AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Haryana: ఊయలే ఉరితాడైంది.. ప్రమాదవశాత్తు గొంతుకు చుట్టుకుని.. ఆడుకంటుండగా ఘటన..

సరదాగా అడుకుంటున్న ఆటే తన పాలిట మృత్యువుగా మారుతుందని ఆ బాలుడు గమనించలేకపోయాడు. సీలింగ్ ఫ్యాన్ కు వేలాడుతున్న గుడ్డను ఊయలగా చేసుకుని ఆడుకుంటున్న సమయంలో ఊహించని ఘటన..

Haryana: ఊయలే ఉరితాడైంది.. ప్రమాదవశాత్తు గొంతుకు చుట్టుకుని.. ఆడుకంటుండగా ఘటన..
mothers dead body
Ganesh Mudavath
|

Updated on: Nov 27, 2022 | 6:55 AM

Share

సరదాగా అడుకుంటున్న ఆటే తన పాలిట మృత్యువుగా మారుతుందని ఆ బాలుడు గమనించలేకపోయాడు. సీలింగ్ ఫ్యాన్ కు వేలాడుతున్న గుడ్డను ఊయలగా చేసుకుని ఆడుకుంటున్న సమయంలో ఊహించని ఘటన జరిగింది. అంత సేపు తాను ఆడుకుంటున్న ఊయలే తన ప్రాణాలు తీసేసింది. ప్రమాదవశాత్తు ఊయల తన మెడకు చుట్టుకోవడంతో ఆ బాలుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన హరియాణాలోని పానిపట్ లో జరిగింది. బంగాల్ ఇస్లాంపుర్ ప్రాంతానికి చెందిన కోషర్.. తన కుటుంబ సభ్యులతో కలిసి ఉపాధి కోసం హరియాణాకు వచ్చాడు. పానిపట్ జిల్లా భాల్సీ గ్రామంలో నివాసం ఉంటా స్థానికంగా ఉన్న పరిశ్రమ​లో పని చేస్తున్నాడు. రోజావారీగానే కోషర్ పనికి వెళ్లిన సమయంలో అతడి భార్యాపిల్లలు ఇంట్లోనే ఉన్నారు. పెద్ద కుమారుడు నజీం రాజా ఆడుకోవడానికి బయటకు వెళ్లాడు. ఓ ఖాళీ గదిలో సీలింగ్​కు వేళాడుతున్న గుడ్డ ఊయల ఉచ్చులో పడి ప్రాణాలు కోల్పోయాడు. కుమారుడు ఎంత సేపటికీ ఇంటికి రాకపోవడంతో కోషర్ కుటుంబసభ్యులు అతని కోసం గాలింపు చేపట్టారు.

ఈ క్రమంలోనే మరో కుమారుడు తన అన్నను చూసి సమచారం ఇచ్చాడు. ఆమె వచ్చి చూసే సరికే ఉరికి వేలాడుతున్నాడు. వెంటనే వారు అలర్ట్ అయ్యి చికిత్స కోసం అతడిని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే బాలుడు చనిపోయాడని వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. తమ కుమారుడు ఊహించని విధంగా ఊయలకు చిక్కి చనిపోవడంతో కోషర్ కుటుంబసభ్యులు విలపించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..