ వరకు రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో పార్టీకి సేవలందించారు. ప్రస్తుతం BJP జాతీయ ప్రధాన కార్యదర్శిగా పని చేస్తూ.. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రెండోసారి ఎంపీగా గెలిచారు. దీంతో కేంద్ర సహాయ మంత్రి పదవి దక్కించుకున్నారు.

బండి సంజయ్ ట్వీట్..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..