ఆ టూరిస్టు ప్రాంతాల్లో జల విలయం.. ఉధృత నీటి ప్రవాహంలో పడవల్లా కొట్టుకొస్తున్న కార్లు.. ఎక్కడంటే..?

క్లౌడ్ బరస్ట్ కారణంగా హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో ఆకస్మిక వరదలు కనీవినీ ఎరుగని బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. ధర్మశాలతో బాటు దీనికి సుమారు 58 కి..మీ.దూరంలోని కాంగ్రా జిల్లాలో భాగ్సు నాగ్ ఏరియా, మెక్ లియోడ్ గంజ్ తదితర ప్రాంతాలు జలమయమయ్యాయి.

ఆ టూరిస్టు ప్రాంతాల్లో జల విలయం.. ఉధృత నీటి ప్రవాహంలో  పడవల్లా కొట్టుకొస్తున్న కార్లు.. ఎక్కడంటే..?
Flash Floods
Follow us
Umakanth Rao

| Edited By: Phani CH

Updated on: Jul 12, 2021 | 4:56 PM

క్లౌడ్ బరస్ట్ కారణంగా హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో ఆకస్మిక వరదలు కనీవినీ ఎరుగని బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. ధర్మశాలతో బాటు దీనికి సుమారు 58 కి..మీ.దూరంలోని కాంగ్రా జిల్లాలో భాగ్సు నాగ్ ఏరియా, మెక్ లియోడ్ గంజ్ తదితర ప్రాంతాలు జలమయమయ్యాయి. నీటి ప్రవాహ వేగానికి ఈ ప్రాంతాల్లో నిలిపి ఉంచిన కార్లు పడవల్లా కొట్టుకుపోతున్నాయి. ఒక్కో కారు ఈ వేగానికి వెనుకకు వస్తూ అంతకుముందే నిలిచిపోయిన వాహనాలను ఢీ కొని నిలిచిపోతోంది. అతి పెద్ద వాహనాలు కూడా కొట్టుకుపోవడం చూసి స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. నిన్న మొన్నటివరకు టూరిస్టులతో కళకళలాడిన ధర్మశాల ఇప్పుడు బీభత్సంగా కనబడుతోంది. కొన్ని చోట్ల ఇళ్ళు, భవనాలు, హోటళ్లు తీవ్రంగా దెబ్బ తిన్నట్టు తెలుస్తోంది. ఎత్తయిన ఇళ్ల బాల్కనీల నుంచి కొందరు తీసిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.

నిన్నటి వరకు ఉష్ణోగ్రత కారణంగా ఉక్కపోతతో అల్లాడిన ప్రజలు వాతావరణం చల్లబడడంతో సేద దీరుతున్నప్పటికీ ఈ హఠాత్పరిణామం వారిని తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. అన్ని వైపుల నుంచి వస్తున్న నీటి ప్రవాహ వేగాన్ని చూసి వారు బెంబేలెత్తుతున్నారు. సాధారణంగా హిల్ స్టేషన్లలో క్లౌడ్ బరస్ట్ లు ఇంతటి భయానక పరిస్థితిని సృష్టిస్తుంటాయి. ఏ మాత్రం ఊహించలేని ఇవి మెరుపు వరదలకు కారణమవుతుంటాయి. అపార నష్టాన్ని కలుగజేస్తుంటాయి.

మరిన్ని ఇక్కడ చూడండి: మీ పాలనా వ్యవస్థ దారుణం.. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు మాజీ అధికారుల బహిరంగ లేఖ..

Taliban in Afghanistan: ఆఫ్ఘనిస్తాన్ లో మళ్ళీ తాలిబన్ల పాలన..?? ఏం జరగనుంది..?? భారత్ పరిస్థితి ఏంటి..??

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..