కశ్మీర్ నుంచి కుంకుమపువ్వు, సుందర్బన్ నుంచి తేనె, అరకు నుంచి టీ… G20 అతిథులకు ప్రధాని మోదీ ఏం ఇచ్చారో తెలుసుకోండి

G20 Summit: ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన న్యూఢిల్లీలో జరిగిన జీ20 సదస్సుకు హాజరైన అతిథులకు భారతీయ సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం అద్భుతమైన హస్తకళలను బహుమతులుగా అందజేశారు. వీటిలో కశ్మీరీ కుంకుమపువ్వు నుంచి డార్జిలింగ్ టీ, ఖాదీ స్కార్ఫ్, కంజీవరం, బనారసి సిల్క్ స్టోల్ పెర్ఫ్యూమ్‌ల వరకు అన్నీ ఉన్నాయి.

| Edited By: Narender Vaitla

Updated on: Sep 12, 2023 | 6:07 PM

కుంకుమపువ్వు (పర్షియన్‌లో 'జాఫ్రాన్', హిందీలో 'కేసర్') ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సుగంధ ద్రవ్యము. సంస్కృతులు, నాగరికతలలో కుంకుమపువ్వు దాని అసమానమైన పాక, ఔషధ విలువలకు విలువైనదిగా పరిగణించబడుతుంది. ఇది అరుదైన, మనోహరమైన ప్రకృతి నిధి. దానిలోని ప్రతి పోగులో 'కుంకుమపువ్వు క్రోకస్' అనేది ఉంటుంది. కశ్మీరీ కుంకుమపువ్వుకు చాలా ప్రత్యేకత ఉంది. అసాధారణ నాణ్యతకు కొలమానం అని చెప్పవచ్చు. యాంటీఆక్సిడెంట్‌లలో పుష్కలంగా పుష్కలంగా ఉంటుంది. అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.

1 / 14
పెకో డార్జిలింగ్, నీలగిరి టీ భారత్  టీ టేప్‌స్ట్రీ నుంచి రెండు ప్రసిద్ధమైనవి. తమిళనాడు, కర్నాటక, కేరళ రాష్ట్రాలలో విస్తరించి ఉన్న అందమైన నీలగిరి కొండల్లో ఈ టీ పంటను పండిస్తారు. సున్నితమైన సువాసన, అద్భుతమైన సుగంధ చాయ్. ఇది రంగు, రుచి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది బంగారు పసుపు వర్ణంలో కనిపిస్తుంది.

2 / 14
కశ్మీరీ పష్మీనా శాలువా.. దాని ఫాబ్రిక్‌లో అల్లిన అనేక మంత్రముగ్ధమైన కథలు ఉన్నాయి. 'పాష్మ్' అంటే పర్షియన్ భాషలో ఉన్ని అని అర్థం. కానీ, కాశ్మీరీలో ఇది సముద్ర మట్టానికి 14,000 అడుగుల ఎత్తులో మాత్రమే కనిపించే చాంగ్తాంగి మేక (ప్రపంచంలోని అత్యంత ప్రత్యేకమైన కష్మెరె మేక) ఉన్నితో తయారు చేస్తారు. నైపుణ్యం కలిగిన కళాకారులు చేతితో నేసి ఈ శాలువాను తయారు చేస్తారు. తయారీ కూడా చాలా ప్రత్యేకత ఉంటుంది. ఇదంతా ఆధునిక పద్దతిలో కాకుండా అంతా పాత పద్దతిలోనే ఎంబ్రాయిడరీ చేస్తారు. దీంతో ఈ శాలువకు మంచి కాంతి, వెచ్చనితనం ఉంటుంది.

3 / 14
అరకు కాఫీ అనేది ప్రపంచంలోనే మొట్టమొదటి టెర్రోయిర్ మ్యాప్డ్ కాఫీ. దీనిని ఆంధ్ర ప్రదేశ్‌లోని అరకు లోయలో సేంద్రీయ తోటలలో పండిస్తారు. కాఫీ మొక్కలను లోయ రైతులు పండిస్తారు. వారు యంత్రాలు లేదా రసాయనాలు ఉపయోగించకుండా సహజంగా కాఫీని పండిస్తారు. అరుదైన సుగంధ ప్రొఫైల్‌తో కూడిన స్వచ్ఛమైన అరబికా, అరకు కాఫీ దాని ప్రత్యేకమైన ఆకృతికి, మృదువైన, బాగా సమతుల్యమైన కప్పు కోసం తయారు చేసే రుచుల సింఫొనీకి ప్రసిద్ధి చెందింది.

