Petrol to Cost Rs 160/Litre: హైదరాబాద్‌లో ఆక్టేన్ ప్రీమియం పెట్రోల్ లీటరు ధర రూ.160.. ఈ రేటు ఎందుకింతో తెలుసా..

హైదరాబాద్ మార్కెట్‌లోకి మరో పెట్రోల్ వచ్చింది. ఈ పెట్రోల్ ధర వింటే మీరు షాక్ అవుతారు. ఎందుకంటే..  ప్రస్తుతం మార్కెట్లో లభించే పెట్రోల్ కంటే అత్యున్నత నాణ్యత కలిగివుంది.

Petrol to Cost Rs 160/Litre: హైదరాబాద్‌లో ఆక్టేన్ ప్రీమియం పెట్రోల్ లీటరు ధర రూ.160.. ఈ రేటు ఎందుకింతో తెలుసా..
Petrol Cost in Hyderabad
Follow us
Sanjay Kasula

|

Updated on: Feb 27, 2021 | 9:05 PM

Octane Petrol Cost : పెట్రో ప్రైస్ బొమ్మ దద్దరిల్లిపోతుంది. సగటు జీవికి చుక్కలు చూపిస్తోంది. ట్యాంక్‌లో ఆయిల్ పోయించుకునేందుకు చెమట చుక్కలు ధారపోయాల్సి వస్తోంది. ఇక కొనేదెట్టా.. తినేదెట్టా అని నిట్టూరుస్తున్నాడు. ఇంతకీ పెట్రో ధరలు రన్ రాజా రన్ అంటూ ఎందుకు పరుగెడుతున్నాయి. ఇదిలావుంటే..

హైదరాబాద్ మార్కెట్‌లోకి మరో పెట్రోల్ వచ్చింది. ఈ పెట్రోల్ ధర వింటే మీరు షాక్ అవుతారు. ఎందుకంటే..  ప్రస్తుతం మార్కెట్లో లభించే పెట్రోల్ కంటే అత్యున్నత నాణ్యత కలిగివుంది. రేటు కూడా అలానే ఉంటుంది. ఇది 100 ఆక్టేన్ ప్రీమియం పెట్రోల్… ఇప్పుడు హైదరాబాదులోనూ లభ్యమవుతోంది.

హైదరాబాద్‌‌లో ప్రీమియం గ్రేడ్ పెట్రోల్ అమ్మకాలు

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC) ఇటీవలే హైదరాబాదులో ప్రీమియం గ్రేడ్ పెట్రోల్ అమ్మకాలు మొదలు పెట్టింది. ఈ 100 ఆక్టేన్ ప్రీమియం పెట్రోల్ లీటర్ ధర రూ.160 ధర పలుకుతోంది. ఈ వరల్డ్ క్లాస్ పెట్రోల్ వాహనాల మన్నికను మరింత పెంచుతుందని, ఇంజిన్ జీవితకాలాన్ని పొడిగిస్తుందని ఐఓసీ డీలర్ల కన్సార్టియం సంయుక్త కార్యదర్శి రాజీవ్ అమరం తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

ఈ ప్రీమియం స్థాయి పెట్రోల్‌ను గతేడాది నుంచి ఢిల్లీ, గురుగ్రామ్, నోయిడా, ఆగ్రా, ముంబయి, అహ్మదాబాద్, చండీగఢ్, జైపూర్, లుధియానా నగరాల్లో విక్రయిస్తున్నారు. కాగా, ఈ నాణ్యమైన పెట్రోల్ మధురలోని ఐఓసీ రిఫైనరీ నుంచి సరఫరా చేస్తున్నారు. బీఎస్-6 వాహనాలకు ఈ పెట్రోల్ సరైనదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఆక్టేన్ ప్రీమియం అంటే..

ప్రీమియం పెట్రోల్ అంటే అత్యంత నాణ్యమైన పెట్రోల్ అని అర్థం. ప్రీమియం పెట్రోల్ ధర దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో ధర ఒకోలావుంటాయి. ప్రీమియం పెట్రోల్, సాధారణ పెట్రోల్ మధ్య ప్రధానమైన తేడా ఆక్టేన్ నెంబర్. సాధారణ పెట్రోల్‌కు ఆక్టేన్ నెంబర్ తక్కువగా ఉంటే, ప్రీమియం పెట్రోల్‌కు ఎక్కువగా ఉంటుంది. ప్రీమియం పెట్రోల్ ఆక్టేన్ నెంబర్ 91గా ఉంటుంది. ఇంధన యొక్క మండే నాణ్యత కొలతను ఆక్టేన్ నెంబర్‌గా పేర్కొంటారు.

దేశంలో మొట్టమొదటి 100 ఆక్టేన్ ప్రీమియం

ఈ ప్రీమియం పెట్రోల్‌ను భారతదేశంలోని 10 జిల్లాలకు పరిచయం చేశారు. ఈ ఘనతతో పాటు, ఈ స్థాయి ప్రీమియం పెట్రోల్ ను ఉపయోగిస్తున్న ప్రపంచంలోని ఎంపిక చేసిన దేశాల్లో భారత్ పేరు గాంచింది. భారత్ తో పాటు, అమెరికా, జర్మనీ లతో పాటు ఈ ప్రీమియం పెట్రోల్ ను వినియోగించే దేశాలు ప్రపంచంలో కేవలం 6 మాత్రమే ఉన్నాయి.

ఖరీదైన బైకుల కోసం..

ప్రపంచ స్థాయి పెట్రోల్ ప్రవేశపెట్టిన తర్వాత జర్మనీ, అమెరికాదేశాల్లో లగ్జరీ కార్లు, ఖరీదైన బైకుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక తరహా పెట్రోల్ ఇప్పుడు భారత్ లోనూ అందుబాటులోకి వచ్చింది. భారతదేశంలో దీని ధర లీటరుకు నూట యాభై రూపాయలు గా చెప్పబడుతోంది. హైదరాబాద్‌ ఢిల్లీ, నోయిడాలలో లీటర్ ధర రూ.160.

ఇవి కూడా చదవండి

SBI Alert: కస్టమర్లకు ఎస్‌బీఐ హెచ్చరిక.. ఇలాంటి ఎస్ఎంఎస్ మీ ఫోన్‌కు వస్తే జాగ్రత్త.. వెంటనే బ్యాంక్ అధికారులకు ఫిర్యాదు చేయండి..

ఉద్యోగం మారిన ప్రతిసారి కొత్త అకౌంట్ తీసుకుంటున్నారా.. అయితే మీరు ఇవి తప్పకుండా పాటించాలి…