AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: హిస్టరీలో ఫస్ట్‌ టైమ్‌.. ప్రధాని మోదీ పాల్గొనే ఈవెంట్‌లో కేవలం మహిళా పోలీసులతోనే భద్రత ఏర్పాటు! ఎందుకంటే..?

గుజరాత్‌లోని నవ్‌సరిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జరిగే కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో ఆయన భద్రతను మొత్తం మహిళా పోలీసు బృందం నిర్వహించనుంది. ఇది భారతదేశ చరిత్రలోనే తొలిసారి. 2000 మందికి పైగా మహిళా పోలీసులు ఈ బృందంలో ఉన్నారు. ఇలా చేయడానికి ఒక కారణం ఉంది. అదేంటంటే..

PM Modi:  హిస్టరీలో ఫస్ట్‌ టైమ్‌.. ప్రధాని మోదీ పాల్గొనే ఈవెంట్‌లో కేవలం మహిళా పోలీసులతోనే భద్రత ఏర్పాటు! ఎందుకంటే..?
Women Security For Pm Modi
SN Pasha
|

Updated on: Mar 07, 2025 | 12:20 PM

Share

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఏ కార్యక్రమంలో పాల్గొన్నా భారీ ఎత్తున భద్రతా ఏర్పాటు చేస్తారు. ప్రధానిగా ఆయనకు ఉండే హై సెక్యూరిటీ కాకుండా మూడు నాలుగు అంచెల్లో భద్రతా వలయాలు ఏర్పాటు చేస్తారు. మోదీని చూసేందుకు, ఆయన సభకు హాజరయ్యేందుకు చాలా మంది జనం, ఆయన అభిమానులు, బీజేపీ కార్యకర్తలు వస్తారు కాబట్టి వారిని అదుపు చేయడానికి పోలీస్‌ సిబ్బందిని బందోబస్తుగా పెడతారు. అయితే అందులో ఎక్కువ పురుష భద్రతా సిబ్బంది ఉంటారు. కానీ, ఫర్‌ ది ఫస్ట్‌ టైమ్‌ ఓ భారీ కార్యక్రమంలో కేవలం మహిళా భద్రతా సిబ్బంది తోనే సెక్యూరిటీని కల్పిస్తున్నారు. అలా చేయడానికి ఒక ప్రత్యేక కారణం ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గుజరాత్‌లోని నవ్‌సరి జిల్లాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో మహిళా పోలీసు సిబ్బందితో కూడిన భద్రతా బృందాన్ని మోహరిస్తామని ఈ రాష్ట్ర మంత్రి తెలిపారు. “అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు గుజరాత్ పోలీసులు ఒక ప్రత్యేకమైన చొరవ తీసుకుంటున్నారు. భారతదేశ చరిత్రలో తొలిసారిగా, నవ్‌సరిలోని వాన్సీ బోర్సీ గ్రామంలోని హెలిప్యాడ్ వద్దకు ప్రధాని రాక నుంచి కార్యక్రమ వేదిక వరకు మొత్తం భద్రతా ఏర్పాట్లను మహిళా పోలీసులు మాత్రమే నిర్వహిస్తారు” అని హోం శాఖ సహాయ మంత్రి హర్ష్ సంఘవి గురువారం తెలిపారు. మహిళా పోలీసు సిబ్బందిలో ఐపీఎస్ అధికారులు, కానిస్టేబుళ్లు ఉంటారని పేర్కొన్నారు.

ప్రధాని మోదీ శుక్ర, శనివారాల్లో గుజరాత్, కేంద్ర పాలిత ప్రాంతం దాద్రా, నాగర్ హవేలీలలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా మార్చి 8న వంసి బోర్సి గ్రామంలో జరిగే ‘లఖ్‌ప్తి దీదీ సమ్మేళన్’లో పాల్గొని ప్రసంగిస్తారు. “2,100 మందికి పైగా కానిస్టేబుళ్లు, 187 మంది సబ్-ఇన్స్పెక్టర్లు, 61 మంది పోలీస్ ఇన్స్పెక్టర్లు, 16 మంది డిప్యూటీ సూపరింటెండెంట్లు, ఐదుగురు ఎస్పీలు, ఒక ఐజీ, ఒక అదనపు డీజీపీ ర్యాంక్ అధికారితో సహా అంతా మహిళా పోలీసు సిబ్బంది ఆ రోజు భద్రతను నిర్వహిస్తారు” అని మంత్రి పేర్కొన్నారు. సీనియర్ మహిళా ఐపీఎస్ అధికారిణి, హోం కార్యదర్శి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తారని మంత్రి తెలిపారు. ఈ చొరవ మహిళా దినోత్సవం నాడు ప్రపంచానికి మంచి సందేశాన్ని ఇస్తుందని, గుజరాత్‌ను సురక్షితమైన, భద్రమైన రాష్ట్రంగా మార్చడంలో మహిళలు ఎలా ముఖ్య పాత్ర పోషిస్తున్నారో కూడా ఈ కార్యక్రమం తెలియజేస్తుందని పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వేణు స్వామి పై మండిపడుతున్న బాలయ్య అభిమానులు
వేణు స్వామి పై మండిపడుతున్న బాలయ్య అభిమానులు
ఆ ప్లేసుల్లో నో సన్ సెట్.. చంద్రుడే కనిపించడు.. ఎక్కడంటే.?
ఆ ప్లేసుల్లో నో సన్ సెట్.. చంద్రుడే కనిపించడు.. ఎక్కడంటే.?
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండ్లు ఇవేనట! వాటి ధరను అస్సలు ఊహించలేర
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండ్లు ఇవేనట! వాటి ధరను అస్సలు ఊహించలేర
రిటైర్మెంట్ తర్వాత కూడా రోహిత్ శర్మ టీ20 లోకి రీ-ఎంట్రీ
రిటైర్మెంట్ తర్వాత కూడా రోహిత్ శర్మ టీ20 లోకి రీ-ఎంట్రీ
క్యాంపింగ్ అంటే ఇష్టమా.? చలికాలంలో ఈ చెన్నై ప్లేసులు ది బెస్ట్..
క్యాంపింగ్ అంటే ఇష్టమా.? చలికాలంలో ఈ చెన్నై ప్లేసులు ది బెస్ట్..
కర్కాటక రాశివారు పేరెంట్స్‎గా బెస్ట్.. పిల్లలతో ఎలా ఉంటారంటే.?
కర్కాటక రాశివారు పేరెంట్స్‎గా బెస్ట్.. పిల్లలతో ఎలా ఉంటారంటే.?
కాలుష్యం నుంచి మీ ఊపిరితిత్తులు సేఫ్.. ఈ యోగాసనాలతో ఆస్తమా..
కాలుష్యం నుంచి మీ ఊపిరితిత్తులు సేఫ్.. ఈ యోగాసనాలతో ఆస్తమా..
లేడీ స్నేక్‌ క్యాచర్‌ ధైర్యానికి పాము ఫిదా..! ఏం చేసిందో చూస్తే
లేడీ స్నేక్‌ క్యాచర్‌ ధైర్యానికి పాము ఫిదా..! ఏం చేసిందో చూస్తే
ఈ ఏడాదిలో బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
ఈ ఏడాదిలో బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
ఏంటయ్యా ఇది.. లగేజీ మోసుకెళ్లిన టీమిండియా ప్లేయర్లు
ఏంటయ్యా ఇది.. లగేజీ మోసుకెళ్లిన టీమిండియా ప్లేయర్లు
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..