EMRS Recruitment 2023: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఏకలవ్య మోడల్ స్కూల్స్‌లో 38,000 టీచర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. మొత్తం ఖాళీల వివరాలివే
దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఏకలవ్య ఆదర్శ పాఠశాలల్లో.. డైరెక్టు ప్రాతిపదికన 38 వేలకు పైగా టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది నియామకాలకు కేంద్ర విద్యాశాఖ సోమవారం (జూన్ 5) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి..
దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఏకలవ్య ఆదర్శ పాఠశాలల్లో.. డైరెక్టు ప్రాతిపదికన 38 వేలకు పైగా టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది నియామకాలకు కేంద్ర విద్యాశాఖ సోమవారం (జూన్ 5) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి నేషనల్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ (NESTS) దరఖాస్తులు కోరుతోంది. ఆన్‌లైన్ విదానంలో దరఖాస్తు స్వీకరిస్తారు. పోస్టును బట్టి పదో తరగతి, ఇంటర్మీడియట్, సంబంధిత స్పెషలైజేషన్‌లో మాస్టర్స్ డిగ్రీతోపాటు బీఈడీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇంగ్లిష్/హిందీ/ప్రాంతీయ భాషలో నైపుణ్యం ఉండాలి.30 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ. 18,000ల నుంచి రూ.2,09,200 వరకు జీతంగా చెల్లిస్తారు. నియామక విధానం, ముఖ్యమైన తేదీల వివరాలు త్వరలో వెల్లడిస్తారు.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు..
- ప్రిన్సిపల్ పోస్టులు: 740
- వైస్ ప్రిన్సిపల్ పోస్టులు: 740
- పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (PGT) పోస్టులు: 8,880
- ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (TGT) పోస్టులు: 8,840
- ఆర్ట్ టీచర్ పోస్టులు: 740
- మ్యూజిక్ టీచర్ పోస్టులు: 740
- ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (PET) పోస్టులు: 1,480
- లైబ్రేరియన్ పోస్టులు: 740
- కౌన్సెలర్ పోస్టులు: 740
- స్టాఫ్ నర్సు పోస్టులు: 740
- హాస్టల్ వార్డెన్ పోస్టులు: 1,480
- అకౌంటెంట్ పోస్టులు: 740
- సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులు: 740
- జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులు: 1480
- క్యాటరింగ్ అసిస్టెంట్ పోస్టులు: 740
- డ్రైవర్ పోస్టులు: 740
- ఎలక్ట్రీషియన్, ప్లంబర్ పోస్టులు: 740
- ల్యాబ్ అటెండెంట్ పోస్టులు: 740
- గార్డెనర్ పోస్టులు: 740
- కుక్ పోస్టులు: 470
- మెస్ హెల్పర్ పోస్టులు: 1480
- చౌకీదార్ పోస్టులు: 1480
- స్వీపర్ పోస్టులు: 2,220
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.