AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తమిళ దేవుడి మొక్కుల్లో తిరకాసు.. ప్రెషర్ కుక్కర్లతో దొరికిపోయిన మహా భక్తుడు.. ఆతర్వాత ఏం జరిగిందంటే..

ఓట్ల పండుగ వచ్చింది. రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకట్టుకునే పనిలో బిజీ బిజీ అయిపోయాయి. వాగ్దానాలు ఇవ్వడం.. గెలచిన తర్వాత తీరుస్తామని చెప్పడం ఓల్డ్ ఫ్యాషన్. ఎన్నికలకు ముందే ఎవరికి నచ్చినవి..

తమిళ దేవుడి మొక్కుల్లో తిరకాసు.. ప్రెషర్ కుక్కర్లతో దొరికిపోయిన మహా భక్తుడు.. ఆతర్వాత ఏం జరిగిందంటే..
pressure-cookers-seized
Sanjay Kasula
|

Updated on: Feb 27, 2021 | 9:46 PM

Share

Pressure Cookers Seized: ఓట్ల పండుగ వచ్చింది. రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకట్టుకునే పనిలో బిజీ బిజీ అయిపోయాయి. వాగ్దానాలు ఇవ్వడం.. గెలచిన తర్వాత తీరుస్తామని చెప్పడం ఓల్డ్ ఫ్యాషన్. ఎన్నికలకు ముందే ఎవరికి నచ్చినవి, ఎవరు కోరినవి వారికి ఇచ్చేయడం న్యూ పొలిటికల్ స్ట్రాటజీ. తమనే గెలిపించాలని కోరుతూ భారీగానే తాయిలాలు పంచిపెడుతుంటారు పోటీలో ఉన్న అభ్యర్థులు.

ఇన్ని రోజులు నగదు పంచడం, లిక్కర్‌, విలువైన వస్తువులు ఇచ్చో, ఇంకా ఏదైనా అడిగింది ఇచ్చి ఓట్లు అడిగేవారు. కానీ, ఇప్పుడు ట్రెండ్‌ మారింది. పార్టీకి ఏ గుర్తు ఉంటే అది ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు తమిళనాడులో రాజకీయ పార్టీలు ఇదే ఫాలో అవుతున్నాయి. తమిళనాడులో ఎన్నికలంటే ఓ రేంజ్‌లో ఉంటుంది.

ఎన్నికలు వచ్చాయంటే ఓటర్లు వరాల వర్షంలో, తాయిలాల వరదలో మునిగిపోతుంటారు. ఈ సంస్కృతి అక్కడ కాస్త ఎక్కువే ఉంటుంది. కాగా.. అక్కడి అన్నాడీఎంకే, డీఎంకే పార్టీలు చెరో జాతీయ పార్టీతో కలిసి పోటీకి దిగుతున్నాయి. అన్నాడీఎంకే బహిష్కృత నేత, శశికళ మేనల్లుడు టీటీవి దినకరన్‌ స్వంతగా బరిలోకి దిగుతున్నాయి. జత కట్టిన రెండు కూటములను ఢీ కొట్టాలని టీటీవి దినకర్ పార్టీ నిర్ణయించుకుంది.

ఈమేరకు ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు ప్రారంభించింది. అయితే… దినకరన్‌ పార్టీకి గత ఉప ఎన్నికలో కుక్కర్ సింబల్‌ను కేటాయించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ ఎన్నికల్లో కూడా అదే కంటిన్యూ అవుతుంది. దీంతో ఓటర్లకు తన పార్టీ గుర్తైన కుక్కర్లను పంచేందుకు సిద్ధమయ్యారు. ముందుగానే ఆర్డర్ చేసిన కుక్కర్లను… చెన్నై శివారులోని గుమ్మిడిపూడి వద్ద గోడౌన్‌లో నిల్వ చేశారు.

తాజాగా ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో వాటిని ఓటర్లకు పంచేందుకు జిల్లాలకు తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అరియాలూరు జిల్లాలో పోలీసులు 3వేల 300 కుక్కర్లతో వెళ్తున్న లారీని పట్టుకున్నారు. తనిఖీ చేయగా… లారీలోని కుక్కర్లు శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్‌ పార్టీకి చెందినవిగా చెప్తున్నారు. గుమ్మిపూడి వద్ద నుంచి రాష్ట్రం వ్యాప్తంగా అన్ని జిల్లాలకు కుక్కర్లు తరలిస్తున్నట్టు ప్రాథమికంగా తేలింది. ఎన్నికల నియామవళి ప్రకారం కేసు నమోదు చేసిన పోలీసులు… ఎవరెవరు ఆర్డర్లిచ్చారు, ఆ డబ్బును ఎలా చెల్లించారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

Petrol to Cost Rs 160/Litre: హైదరాబాద్‌లో ఆక్టేన్ ప్రీమియం పెట్రోల్ లీటరు ధర రూ.160.. ఈ రేటు ఎందుకింతో తెలుసా.. ఉద్యోగం మారిన ప్రతిసారి కొత్త అకౌంట్ తీసుకుంటున్నారా.. అయితే మీరు ఇవి తప్పకుండా పాటించాలి… SBI Alert: కస్టమర్లకు ఎస్‌బీఐ హెచ్చరిక.. ఇలాంటి ఎస్ఎంఎస్ మీ ఫోన్‌కు వస్తే జాగ్రత్త.. వెంటనే బ్యాంక్ అధికారులకు ఫిర్యాదు చేయండి..