AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీ పాలనా వ్యవస్థ దారుణం.. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు మాజీ అధికారుల బహిరంగ లేఖ..

యూపీలో గవర్నెన్స్ (పాలనా వ్యవస్థ) దారుణంగా ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు రాసిన బహిరంగ లేఖలో 74 మంది మాజీ అధికారులు ఆరోపించారు.

మీ పాలనా వ్యవస్థ దారుణం.. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు మాజీ అధికారుల బహిరంగ లేఖ..
Yogi Adityanath
Umakanth Rao
| Edited By: Phani CH|

Updated on: Jul 12, 2021 | 4:50 PM

Share

యూపీలో గవర్నెన్స్ (పాలనా వ్యవస్థ) దారుణంగా ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు రాసిన బహిరంగ లేఖలో 74 మంది మాజీ అధికారులు ఆరోపించారు. వీరిలో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు ఉంన్నారు. ఈ ప్రభుత్వ హయాంలో బలవంతపు నిర్బంధాలు, టార్చర్లు పెరిగిపోయాయని. శాంతి యుతంగా నిరసన చేస్తున్న వారిపై పోలీసులు దాడులు చేస్తున్నారని, అకారణంగా అరెస్టులు చేస్తున్నారని వీరు పేర్కొన్నారు.లవ్ జిహాద్ పేరిట ముస్లిములను వేధిస్తున్నారని, ఇక కోవిడ్ విషయానికి వస్తే ఈ మహమ్మారికి సంబంధించి దీన్ని ప్రభ్యుత్వం సరిగా హ్యాండిల్ చేయలేకపోయిందని విమర్శించారు. కోవిడ్ మృతుల సంఖ్యను ప్రభుత్వం స్పష్టంగా చెప్పలేకపోయిందని..ఎగ్జిక్యూటివ్, పోలీసు శాఖలు సహా అన్ని పాలనా శాఖలు చతికిలబడ్డాయని, హెల్త్ కేర్ సిస్టం కుప్పకూలిందని అన్నారు. నేరాలు పెరిగి పోతున్నా వీటి గురించి పోలీసులు పట్టించుకోవడంలేదని..ఈ శాఖ నిర్వీర్యమైపోయిందన్నారు. మహిళలకు భద్రత లేకుండా పోయిందని ఈ మాజీ అధికారులు దుయ్యబట్టారు.

స్థానిక ఎన్నికల్లో సైతం హింసాత్మక ఘటనలు, అల్లర్లు జరుగుతున్నాయని, వివిధ పార్టీల వారు ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడుతున్నారని కేసులు పెట్టినా పరిస్థితి మారడంలేదన్నారు. కేరళకు చెందిన జర్నలిస్ట్ సిద్ధిక్ కప్పన్ హత్రాస్ జిల్లాకు వెళ్తుండగా ఆయనను అరెస్టు చేశారని, ఆయన ఇప్పటికే జైల్లో 200 రోజులకు పైగా ఉన్నారన్నారు. ఒక మహిళ హత్యాచారానికి గురైతే ఆ ఘటనను కవర్ చేసేందుకు వెళ్లిన ఓ పాత్రికేయునిపై ఇలా వ్యవహరిస్తారా అని వారు ప్రశ్నించారు.కోర్టు నుంచి ఆయనకు ఇంకా న్యాయం లభించలేదన్నారు. కాగా ఈ లేఖకు 200 మందికి పైగా ప్రముఖులు మద్దతు ప్రకటించారు. ఈ లేఖలోని అంశాలతో ఏకీభవిస్తున్నామన్నారు. లోగడ కూడా మాజీ అధికారులు, కొందరు మేధావులు కూడా యూపీ సీఎంకి ఈ విధమైన లేఖ రాశారు.

మరిన్ని ఇక్కడ చూడండి: Taliban in Afghanistan: ఆఫ్ఘనిస్తాన్ లో మళ్ళీ తాలిబన్ల పాలన..?? ఏం జరగనుంది..?? భారత్ పరిస్థితి ఏంటి..??

Narappa: అఫీషియల్ అనౌన్స్ వచ్చేసింది.. అమెజాన్ ప్రైమ్‏లోనే వెంకటేష్ “నారప్ప”… విడుదల ఎప్పుడంటే..