గాల్వాన్ వీరులపై ట్వీట్ చేసి చిక్కుల్లో పడిన రిచా… మధ్య ప్రదేశ్ ప్రభుత్వం చర్యలకు రెడీ..
ఆమె చేసిన ట్వీట్ తుక్డే- తుక్డే మెంటాల్టీని సూచిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అటు మధ్యప్రదేశ్‌లో ఫిర్యాదులు కూడా అందాయి. సినిమాకూ జీవితానికీ చాలా పెద్ద తేడా ఉంది. ఈ విషయం గుర్తించకుండా వ్యవహరించడం తగదంటున్నారు
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ రిచా చద్దా. మరో వివాదానికి తెరతీశారు. ఏకంగా గాల్వాన్ వీరులపై వ్యంగ్యంగా ట్వీట్ చేసి చిక్కుల్లో పడ్డారు. ఆమెపై చర్యలు తీసుకుంటామని మధ్యప్రదేశ్ ప్రభుత్వం చెబుతుంటే.. రిచాకి మద్దతుగా నిలిచారు కాంగ్రెస్ నేత నగ్మ వంటివారు. రిచా చద్దా.. ఒక్క ట్వీట్‌తో వివాదాల తుట్టెని కదిపింది. గల్వాన్ సేస్ హాయ్. అంటూ ఆమె చేసిన ఈట్వీట్ జాతీయ వాదులకు కోపం తెప్పించింది. అమరులపై ఇలాంటి చులకన మాటలు ఏంటంటూ బీజేపీతోపాటు.. బాలీవుడ్ సెలబ్రిటీలూ వ్యాఖ్యలను ఖండించారు. ఇక ఆమె ట్వీట్ ఆధారంగా పోలీసులకు ఫిర్యాదులు కూడా అందుతున్నాయి. ఇంతకీ రిచా ఏమని ట్వీట్ చేశారని చూస్తే.. భారత ఆర్మీ నార్తరన్ కమాండ్ కొన్నాళ్ల క్రితం ఒక కీలక ప్రకటన చేసింది. POKని తప్పక స్వాధీనం చేసుకుంటామని.. ప్రభుత్వ ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నామని స్టేట్ మెంట్ ఇచ్చింది. ఈ ప్రకటన చులకన చేసేలా బాలీవుడ్ నటి రిచా చద్దా ట్వీట్ చేశారు. POK పై దాడి చేస్తే మరో గాల్వాన్ అనుభవం ఎదురవుతుందని ఆమె నార్తన్ కమాండ్ స్టేట్‌మెంట్‌ను గేలి చేసే విధంగా గల్వాన్ సేస్ హాయ్ అంటూ.. ట్వీట్ చేశారు.
దీనిపై ఆర్మీ అధికారులు, బీజేపీ నేతల తీవ్రంగా మండిపడ్డారు. సైన్యాన్ని అవమానించడం కొందరు సెలబ్రిటీలకు అలవాటుగా మారిందన్నారు. పబ్లిసిటీ కోసం వాళ్లు చేసే వ్యాఖ్యలను పట్టించుకోవద్దు, భారత సైన్యం సత్తాను చూసి దేశం గర్విస్తోందన్నారు. ఆమె చేసిన ట్వీట్ తుక్డే- తుక్డే మెంటాల్టీని సూచిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అటు మధ్యప్రదేశ్‌లో ఫిర్యాదులు కూడా అందాయి. సినిమాకూ జీవితానికీ చాలా పెద్ద తేడా ఉంది. ఈ విషయం గుర్తించకుండా వ్యవహరించడం తగదంటున్నారు.. మధ్య ప్రదేశ్ హోం మంత్రి మిశ్రా. మీ కామెంట్లు దేశ భక్తులను బాధించాయని.. ఇది సీరియస్ ఇష్యూగా చెప్పారాయన. ఈ విషయంపై తాము ఇక్కడితో వదిలేది లేదని. న్యాయపరమైన అభిప్రాయాలను సేకరించగానే తప్పక చర్యలు తీసుకుంటామని అన్నారాయన. ఇదే చద్దా.. ఢిల్లీలో శ్రద్ధా వాకర్ ను ముక్కలు చేసిన అఫ్తాబ్ పై కామెంట్ల చేయలేదనీ. తీవ్రంగా స్పందించారు ఎంపీ హోం మినిస్టర్.
అంతే కాదు చద్దా ట్వీట్‌పై బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ఘాటుగా స్పందించారు. భారత సైనికుల త్యాగాల్లే మనమంతా దేశంలో క్షేమంగా ఉన్నామని, సైన్యాన్ని కించపర్చే విధంగా వ్యాఖ్యలు చేయడం తగదని అక్షయ్ ట్వీట్ చేశారు. రిచా కామెంట్స్ తనను చాలా బాధపెట్టాయన్నారు. అయితే అక్షయ్‌కుమార్ ట్వీట్‌కు కౌంటరిచ్చారు నటుడు ప్రకాశ్‌రాజ్. దేశానికి రిచా చడ్డా లాంటి వాళ్లు కావాలని మీలాంటి వ్యక్తుల అవసరం లేదని ఆయన ట్వీట్ చేశారు. రిచాకి కాంగ్రెస్ కూడా మద్దతు పలికింది. POK ఆక్రమించుకునేందుకు సైన్యం సిద్ధంగా ఉన్నప్పుడు.. బీజేపీ ప్రభుత్వం ఎందుకు వెనుకాడుతోందంటూ నగ్మా ప్రశ్నించారు.
ఇవన్నీ ఇలా ఉంటే.. తాను చేసిన ట్వీట్ ఇంత సీరియస్ ఇష్యూగా మారడంతో చద్దా సారీ చెప్పారు. భారత సైన్యం మనోభావాలను దెబ్బ తీసే ఉద్దేశం తనకు లేదని.. సోషల్ మీడియా వేదికగా.. క్షమాపణలు చెప్పారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..