వారం గ్యాప్‌లోనే ఇద్దరు చిన్నారుల మృతి.. అర్థరాత్రే వెంటాడిన మృత్యువు.. అసలేంజరిగిందంటే?
కేరళలోని తిరువనంతపురంలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. పాము కాటుకు గురై ఒక చిన్నారి ప్రాణాలు కోల్పోయిన విషాదకర సంఘటన చోటుచేసుకుంది. తెల్లవారుజామున ఇంట్లోకి దూరిన ఓ నాగు పాము గాడ నిద్రలో ఉన్న 8 ఏళ్ల చిన్నారిని కాటేసింది. గమనించిన కుటుంబ సభ్యులు అతన్ని హాస్పిటల్‌కు తరలించినప్పటికి చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది.

గాడ నిద్రలో ఉండగా పాముకాటుకు గురై 8 ఏళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన కేరళలోని తిరువనంతపురంలో వెలుగు చూసింది. వివరాల్లో వెళ్తే.. అజూర్ ప్రాంతానికి చెందిన దిలీప్, అను అనే దంపతుల 8 ఏళ్ల దక్షల్ అనే కుమారుడు ఉన్నాడు. అయితే ఫ్యామిలో మొత్తం పడుకొని ఉండగా తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో ఇంట్లోకి దూరిన ఓ పాము గాఢనిద్రలో దక్షల్‌ను కాటు వేసింది. పాము కాటుతో ఒక్కసారగా బాలుడు ఏడవడంతో వెంటనే అప్రమత్తమైన పేరెంట్స్ బాలుడిని తక్షణమే చికిత్స నిమిత్తం హాస్పిటల్ తరలించారు.
అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం మరో హాస్పిటల్‌కు తరలించారు. కానీ అప్పటికే బాలుడు మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. అది విన్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించాలరు. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న కుమారు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో గుండెలు పగిలేలా రోధించారు.
గత వారం త్రిసూర్‌లో జరిగిన మరో ఘటన
గత వారమే త్రిసూర్ జిల్లాలోని కొడాలిలో ఇలాంటిదే మరో విషాదం జరిగింది. అక్కడ కూడా 8 ఏళ్ల ఆల్జో అనే బాలుడు కూడా పాము కాటుతో మరణించాడు. వివరాల్లోకి వెళ్తే.. ఆల్జో తల్లి, సోదరుడితో కలిసి రాత్రి ఇంట్లో పడుకున్నారు. సరిగ్గా అర్థరాత్రి సమయంలో ఇంట్లోకి చొరబడిన ఓ నాగుపాము ఇద్దరు చిన్నారులను కాటేసి వెళ్లిపోయింది. అయితే ఆర్థరాత్రి నిద్రలేచిన పిల్లలు ఇద్దరూ కడుపునొప్పి అని చెప్పడంతో ఫుడ్ పాయిజన్ ఏదైనా అయుంటుందని భావించిన తల్లి ఇద్దరి పిల్లలకు జిలకర్ర నీటిని తాపి పడుకొబెట్టింది.
అయితే తెల్లారి అల్జో పరిస్థితి తీవ్ర విషమించడంతో ఇద్దరు పిల్లను పేరెంట్స్ హాస్పిటల్‌కు తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ చిన్నోడు అల్జో మృతి చెందగా పెద్దవాడు ప్రాణాలతో బయటపటపడ్డాడు. అయితే పిల్లల్ని కాటేసిన పాము ఇంట్లో కనిపించడంతో దాన్ని చంపేశారు కుటుంబ సభ్యులు. ఇంటి కిటికీ వద్ద పెంచిన ద్రాక్ష తీగ ద్వారానే పాము లోపలికి వచ్చి పిల్లలను కాటేసి ఉండవచ్చని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
