AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఎన్నికల నిర్వహణకు వేగంగా ఏర్పాట్లు.. త్వరలో రాష్ట్రానికి రానున్న కేంద్ర ఎన్నికల సంఘం బృందం

ఈ ఏడాది చివర్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి అందరీ తెలిసిందే. అయితే ఈ ఎన్నికల సజావుగా నిర్వహించేందుకు ఏర్పా్ట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే ఈ ఎన్నికల ప్రణాళికకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం.. ఇప్పటికే రాష్ట్ర అధికారులకు మార్గదర్శకాలను జారీ చేసింది. అయితే ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లును సమీక్షించేందుకు మందుకు కదులుతోంది. అక్టోబర్ 3 వ తేదీ నుంచి 5 వరకు తెలంగాణకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Telangana: ఎన్నికల నిర్వహణకు వేగంగా ఏర్పాట్లు.. త్వరలో రాష్ట్రానికి రానున్న కేంద్ర ఎన్నికల సంఘం బృందం
Election Commission Of India
Aravind B
|

Updated on: Sep 12, 2023 | 1:57 PM

Share

ఈ ఏడాది చివర్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి అందరీ తెలిసిందే. అయితే ఈ ఎన్నికల సజావుగా నిర్వహించేందుకు ఏర్పా్ట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే ఈ ఎన్నికల ప్రణాళికకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం.. ఇప్పటికే రాష్ట్ర అధికారులకు మార్గదర్శకాలను జారీ చేసింది. అయితే ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లును సమీక్షించేందుకు మందుకు కదులుతోంది. అక్టోబర్ 3 వ తేదీ నుంచి 5 వరకు తెలంగాణకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాదు త్వరలో మరో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే కమిషనర్ రాజీవ్ కుమార్ నేతృత్వంలో అధికారులు ఆయ రాష్ట్రాల్లోని ఏర్పాట్లను సమీక్ష చేయనున్నారు. అయితే ఇందులో భాగంగానే సీఈసీ.. తెలంగాణలో తాత్కాలిక పర్యటన తేదీలను రాష్ట్ర అధికారులకు పంపించింది.

అంతేకాదు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు.. రాష్ట్ర అధికారుల ఓటర్ల లిస్టు నుంచి పోలింగ్ కేంద్రాలు, పోలీసుల బందోబస్తు, బోగస్ ఓటర్లను తొలగించడం లాంటి వాటిపై దృష్టి సారిస్తున్నారు. అంతేకాదు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్ సైతం అధికారులతో సమావేశాలు నిర్వహిస్తూ పలు ఆదేశాలు ఇస్తున్నారు. దీంతో జిల్లా కలెక్టర్లు, పోలీసు అధికారులు ఎన్నికల ఏర్పాట్లపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చేందుకు కూడా రెడీ అయిపోతున్నారు. 2012 కు ముందు ఏపీ సిరీస్‌తో 13 నుంచి 14 అంకెలతో ఉన్నటువంటి ఓటర్ ఐడీ కార్డులను అధికారులు గుర్తించారు. అలాగే దేశవ్యాప్తంగా ఓటర్ ఐడీ కార్డు సంఖ్య 10 అంకెలకు తగ్గించారు. రాష్ట్రంలో దాదాపు 47 లక్షల 22 వేల మంది ఓటర్ ఐడీ కార్టుల నంబర్లు కూడా మారిపోయాయి. అయితే వాటికి నూతన ఫోటోలతో ఉన్న ఓటర్ కార్డులు ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

సేవా కేంద్రాల్లో అప్లై చేసుకొని నూతన కార్డులు పొందవచ్చని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారిల వికాస్ రాజ్ చెబుతున్నారు. అలాగే ఇంకా కొత్త ఓటరు నమోదు, ఓటరు జాబితా సవరణల కోసం వచ్చిన దరఖాస్తుల ప్రక్రియను వేగవంతం చేయాలని కూడా ఆయన అధికారులకు ఆదేశించారు. హైదరాబాద్ నుంచి సోమవారం నాడు సంయుక్త అధికారులు, ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌ను ఏర్పాటు చేశారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు ఆర్టీవోలతో ఓటరు నమోదు, ఓటరు జాబితా సవరణలు చేసేందుకు అందిన దరఖాస్తుల నిర్వహణపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. అలాగే 18 సంవత్సరాలు నిండిన ప్రతిఒక్కరి వివరాలను ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఇక పోలింగ్ కేంద్రాలు, లింగ నిష్పత్తి వారిగా దరఖాస్తు ఫారాలను కూడా పరిశీలించి ప్రక్రియను మరింత వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని సూచనలు చేశారు.