AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Accident: పరీక్ష రాసి ఇంటికెళ్తుండగా ఎదురొచ్చిన మృత్యువు.. ప్రమాదంలో ఐదుగురు విద్యార్థులు మృతి

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కేఎస్ఆర్టీసీ బస్సును కారు ఢీ(Accident) కొట్టిన ఈ ఘటనలో ఐదుగురు విద్యార్థులు మృతి చెందారు. హాసన్-బేలూర్ రోడ్డులో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులు జేపీ నగర్...

Accident: పరీక్ష రాసి ఇంటికెళ్తుండగా ఎదురొచ్చిన మృత్యువు.. ప్రమాదంలో ఐదుగురు విద్యార్థులు మృతి
Karnataka Accident
Ganesh Mudavath
|

Updated on: Mar 23, 2022 | 10:32 AM

Share

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కేఎస్ఆర్టీసీ బస్సును కారు ఢీ(Accident) కొట్టిన ఈ ఘటనలో ఐదుగురు విద్యార్థులు మృతి చెందారు. హాసన్-బేలూర్ రోడ్డులో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులు జేపీ నగర్, బేలూరు తాలూకాకు చెందిన రియాజ్, ఫయాజ్ అహ్మద్, అక్మల్ ఖాన్, మహ్మద్ కైఫ్, సుహిల్‌లుగా గుర్తించారు. బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. రియాజ్ కారు నడుపుతున్న సమయంలో వాహనాన్ని ఓవర్‌టేక్ (Over take) చేస్తుండగా ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. మృతి చెందిన విద్యార్థులందరూ (Students) సెకండ్ పీయూసీ హిందీ పరీక్షకు హాజరై వస్తున్నట్లు గుర్తించారు. పరీక్ష ముగిసిన అనంతరం అక్మల్ ఖాన్, మహమ్మద్ జిలానీలు తమ స్నేహితులతో కలిసి కారులో ఇంటికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. కారులో వెళ్తున్న సమయంలో అదుపుతప్పి బస్సును ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ప్రమాద తీవ్రతను పరిశీలించారు. మృతదేహాలు వాహనంలో ఇరుక్కుపోవడంతో వాటిని బయటకు తీసేందుకు చాలా సమయం పట్టింది. దీంతో హైవేపై గంటపాటు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. మితిమీరిన వేగంతో కారు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ప్రమాదానికి కారుకుడైన బస్సు డ్రైవర్‌పై కూడా కేసు నమోదు చేశారు.

Also Read

Telangana Govt Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. కానిస్టేబుల్ నుంచి గ్రూప్-1 వరకు ఉచిత శిక్షణ.. ఎక్కడ, ఎలా నమోదు చేసుకోవాలంటే?

AP Assembly Budget Session 2022-2023 live: కొనసాగుతున్న ఏపీ అసెంబ్లీ… పోడియం దగ్గర టీడీపీ సభ్యుల ఆందోళన..(వీడియో)

RRR Movie: వారణాసిలో ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రబృందం.. పవిత్ర గంగానది ఒడ్డున ప్రత్యేక పూజలు..