ప్రభుత్వ ఉద్యోగమంటూ నమ్మించి యువతిపై గ్యాంగ్ రేప్.. అండమాన్ మాజీ సీఎస్ జితేంద్ర నరైన్ అరెస్ట్
యువతిపై గ్యాంగ్ రేప్ కేసులో.. అండమాన్ నికోబార్ దీవులు మాజీ చీఫ్ సెక్రటరీ జితేంద్ర నరైన్‌ను ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అరెస్టు చేసింది. 21 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం కేసులో ఆయన ప్రధాన నిందితుడిగా ఉన్నారు.

యువతిపై గ్యాంగ్ రేప్ కేసులో.. అండమాన్ నికోబార్ దీవులు మాజీ చీఫ్ సెక్రటరీ జితేంద్ర నరైన్‌ను ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అరెస్టు చేసింది. 21 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం కేసులో ఆయన ప్రధాన నిందితుడిగా ఉన్నారు. 21 ఏళ్ల యువతికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి అండమాన్ నికోబార్ మాజీ చీఫ్ సెక్రటరీ నరైన్ ఇంట్లో ఆయనతోపాటు మరో ఉన్నతాధికారి సామూహిక అత్యాచారం చేశారన్న యువతి ఆరోపణలపై.. దర్యాప్తు చేసేందుకు ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. దీంతోపాటు ఆయన్ను సస్పెండ్ చేసింది. కాగా.. ఈ కేసుకు సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందం నరైన్‌ను మూడుసార్లు ప్రశ్నించింది. నరైన్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ దరఖాస్తును స్థానిక కోర్టు తిరస్కరించడంతో అరెస్టు చేసినట్లు బాధితురాలి న్యాయవాది ఫాటిక్ చంద్ర దాస్ తెలిపారు. కోర్టు తీర్పు వచ్చిన కొద్దిసేపటికే పోలీసులు జితేంద్ర నరైన్ ఉంటున్న ఓ ప్రైవేటు రిసార్టుకు చేరుకొని భారీ భద్రత మధ్య అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసిన అనంతరం వైద్య పరీక్షల నిమితం ఆస్పత్రికి తరలించారు.
జితేంద్ర నరైన్ సీఎస్‌గా ఉన్న సమయంలో ఉద్యోగ వేటలో ఉన్న తనకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి.. తన అధికారిక నివాసంలో మరో అధికారితో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు యువతి ఆరోపించింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. యువతి ఫిర్యాదు మేరకు ఆగస్టులో అండమాన్ పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం ఈ కేసును దర్యాప్తు చేసేందుకు సీనియర్ ఐపీఎస్ అధికారి నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు.
అనంతరం సిట్ ఇచ్చిన నివేదిక ఆధారంగా తీవ్రంగా స్పందించిన కేంద్ర హోంశాఖ ఢిల్లీ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఛైర్మన్, ఎండీగా ఉన్న జితేంద్ర నరైన్‌ను విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.




మరిన్ని జాతీయ వార్తల కోసం..