TGSRTC: ఆర్టీసీ ఉద్యోగుల నిరసనలో ఉద్రిక్తత.. నిప్పంటించుకుని డ్రైవర్ ఆత్మహత్యాయత్నం..
ఆర్టీసీ ఉద్యోగుల నిరసనలో ఉద్రిక్తత నెలకొంది. ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేటలో డ్రైవర్ శంకర్‌గౌడ్ ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. నిరసనలో పాల్గొంటున్న ఆర్టీసీ డ్రైవర్ శంకర్‌గౌడ్ పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నారు.. దీంతో ఆయనకు గాయాలయ్యాయి.. వెంటనే కార్మికులు.. శంకర్‌గౌడ్‌ను ఎంజీఎంకు తరలించారు.

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి.. కార్మికులను ఉద్యోగులుగా గుర్తించాలంటూ తెలంగాణలో రెండు రోజులుగా టీజీఎస్ఆర్టీసీ కార్మికుల ఆందోళన కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా డిపోల ఎదుట కార్మికులు ధర్నాలు, ఆందోళనలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆర్టీసీ ఉద్యోగుల నిరసనలో ఉద్రిక్తత నెలకొంది. ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేటలో డ్రైవర్ శంకర్‌గౌడ్ ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. నిరసనలో పాల్గొంటున్న ఆర్టీసీ డ్రైవర్ శంకర్‌గౌడ్ పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నారు.. దీంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి.. వెంటనే కార్మికులు.. శంకర్‌గౌడ్‌ను ఎంజీఎంకు తరలించారు. 2 రోజులుగా డ్రైవర్ శంకర్‌గౌడ్ సమ్మెలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే.. శంకర్ గౌడ్ ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. అనంతరం.. ఆర్టీసీ ఉద్యోగులు డిపో ఎదుట ధర్నా చేపట్టారు. డిపోలోకి వెళ్లేందుకు కార్మికులు ప్రయత్నించగా.. వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఘటన అనంతరం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా.. పోలీసులను భారీగా మోహరించారు.
వీడియో చూడండి..
బందోబస్త్ మధ్య బస్సులు
కాగా.. తెలంగాణ వ్యాప్తంగా పోలీసు బందోబస్త్ మధ్య బస్సులు నడిపేందుకు RTC అధికారులు యత్నిస్తుంటే సిబ్బంది అడ్డుకుంటున్నారు. కాంట్రాక్ట్ డ్రైవర్లు, కానిస్టేబుళ్ల సాయంతో అద్దె, RTC బస్సులను పంపిస్తున్నారు పోలీసులు. ఇప్పటికే. డిపోల దగ్గర పోలీసులు ప్రత్యేకంగా భద్రత ఏర్పాటు చేశారు. నిరసన చేస్తున్న కార్మికులు అడ్డుతగలకుండా పోలీసు పహారా మధ్య బస్సులు నడుపుతున్నారు అధికారులు..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
