Road Accident: స్తంభాన్ని ఢీకొట్టి పొలాల్లోకి దూసుకెళ్లిన కారు.. ఐదుగురు యువకుల దుర్మరణం..
క్షతగాత్రులను కారునుంచి బయటకు తీసి.. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Himachal Pradesh Road Accident: హిమాచల్ ప్రదేశ్‌లోని ఉనా జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు యువకులు దుర్మరణం చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను కారునుంచి బయటకు తీసి.. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన జిల్లా కేంద్రమైన ఉనాకు ఆనుకుని ఉన్న కుతార్ కలాన్‌లో శనివారం రాత్రి జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురు ఆసుపత్రిలో మరణించినట్లు పోలీసులు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుథర్ కలాన్‌లో శనివారం రాత్రి పంజాబ్ నంబర్ తో ఉన్న కారు స్తంభాన్ని ఢీకొని పొలాల్లోకి దూసుకెళ్లింది. విషయం తెలుసుకున్న స్థానికులు అక్కడికి చేరుకుని యువకులను కారులో నుంచి బయటకు తీశారు. ఈ ప్రమాదంలో సలోహరోలి జిల్లా ఉనా నివాసి రాజన్ జస్వాల్, అమల్ అక్కడికక్కడే మృతి చెందారు. కారు డ్రైవర్‌తో పాటు మరో నలుగురిని ఉనా ఆసుపత్రికి తరలించగా.. అక్కడ మరో ముగ్గురు యువకులు చికిత్స పొందుతూ మరణించారని పోలీసులు తెలిపారు.
ఈ కేసులో ప్రమాదానికి గల కారణాలను తెలుసుకుంటున్నామని డీఎస్పీ హెడ్‌క్వార్టర్స్ అంకిత్ శర్మ వెల్లడించారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..