AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రేయ్ ఏంట్రా ఇది.. ఉత్తుత్తి కోర్టు పెట్టి తీర్పులు కూడా ఇచ్చేశారు.. కట్ చేస్తే..

Gujarat Fake Court Scam: గుజరాత్‌లో గాంధీనగర్ కేంద్రంగా ఒక ముఠా ఏకంగా ‘నకిలీ కోర్టు’నే ఏర్పాటు చేసి ప్రజలను మోసం చేసిన ఘటన దేశాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. మోరిస్ శామ్యూల్ అనే వ్యక్తి నాయకత్వంలో నడిచిన ఈ ముఠా, ప్రజల అమాయకత్వాన్ని, న్యాయవ్యవస్థపై ఉన్న నమ్మకాన్ని ఉపయోగించుకుని ఈ దందాను సాగించింది. నిజమైన కోర్టుల మాదిరిగానే వ్యవహరిస్తూ పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడ్డారు.

రేయ్ ఏంట్రా ఇది.. ఉత్తుత్తి కోర్టు పెట్టి తీర్పులు కూడా ఇచ్చేశారు.. కట్ చేస్తే..
Fake Court In Gujarat
Rakesh Reddy Ch
| Edited By: |

Updated on: Apr 23, 2026 | 6:18 PM

Share

సమాజంలో ఎన్నో రకాల ఘరానా మోసాలు చూస్తుంటాం. నకిలీ డాక్టర్లు, నకిలీ పోలీసులు, నకిలీ అధికారుల దందాలు నిత్యం వెలుగుచూస్తూనే ఉంటాయి. కానీ, గుజరాత్‌లో జరిగిన ఓ ఘటన మాత్రం యావత్ దేశాన్ని విస్మయానికి గురి చేస్తోంది. గుజరాత్‌లోని గాంధీనగర్‌ కేంద్రంగా ఓ ముఠా ఏకంగా ‘నకిలీ కోర్టు’నే సృష్టించింది. మోరిస్ శామ్యూల్ అనే కిలాడీ ఈ నాటకానికి ప్రధాన సూత్రధారి. జనం అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని, న్యాయవ్యవస్థపై వారికి ఉన్న నమ్మకాన్ని పెట్టుబడిగా మార్చుకుని ఈ మోసానికి తెరలేపాడు. సినిమా కథను మించిన క్రైమ్ థ్రిల్లర్‌లా ఈ వ్యవహారాన్ని నడిపించాడు. ప్రభుత్వం తనను ‘అధికారిక మధ్యవర్తి’ (Arbitrator)గా నియమించిందని ముందుగా విస్తృతంగా ప్రచారం చేసుకున్నాడు. ఎవరైనా నిజం అనుకునేలా ఒక గదిని అద్దెకు తీసుకుని, అందులో అచ్చం కోర్టును తలపించేలా సెటప్‌ను ఏర్పాటు చేశాడు. ఏకంగా న్యాయమూర్తి కుర్చీలో తనే దర్జాగా కూర్చుని తీర్పులు ఇవ్వడం మొదలుపెట్టాడు.

కేవలం కుర్చీ వేసుకుని కూర్చోవడమే కాదు, తన చుట్టూ నకిలీ సిబ్బందిని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. కొందరు నకిలీ లాయర్లు, గుమస్తాలు, కోర్టు సిబ్బంది కూడా ఆ గదిలో ఫైళ్లు పట్టుకుని హడావిడి చేసేవారు. దీంతో అక్కడికి వెళ్లిన ఎవరికైనా అది నిజమైన కోర్టు అనే భ్రమ కలిగేది. తీవ్రమైన కష్టాల్లో ఉన్న బాధితులు తమ నిస్సహాయతతో ఆ నకిలీ జడ్జిని గుడ్డిగా నమ్మారు.

గత ఐదేళ్లుగా అంటే 2019 నుంచి 2024 వరకు ఈ నకిలీ కోర్టు దందా నిర్విరామంగా సాగింది. ఏళ్ల తరబడి నిజమైన కోర్టుల చుట్టూ తిరిగి విసిగిపోయిన భూ వివాద బాధితులనే వీరు ప్రధాన లక్ష్యంగా ఎంచుకున్నారు. సివిల్ కేసులను త్వరగా పరిష్కరిస్తామని నమ్మించి, వారి నుంచి దర్జాగా లక్షల్లో ఫీజులు దండుకున్నారు. కేవలం వసూళ్లకే పరిమితం కాకుండా, ఈ నకిలీ జడ్జి ఏకంగా నకిలీ తీర్పుల కాపీలు కూడా రాసిచ్చేవాడు. ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తుల పేరు మీదకు మార్చేందుకు ఏకంగా జిల్లా కలెక్టర్లకు, రెవెన్యూ అధికారులకు సైతం నకిలీ ఆదేశాలు జారీ చేసేవాడు. ఇదంతా అత్యంత పకడ్బందీగా సాగింది.