4 / 14
ప్రపంచంలోనే అతిపెద్ద మడ అడవుల్లోని తేనెటీగల నుంచి ఈ సుందర్బన్స్ మల్టీఫ్లోరా మాంగ్రోవ్ తేనెను తీస్తారు. సుందర్బన్స్ తేనె విభిన్నమైన, గొప్ప రుచి ఉంటుంది. జీవ-వైవిధ్యానికి అద్దం పడుతుంది. ఇది ఖలీషా, బని, గరన్ వంటి వివిధ మడ పూల మకరందాన్ని మిళితం చేసి తీపి, మట్టితో కూడిన స్వరాల సామరస్యాన్ని సృష్టిస్తుంది. ఇది ఇతర రకాల తేనెల కంటే తక్కువ జిగటగా ఉంటుంది. 100% సహజంగా, స్వచ్ఛంగా ఉండటమే కాకుండా, సుందర్బన్ తేనెలో ఫ్లేవనాయిడ్లు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇందులో విలువైన ఆరోగ్య ప్రయోజనాలను ఉన్నాయి.

5 / 14
జిఘ్రానా ఇత్తార్ అనేది ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ అనే నగరానికి చెందిన అద్భుతమైన కళాఖండం. 'ఇత్తార్' అంటే 'పరిమళం'. బొటానికల్ మూలాల నుంచి తీసుకోబడిన ముఖ్యమైన నూనె. ఇందులో ఎలాంటి కెమికల్ ఉండదు. ఇది సున్నితమైన పెర్ఫ్యూమ్ క్రాఫ్టింగ్. శతాబ్దాల నాటి సంప్రదాయాన్ని తయారీ దారులు కొనసాగిస్తున్నారు. కళాకారులు తెల్లవారుజామున మల్లె, గులాబీల వంటి అరుదైన పుష్పాలను సున్నితంగా సేకరించి ఈ ఇత్తార్ తయారు చేస్తారు. ఆ సమయంలో వాటి సువాసన అద్భుతంగా ఉంటుంది. హైడ్రో-స్వేదన ప్రక్రియ ఖచ్చితమైన ప్రక్రియ ద్వారా, ముఖ్యమైన నూనెలు సంగ్రహించబడతాయి.

6 / 14
అర్జెంటీనా ప్రెసిడెంట్ అల్బెర్టో ఫెర్నాండెజ్ భార్య మార్సెలా లుచెట్టికి బనారసీ సిల్క్ స్టోల్స్‌ను ప్రధాని మోదీ బహుమతిగా అందించారు. వారణాసిలో హ్యాండ్‌క్రాఫ్ట్‌తో ఈ వస్త్రాన్ని చేశారు. ఇది చాలా మృదువుగా ఉంటుంది. విలాసవంతమైన సిల్క్ థ్రెడ్‌తో ఈ వస్త్రాన్ని తయారు చేశారు. ఈ నగర సాంస్కృతిక గొప్పతనాన్ని, దాని నేత వారసత్వాన్ని ప్రతిబింబిస్తూంది. భుజాలపై కప్పుకున్నా లేదా తలకు కండువాలా ధరించినా శోభను వెదజల్లుతుంది. ఉపఖండంలో చక్కగా దుస్తులు ధరించిన ప్రతి స్త్రీ వార్డ్‌రోబ్‌లో అత్యంత విలువైన వస్తువులలో 'బనార్సీ' సిల్క్ ఒకటి.

7 / 14
ఉన్ని నిర్దిష్ట హిమాలయ మేకల ఉన్ని నుంచి తీసిన దారంతో ఈ వస్త్రం తయారు చేస్తారు. ఆస్ట్రేలియా ప్రధాని జీవిత భాగస్వామికి ప్రధాని మోదీ బహుమతిగా అందించారు. కాశ్మీరీ పష్మీనా పేపియర్ మాచే బాక్స్‌లో ఈ వస్త్రాన్ని అందించారు. ఈ స్టోల్స్ సున్నితమైన చక్కదనం, అనుభూతిని తరతరాలుగా మహిళలు ఆరాధిస్తున్నారు. స్టోల్ జమ్ము, కశ్మీర్‌లోని అత్యంత సున్నితమైన, అలంకారమైన, ప్రసిద్ధి చెందిన చేతితో నేసిన ఒక పేపియర్ మాచే బాక్స్‌లో అందించారు.

8 / 14
బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డా సిల్వా జీవిత భాగస్వామి రోసాంజెలా డా సిల్వాకి ప్రధాని మోదీ  బహుమతిగా అందించారు. ఈ కశ్మీరీ పష్మీనా స్టోల్ దాని ఫాబ్రిక్‌లో అల్లిక అద్భుతంగా ఉంటుంది. ఈ వస్త్రాన్ని చూస్తే చాలా మంత్రముగ్ధులను చేస్తుంది.  నైపుణ్యం కలిగిన కళాకారులు చేతితో నేసి చేశారు. సున్నితమైన ఫైబర్‌తో ఎంబ్రాయిడరీ చేశారు. ఈ వస్త్రం చాలా తేలికైగా, వెచ్చగా ఉంటుంది. శాశ్వతమైన చక్కదనం, హస్తకళను కలిగి ఉంటుంది. ఈ వస్త్రం శతాబ్దాలుగా పష్మినా రాచరికానికి చిహ్నంగా ఉంది.

