Etela rajender: విమానంలో సాంకేతిక సమస్య… ఈటెల బృందానికి తప్పిన పెను ప్రమాదం..

ఈటెల రాజేంద‌ర్ బృందానికి ప్రమాదం త‌ప్పింది. ఈటెల రాజేందర్ స‌హా ఇత‌ర నాయ‌కులు  డిల్లీ నుండి వస్తున్న విమానంలో సాంకేతిక సమస్య త‌లెత్తింది.

Etela rajender: విమానంలో సాంకేతిక సమస్య...  ఈటెల బృందానికి తప్పిన పెను ప్రమాదం..
Etela Rajendar

ఈటెల రాజేంద‌ర్ బృందానికి ప్రమాదం త‌ప్పింది. ఈటెల రాజేందర్ స‌హా ఇత‌ర నాయ‌కులు  డిల్లీ నుండి వస్తున్న విమానంలో సాంకేతిక సమస్య త‌లెత్తింది. ఫైలెట్ అలెర్ట్ అవ్వడంతో పెను ప్రమాదం త‌ప్పింది. టేకాఫ్ సమయంలో రన్ వేపై ఉండ‌గా సాంకేతిక సమస్యను పైలెట్ గుర్తించారు. గాల్లోకి  లేచే టైంలో అప్ర‌మ‌త్త‌మై ఫైలెట్ విమానాన్ని ఆపేశాడు. ఢిల్లీ నుండి ప్రత్యేక విమానంలో కాసేప‌టి క్రిత‌మే ఈటెల రాజేంద్ర బృదం బయలుదేరింది. విమానంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్,  ఎమ్మెల్యే రఘనందన్, మాజీ ఎంపీ వివేక్, ఏనుగు రవీందర్ రెడ్డి, తుల ఉమాతో పాటు మొత్తం 184 మంది ఉన్న‌ట్లు తెలుస్తోంది.

సోమ‌వారం ఢిల్లీలో కేంద్ర మంత్రి ధర్మంద్ర ప్రధాన్ సమక్షంలో ఈటల రాజేందర్ బీజేపీ కండువా కప్పుకున్నారు. ఆయనతోపాటు రమేశ్‌ రాథోడ్‌, రవీందర్‌రెడ్డి, అశ్వత్థామరెడ్డి, తుల ఉమ, ఓయూ జేఏసీ నేత‌లు బీజేపీలో చేరారు. అనంత‌రం బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డాను ఈటెల అండ్ టీమ్ మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిసింది. ఈటల రాజేందర్‌ ఈరోజు హైదరాబాద్‌‌కు ఉదయం 10 గంటలకు ఢిల్లీ నుండి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోవాల్సి ఉంది. ఇక్క‌డికి వ‌చ్చాక‌ నాంపల్లిలోని బీజేపీ కార్యాలయానికి మొదటసారి ఈటల రాజేందర్ వెళ్లనున్నారు. ముఖ్యనేతలతో మాజీమంత్రి ఈటల సమావేశంకానున్నారు. అయితే విమానంలో సాంకేతిక స‌మ‌స్య త‌లెత్తడంతో షెడ్యూల్‌లో మార్పులు ఉండే అవ‌కాశాలు ఉన్నాయి.

 

Also Read: ‘ఫైన్లు వేస్తున్నా మార‌రా..?’.. ఆక‌తాయిల‌కు వైజాగ్ పోలీసుల సీరియ‌స్ వార్నింగ్

 విశాఖ జిల్లా డౌనూరు గ్రామంలో విక‌శించిన బ్ర‌హ్మ‌క‌మలం.. ప్ర‌త్యేక పూజ‌లు చేసిన గ్రామ‌స్థులు

Click on your DTH Provider to Add TV9 Telugu