Vikasit Bharat: ప్రధాని మోదీ ‘వికసిత్ భారత్‌’కు ఇదే నిదర్శనం.. సమస్యలకు సత్వర పరిష్కారం దిశగా..

ఇందులో భాగంగా వికసిత్‌ భారత్‌ అంబాసిడర్‌ పేరుతో దేశవ్యాప్తంగా పలు విద్యా సంస్థల్లో కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. వీటికి వివిధ యూనివర్సిటీలు, కాలేజీల నుంచి పెద్ద ఎత్తున విద్యార్థులు హాజరవుతున్నారు. భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా ఎలా మార్చాలన్న దానిపై విద్యార్థులు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు...

Vikasit Bharat: ప్రధాని మోదీ 'వికసిత్ భారత్‌'కు ఇదే నిదర్శనం.. సమస్యలకు సత్వర పరిష్కారం దిశగా..
Vikasit Bharat 20247
Follow us
Narender Vaitla

|

Updated on: Mar 15, 2024 | 5:43 PM

వికసిత్ భారత్‌ 2047 పేరుతో కేంద్ర ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 100 ఏళ్లకు భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడమే లక్ష్యంగా ప్రధాని ‘వికసిత్‌ భారత్‌ 2047’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో దేశంలోని యువతను భాగస్వామ్యం చేస్తున్నారు.

ఇందులో భాగంగా వికసిత్‌ భారత్‌ అంబాసిడర్‌ పేరుతో దేశవ్యాప్తంగా పలు విద్యా సంస్థల్లో కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. వీటికి వివిధ యూనివర్సిటీలు, కాలేజీల నుంచి పెద్ద ఎత్తున విద్యార్థులు హాజరవుతున్నారు. భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా ఎలా మార్చాలన్న దానిపై విద్యార్థులు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. అదే విధంగా తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను సైతం వివరిస్తున్నారు.

ఇదిలా ఉంటే వికసిత్ భారత్‌ కార్యక్రమం ద్వారా వస్తున్న మార్పు కూడా స్పష్టంగా కనిపిస్తోంది. తాజాగా జరిగిన సంఘటనే దీనికి నిరద్శనం. ఇటీవల ఢిల్లీలోని ఢిల్లీ యూనివర్సిటీలో జరిగిన వికసిత్‌ భారత్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌ కార్యక్రమంలో గార్గి కాలేజీకి చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ కాలేజీకి చెందిన కొందరు విద్యార్థులు గార్గి కాలేజీలో హాస్టల్‌ అవసరముందని నినాదాలు చేశారు. దీంతో వెంటనే స్పందించిన ప్రభుత్వం ఆ దిశగా నిర్ణయం తీసుకుంది.

ఇదే విషయమై గార్గి కాలేజీకి చెందిన యువతులు మీడియాతో తమ సంతోషాన్ని పంచుకున్నారు. తాము వికసిత్‌ భారత్‌ కార్యక్రమంలో తెలిపిన సమస్యను ఇంత త్వరగా పరిష్కారం చూపుతారని అస్సలు ఊహించలేదన్న యువతులు, ఇది నిజంగా చాలా గొప్ప విషయమని, నిజమైన వికసిత్‌ భారత్‌కు అర్థమని చెప్పుకొచ్చారు. తమ కాలేజీకి నిర్భయ నిధిని కూడా విడుదల చేస్తూ నిర్ణయం తీసుకున్నారని సంతోషం వ్యక్తం చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..