WhatsApp Data Leak: వాట్సాప్ యూజర్లకు బిగ్ షాక్.. అమ్మకానికి 50 కోట్ల మంది ఫోన్‌ నంబర్లు..!

ఈ రోజుల్లో ప్రతొక్కరి చేతిలో ఆండ్రాయిడ్‌ ఫోన్‌ ఎలా ఉంటుందో.. అందులో వాట్సప్‌ ఉండటం కామన్‌. ఇప్పుడు ఆ వాట్సప్‌ ఉండటమే పెద్ద ప్రమాదంగా మారింది. దాదాపు 50 కోట్ల మంది వాట్సప్‌ యూజర్ల ఫోన్ నంబర్లు హ్యాకర్ల చేతికి వెళ్లిపోయాయి.

WhatsApp Data Leak: వాట్సాప్ యూజర్లకు బిగ్ షాక్.. అమ్మకానికి 50 కోట్ల మంది ఫోన్‌ నంబర్లు..!
Whatsapp
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Nov 27, 2022 | 7:12 AM

WhatsApp Data Leak: ఫేస్‌బుక్‌కు చెందిన మైక్రోబ్లాగింగ్ మెసేజింగ్ యాప్‌ వాట్సాప్‌ నుంచి భారీగా డేటా లీక్‌ అయ్యింది. దాదాపు 50 కోట్ల మంది వాట్సాప్‌ యూజర్ల ఫోన్‌ నంబర్లు ఆన్‌లైన్‌లో విక్రయానికి ఉంచినట్లు తెలుస్తోంది. అమెరికా సహా పలు దేశాలకు చెందిన యూజర్ల నంబర్లను హ్యాకర్లు అమ్మకానికి ఉంచారు. ఓ హ్యాకింగ్‌ కమ్యూనిటీ ఫోరమ్‌లో ఈ ఫోన్‌ నంబర్ల విక్రయానికి సంబంధించిన ప్రకటన పెట్టినట్లు సమాచారం. 50 కోట్ల వాట్సాప్‌ యూజర్ల ఫోన్‌ నంబర్లతో 2022 డేటాబేస్‌ను విక్రయిస్తున్నట్లు ఓ హ్యాకర్‌ ఆన్‌లైన్‌లో ప్రకటన ఇచ్చాడు.

భారత్ సహా.. అమెరికా, యూకే, ఈజిప్టు, ఇటలీ, సౌదీఅరేబియా సహా 84 దేశాలకు చెందిన యూజర్ల నంబర్లను అమ్మకానికి పెట్టారని తెలుస్తోంది. ఇందులో భారత యూజర్ల నంబర్లు కూడా ఉన్నాయట. అత్యధికంగా ఈజిప్టు నుంచి 4.5కోట్ల మంది, అత్యల్పంగా రష్యా నుంచి దాదాపు కోటి మంది వాట్సాప్‌యూజర్ల నంబర్లు లీకైనట్లు తెలిసింది. ఒక్కో దేశానికి చెందిన యూజర్ల నంబరుకు ఒక్కో ధరతో విక్రయానికి పెట్టినట్టు సమాచారం.

అమెరికా డేటాసెట్‌ అయితే 7వేల డాలర్లు, యూకే డేటా ధర 2500 డాలర్లు, జర్మనీ యూజర్ల నంబర్ల ధర 2వేల డాలర్లుగా ఉన్నట్లు తెలిసింది. ఈ నంబర్లను సైబర్‌ నేరగాళ్లు కొనుగోలు చేసుకుని మోసాలకు పాల్పడే ప్రమాదం ఉందని ఓనివేదిక హెచ్చరించింది. అందువల్ల, గుర్తుతెలియని నంబర్ల నుంచి కాల్స్‌, మెసేజ్‌లు వస్తే స్పందించొద్దని సూచించింది.

ఇవి కూడా చదవండి

కాగా.. మెటాకు చెందిన సంస్థల్లో డేటా లీక్‌ ఘటనలు ఇదే తొలిసారి కాదు. గతేడాది కూడా 50కోట్ల మందికి పైగా ఫేస్‌బుక్‌ యూజర్ల డేటా హ్యాకర్ల చేతికి చిక్కి ఆన్‌లైన్‌లో లీక్‌ అయినట్లు వార్తలు వచ్చాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..