AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

FCI Recruitment 2021: నిరుద్యోగులకు శుభవార్త.. ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగాలకు భర్తీకి నోటిఫికేషన్‌

FCI Recruitment 2021: దేశంలో నిరుద్యోగ వ్యవస్థను తీర్చేందుకు దేశంలో అన్ని రంగాలు ఖాళీగా ఉన్న ఉద్యోగ పోస్టులను భర్తీ చేస్తున్నాయి. ఇప్పటికే ఎన్నో ప్రభుత్వ...

FCI Recruitment 2021: నిరుద్యోగులకు శుభవార్త.. ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగాలకు భర్తీకి నోటిఫికేషన్‌
Subhash Goud
|

Updated on: Feb 27, 2021 | 9:47 PM

Share

FCI Recruitment 2021: దేశంలో నిరుద్యోగ వ్యవస్థను తీర్చేందుకు దేశంలో అన్ని రంగాలు ఖాళీగా ఉన్న ఉద్యోగ పోస్టులను భర్తీ చేస్తున్నాయి. ఇప్పటికే ఎన్నో ప్రభుత్వ రంగాలకు సంబంధించిన వాటిలో ఉద్యోగాలు భర్తీ అవుతున్నాయి. ఖాళీగా ఉన్న పోస్టులకు నోటిఫికేషన్‌ వేస్తూ నిరుద్యోగులకు అవకాశాన్ని కల్పిస్తున్నారు. నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌. ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా -FCI ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. జనరల్‌ అడ్మినిస్ట్రేషన్‌, టెక్నికల్‌ అకౌంట్స్‌, లా విభాగాల్లో అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ పోస్టులను భర్తీ చేసేందుకు సిద్ధమవుతోంది. మొత్తం 89 ఖాళీ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ ఖాళీగా ఉన్న పోస్టులకు 2021 మార్చి 1న దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించనుంది. అయితే దరఖాస్తు చేయడానికి 2021 మార్చి 31 చివరి తేదీగా వెల్లడించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల కోసం https://fci.gov.in/ లేదా https://www.recruitmentfci.in/ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని ఈ సంస్థ తెలిపింది. దరఖాస్తు చేసుకునే ముందు వెబ్‌సైట్‌లో అన్ని వివరాలు తెలుసుకుని దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది.

ఖాళీల వివరాలు ఇవే…

మొత్తం ఖాళీలు- 89 (జనరల్- 43, ఎస్సీ- 14, ఈడబ్ల్యూఎస్- 9, ఓబీసీ- 7, ఎస్టీ-6) ఉన్నాయి.

అసిస్టెంట్ జనరల్ మేనేజర్‌గా జనరల్ అడ్మినిస్ట్రేషన్- 30 టెక్నికల్- 27 అకౌంట్స్- 22 అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (లా)- 8 మెడికల్ ఆఫీసర్- 2

దరఖాస్తు చేసుకునే తేదీ: 2021మార్చి 1 దరఖాస్తు చివరి తేదీ : 2021 మార్చి 31 అడ్మిట్‌ కార్డు విడుదల: పరీక్షకు పది రోజుల ముందు రిక్రూట్‌మెంట్ ఎగ్జామినేషన్: 2021 మే లేదా జూన్ విద్యార్హతలు: వేర్వేరు పోస్టులకు విద్యార్హతలు ఒక్కో విధంగా ఉన్నాయి. ఫీజు : రూ.1000. SC, ST, దివ్యాంగులు, మహిళలకు ఎలాంటి ఫీజు అవసరం లేదు ఎంపిక విధానం: ఆన్‌లైన్‌లో పరీక్ష, ఇంటర్వ్యూ. ఆన్‌లైన్ టెస్ట్‌లో అన్‌రిజర్వ్‌డ్, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులకు 50 శాతం మార్కులు అలాగే SC, ST, OBC, దివ్యాంగులకు 45 శాతం మార్కులు రావాలి.

అలా సదరు వెబ్‌ సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ముందుగా వెబ్ సైట్‌లోకి వెళ్లిAssistant General Manager పైన క్లిక్‌ చేయాలి. అనంతరం Apply Online పైన క్లిక్ చేసి అందులో అడిగిన పూర్తి వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా రిజిస్టర్‌ మొబైల్‌ నెంబర్‌, ఇమెయిల్‌ ఐడీకి రిజిస్ట్రేషన్‌ నెంబర్‌, పాస్‌ వర్డ్ వస్తుంది. రిజిస్ట్రేషన్‌ నెంబర్‌తో లాగిన్‌ అయి దరఖాస్తు ఫామ్‌ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఫోటో, సంతకం అప్‌లోడ్‌ చేయాలి. తర్వాత దరఖాస్తు ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోవాలి.

అవి కూడా చదవండి:

UPSC Recruitment 2021: నిరుద్యోగులకు శుభవార్త.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల

Innovation Express 2021 Award: ఇన్నోవేషన్‌ ఎక్స్‌ప్రెస్‌ 2021 అవార్డుకు దక్కించుకున్న హైదరాబాద్‌ వాసి

Airtel, Reliance Jio: జియోకు షాకిస్తున్న ఎయిర్‌టెల్‌.. మెరుగైన సిగ్నల్‌తో వినియోగదారులకు గాలం