ఇంత భారీ మోసం గుట్టు ఎలా రట్టయ్యిందంటే.. అతను ఇచ్చిన ఒక నకిలీ తీర్పు కాపీని కొందరు బాధితులు అహ్మదాబాద్ సిటీ సివిల్ కోర్టులో సమర్పించారు. ఆ పత్రాలను చూసి అనుమానం వచ్చిన సివిల్ కోర్టు అధికారి లోతుగా ఆరా తీశారు. దాంతో ఇన్నాళ్లూ గుట్టుగా సాగుతున్న నకిలీ కోర్టు కథ రట్టయింది. ఈ వ్యవహారంపై పోలీసు ఉన్నతాధికారులు సీరియస్‌గా దృష్టి పెట్టారు. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ జరిపి, ఆ పత్రాలు నకిలీవని నిర్ధారణ చేశారు. వెంటనే నిందితుడు మోరిస్ శామ్యూల్‌ను అరెస్టు చేశారు.

ప్రస్తుతం ఈ నకిలీ జడ్జి పోలీసుల అదుపులో కటకటాల వెనక ఉన్నాడు. న్యాయవ్యవస్థపై ప్రజలకున్న నమ్మకాన్ని కొందరు ఇలా సొమ్ము చేసుకుంటున్నారు. న్యాయం కోసం వెళ్లే బాధితులు అప్రమత్తంగా ఉండాలి. చట్టపరమైన విషయాల్లో ఎప్పుడూ అధికారిక మార్గాలనే ఎంచుకోవాలని, మధ్యవర్తులను ఆశ్రయించి మోసపోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Follow Us
ఆ రోబోట్ పాపం ధోనీ దెబ్బకి షాక్ అయినట్టుంది
ఆ రోబోట్ పాపం ధోనీ దెబ్బకి షాక్ అయినట్టుంది
ఏపీలో కొత్త పింఛన్లపై బిగ్ అప్డేట్.. జారీ అప్పటినుంచే..
ఏపీలో కొత్త పింఛన్లపై బిగ్ అప్డేట్.. జారీ అప్పటినుంచే..
ఎండ వేడి, ఉబ్బరానికి కిటికీలు తెరిచి పడుకుంటున్నారా? జాగ్రత్త!
ఎండ వేడి, ఉబ్బరానికి కిటికీలు తెరిచి పడుకుంటున్నారా? జాగ్రత్త!
మహానటి సావిత్రి ఆ తెలుగు స్టార్ హీరోను బావ అని పిలిచేది తెలుసా?
మహానటి సావిత్రి ఆ తెలుగు స్టార్ హీరోను బావ అని పిలిచేది తెలుసా?
ఈ పుట్టిన తేదీల వారికి బంగారం వేసుకుంటే అదృష్టం వెంటపడుతుంది!
ఈ పుట్టిన తేదీల వారికి బంగారం వేసుకుంటే అదృష్టం వెంటపడుతుంది!
మస్కిటో కాయిల్ అంటుకొని చనిపోయాడా..? అర్థరాత్రి ఇంకేమైనా జరిగిందా
మస్కిటో కాయిల్ అంటుకొని చనిపోయాడా..? అర్థరాత్రి ఇంకేమైనా జరిగిందా
చెరకు రసం, నిమ్మరసం, కొబ్బరి నీళ్లు.. ఆరోగ్యానికి ఏది బెస్ట్..?
చెరకు రసం, నిమ్మరసం, కొబ్బరి నీళ్లు.. ఆరోగ్యానికి ఏది బెస్ట్..?
టాస్ గెలిచిన ముంబై.. ఇరు జట్ల ప్లేయింగ్ 11 ఇదే
టాస్ గెలిచిన ముంబై.. ఇరు జట్ల ప్లేయింగ్ 11 ఇదే
యూట్యూబ్ సంపాదన చెప్పిన జబర్దస్త్ మహిధర్..
యూట్యూబ్ సంపాదన చెప్పిన జబర్దస్త్ మహిధర్..
అందమైన పూలు..కానీ,అడవులకు శాపం! భారతదేశాన్ని వణికిస్తున్న ఈ మొక్క
అందమైన పూలు..కానీ,అడవులకు శాపం! భారతదేశాన్ని వణికిస్తున్న ఈ మొక్క