9 / 14
ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో భార్య ఇరియానా జోకో విడోడోకు ప్రధాని మోదీ కదమ్ చెక్క పెట్టెలో ఈ అస్సాం వస్త్రాన్ని బహుమతిగా అందించారు. ఈశాన్య రాష్ట్రమైన అస్సాంలో నేసిన సాంప్రదాయ దుస్తులు. ముగా పట్టును ఉపయోగించి నైపుణ్యం కలిగిన కళాకారులచే ఈ వస్త్రం  రూపొందించబడింది. అస్సాం సంప్రదాయ వస్త్రంగా చెప్పవచ్చు. ధోతీ, కండువను ధరించిడం ఇక్కడి ప్రజలు గొప్పతనంగా భావిస్తారు.

10 / 14
జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా భార్య యుకో కిషిడాకు ప్రధాని బహుమతిగా అందించారు. కదమ్ చెక్క పెట్టెలో పెట్టిన కంజీవరం పట్టు చీరను గిఫ్ట్ గా ఇచ్చారు. కంజీవరం సిల్క్ క్రియేషన్స్ భారతీయ నేతకు ప్రసిద్ధి. ఈ కళాఖండం అసమానమైన హస్తకళకు ప్రసిద్ధి. 'కంజీవరం' దాని పేరు తమిళనాడులోని కాంచీపురం అనే చిన్న దక్షిణ భారత గ్రామం నుంచి ఈ నేత కళకు ప్రసిద్ధి. ఇక్కడే ఈ క్రాఫ్ట్ ఉద్భవించింది. కంజీవరం చీర వారి పూర్వీకుల నుంచి సంప్రదాయం, సాంకేతికతలను వారసత్వంగా వస్తోంది. నైపుణ్యం కలిగిన నేత కార్మికులచే స్వచ్ఛమైన మల్బరీ సిల్క్ థ్రెడ్‌ల నుండి చేతితో తయారు చేయబడింది. ఇది చాలా మన్నికైన, బలమైన ఫాబ్రిక్. అదే రాణి గాంభీర్యం, అధునాతనతకు పెట్టింది పేరు.

11 / 14
ప్రస్తుత UK ప్రధానమంత్రి రిషి సునక్ భార్య అక్షతా మూర్తికి ప్రధాని మోదీకి బహుమతిగా అందించారు. కదమ్ చెక్క పెట్టెలో బనారసి చీరను గిఫ్ట్ గా ఇచ్చారు. బనారసీ సిల్క్ స్టోల్స్ భారతదేశ సొగసైన సంపద. వారణాసిలో చేతితో తయారు చేయబడినది. బనారస్ నగర సాంస్కృతిక గొప్పతనాన్ని.. దాని నేత వారసత్వాన్ని ప్రతిబింబిస్తాయి. వివాహాలు, ప్రత్యేక సందర్భాలలో వారు ధరిస్తారు. వారు ధరించినవారికి ఒక రాజరికం ఉట్టిపడుతుంది.

12 / 14
ప్రస్తుత మారిషస్‌ ప్రధాని ప్రవింద్‌ జుగ్‌నాథ్‌ భార్య కోబితా రామ్‌దానీకి ప్రధాని మోదీ టేకు చెక్క పెట్టెలో ఇక్కత్‌ చీరను బహుమతిగా అందించారు. ఒడిశాలోని కళాకారులు సృష్టించిన అద్భుత కళాఖండం అని చెప్పవచ్చు. ఇక్కత్ డిజైన్‌కు మార్కెట్లో చాలా విలువు ఉంది. సాంప్రదాయ మల్బరీ సిల్క్ చీర. 'ఇకాత్' అనేది సిల్క్ లేదా కాటన్‌కి రంగులు వేసే ప్రక్రియ

13 / 14
స్పెయిన్ పీఎం పెడ్రో సాంచెజ్ భార్య మరియా బెగోనా గోమెజ్ ఫెర్నాండెజ్‌కు ఎబోనీ చెక్క పెట్టెలో  బనారసీ పట్టు చీరను ప్రధాని మోదీ బహుమతిగా ఇచ్చారు. బనారసీ సిల్క్ స్టోల్స్ భారతదేశ సొగసైన సంపద అని చెప్పవచ్చు. బనారసీ పట్టు చీరకు మన భారతీయులు ఇచ్చే విలువ వేరుగా ఉంటుంది.
వారణాసిలో హ్యాండ్‌క్రాఫ్ట్ గా చెప్పవచ్చు.

స్పెయిన్ పీఎం పెడ్రో సాంచెజ్ భార్య మరియా బెగోనా గోమెజ్ ఫెర్నాండెజ్‌కు ఎబోనీ చెక్క పెట్టెలో బనారసీ పట్టు చీరను ప్రధాని మోదీ బహుమతిగా ఇచ్చారు. బనారసీ సిల్క్ స్టోల్స్ భారతదేశ సొగసైన సంపద అని చెప్పవచ్చు. బనారసీ పట్టు చీరకు మన భారతీయులు ఇచ్చే విలువ వేరుగా ఉంటుంది. వారణాసిలో హ్యాండ్‌క్రాఫ్ట్ గా చెప్పవచ్చు.

14 / 14
Follow us
Latest Articles