Jharkhand Cash: మంత్రి ప్రైవేట్ సెక్రటరీ ఇంట్లో రూ. 37 కోట్లు స్వాధీనం.. నోటీసులు జారీ చేసిన ఈడీ
లోక్‌సభ ఎన్నికల వేళ భారీగా నగదు బయటపడుతోంది. ఈ క్రమంలోనే జార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అలంగీర్ ఆలంకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. మే 14న రాంచీ జోనల్ కార్యాలయంలో ఏజెన్సీ ముందు హాజరు కావాలని ఈడీ అలంగీర్ ఆలమ్‌ను కోరింది.

లోక్‌సభ ఎన్నికల వేళ భారీగా నగదు బయటపడుతోంది. ఈ క్రమంలోనే జార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అలంగీర్ ఆలంకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. మే 14న రాంచీ జోనల్ కార్యాలయంలో ఏజెన్సీ ముందు హాజరు కావాలని ఈడీ అలంగీర్ ఆలమ్‌ను కోరింది. మంత్రి వ్యక్తిగత కార్యదర్శి సంజీవ్ లాల్ ఇంటి నుండి భారీ నగదు స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో మంత్రిని పిలిపించినట్లు సమాచారం.
గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అలంగీర్ ఆలం కార్యదర్శి ఇంటిపై ఇటీవల ఈడీ అధికారులు దాడులు చేశారు. ఈ సోదాల్లో ఈడీ రూ.37 కోట్లకు పైగా నగదును స్వాధీనం చేసుకుంది. రాంచీలోని 6 ప్రాంతాల్లో ఈడీ దాడులు చేసింది. జార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అలంగీర్ ఆలం వ్యక్తిగత కార్యదర్శి సంజీవ్ లాల్, ఆయన ఇంటి పనిమనిషి జహంగీర్ ఇళ్లతోపాటు ఆరు చోట్ల సోదాలు నిర్వహించారు. సంజీవ్ లాల్ పనిమనిషి జహంగీర్ ఆలం ఇంటి నుంచి రూ.32.20 కోట్లు, మరో సన్నిహితుడి ఇంటి స్థలం నుంచి రూ.2.93 కోట్లు, సంజీవ్ లాల్ దాచిన రూ.10.5 లక్షలు ఈడీ స్వాధీనం చేసుకుంది.
ఈ కేసులో మంత్రి వ్యక్తిగత కార్యదర్శి సంజీవ్‌లాల్, ఆయన ఇంటి పనిమనిషి జహంగీర్ ఆలంలను అరెస్టు చేశారు. ప్రైవేట్ సెక్రటరీ సంజీవ్ లాల్, సేవకుడు జహంగీర్ ఆలంలను కోర్టులో హాజరుపరిచారు. అనంతరం అతడిని ఆరు రోజుల రిమాండ్‌కు తరలించారు. నిందితుడు జహంగీర్ ఆలం ఇంటి నుంచి రికవరీ చేసిన డబ్బును సంజీవ్‌లాల్ ఆదేశాల మేరకు ఉంచినట్లు ఈడీ కోర్టుకు తెలిపింది. లంచం సొమ్మును శాఖలోని అధికారులు, రాజకీయ నాయకులు అందరికీ సమానంగా పంచారని ఈడీ కోర్టుకు వివరించింది. ఈ నేపథ్యంలో తాజాగా అలంగీర్ ఆలంకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…