National Herald Case: రాహుల్‌గాంధీ సమాధానాలకు సంతృప్తి చెందని ఈడీ.. ముగిసిన నాలుగో రోజు విచారణ..

నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో నాలుగోసారి రాహుల్‌గాంధీని విచారించింది ఈడీ . యంగ్‌ ఇండియాకు నేషనల్‌ హెరాల్డ్‌ ఆస్తుల బదలాయింపు పైనే ప్రధానంగా ప్రశ్నించారు. అయితే ఇందులో ఎలాంటి అక్రమాలు జరగలేదని రాహుల్‌ స్పష్టం చేశారు.

National Herald Case: రాహుల్‌గాంధీ సమాధానాలకు సంతృప్తి చెందని ఈడీ.. ముగిసిన నాలుగో రోజు విచారణ..
Rahul Gandhi
Follow us
Sanjay Kasula

|

Updated on: Jun 20, 2022 | 8:54 PM

నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో నాలుగో రోజు రాహుల్‌గాంధీని విచారించింది ఈడీ . ఈనెల 13 నుంచి వరుసగా మూడు రోజులు ఈడీ విచారణకు హజరయ్యారు. మూడు రోజుల విరామం తరువాత రాహుల్‌ను మళ్లీ విచారించారు ఈడీ అధికారులు. మరోవైపు కరోనాతో చికిత్స తీసుకున్న సోనియాగాంధీ ఆస్పత్రి నుంచి డిశార్జయ్యారు. నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో ఈనెల 23న హాజరుకావాలని సోనియాకు కూడా ఈడీ సమన్లు జారీ చేసింది. రాహుల్‌గాంధీంతో పాటు ఈడీ ఆఫీస్‌కు వచ్చారు ప్రియాంకగాంధీ. ఈడీ కార్యాలయం దగ్గర చాలా సేపు కారులో వేచి ఉన్నారు ప్రియాంకాగాంధీ. మరోవైపు.. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలో జంతర్‌మంతర్‌ దగ్గర సత్యాగ్ర దీక్ష చేశారు కాంగ్రెస్‌ నేతలు . రాహుల్‌గాంధీపై కేంద్రం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందంటూ.. రాష్ట్రపతి కోవింద్‌కు ఫిర్యాదు చేశారు కాంగ్రెస్‌ నేతలు .

నేషనల్ హెరాల్డ్ ఆస్తులు YILకి బదలాయింపు, షేర్ల వాటాలు, ఆర్ధిక లావాదేవీలపై ప్రధానంగా రాహుల్‌ను ప్రశ్నించారు ఈడీ అధికారులు. ఉదయం 11.30 గంటలకు ప్రారంభమైన రాహుల్‌ విచారణ రాత్రి వరకు కొనసాగింది. లంచ్‌ బ్రేక్‌ తరువాత కూడా రాహుల్‌ను ప్రశ్నించారు.

నేషనల్‌ హెరాల్డ్‌ వ్యవహారంలో ఎటువంటి అక్రమాలు జరగలేదని ఈడీ అధికారుల ముందు పదే పదే స్పష్టం చేస్తున్నారు రాహుల్‌గాంధీ. అయినప్పటికి ఆయన జవాబుతో ఈడీ అధికారులు సంతృప్తి చెందడం లేదు.

జాతీయ వార్తల కోసం