AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Delhi Liquor Scam: కదులుతోన్న లిక్కర్ స్కామ్ డొంక.. రామచంద్ర పిళ్లై నుంచి కీలక ఆధారాలు.. 7 రోజుల కస్టడీకి కోరిన ఈడీ

సౌత్ గ్రూప్‌లో కె. కవిత తరపున ప్రతినిధి, అత్యంత సన్నిహితుడు అరుణ్ రామచంద్ర పిళ్ళై వ్యవహరించినట్లు తెలుస్తోంది. లిక్కర్ స్కాంలో విచారణకు సైతం సహకరించడం లేదని ఈడీ ఈరోపిస్తోంది. లిక్కర్ స్కాంలో పిళ్లై పాత్ర చాలా..

Delhi Liquor Scam: కదులుతోన్న లిక్కర్ స్కామ్ డొంక.. రామచంద్ర పిళ్లై నుంచి కీలక ఆధారాలు.. 7 రోజుల కస్టడీకి కోరిన ఈడీ
Arun Ramachandra Pillai
Sanjay Kasula
|

Updated on: Mar 07, 2023 | 3:30 PM

Share

ఢిల్లీ లిక్కర్ స్కాంలో డొంక కదులుతోంది. అరుణ్ రామచంద్రపిళ్లైని కోర్టు ఎదుట ప్రవేశపెట్టింది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ). ఈ సందర్భంగా ఈడీ పలు అభియోగాలు మోపింది. సౌత్ గ్రూప్‌లో కె. కవిత తరపున ప్రతినిధి, అత్యంత సన్నిహితుడు అరుణ్ రామచంద్ర పిళ్ళై వ్యవహరించినట్లు తెలుస్తోంది. లిక్కర్ స్కాంలో విచారణకు సైతం సహకరించడం లేదని ఈడీ ఈరోపిస్తోంది. లిక్కర్ స్కాంలో పిళ్లై పాత్ర చాలా స్పష్టంగా ఉందని.. ఇండో స్పిరిట్‌లో రామచంద్రపిళ్లై భాగస్వామిగా వస్తుండడంతో పాటు.. సమీర్ మహేంద్రుతో కలిసి ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలకంగా వ్యవహరించాడని ఈడీ కోర్టుకు తెలిపింది. అయితే, హవాలా నగదు సహా చాలా విషయాలపై ప్రశ్నించావల్సి ఉందని.. ఇందు కోసం 7 రోజుల కస్టడీకి ఈడీ తరపు న్యాయవాదులు కోర్టును అభ్యర్తఇంచారు. అరుణ్ రామచంద్రన్ పిళ్లైని కోర్టులో హాజరుపర్చింది ఈడీ. 

రాబిన్ డిస్టిలరీస్‌ పేరుతో వ్యాపారం చేసిన రాంచంద్ర పిళ్లై.. ఢిల్లీ పెద్దలకు పెద్ద మొత్తంలో ముడుపులు చెల్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇండో స్పిరిట్‌తో పాటు కొందరి నుంచి డబ్బులు వసూలు చేసినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. రూ. 2.30 కోట్లు వసూలు చేసి ఢిల్లీ పెద్దలకు ముట్టజెప్పినట్లు ఆరోపణలపై కూడా ఈడీ ప్రశ్నిస్తోంది. CBI నమోదు చేసిన ఎఫ్ఆర్‌లో 14వ నిందితుడిగా రామచంద్ర పిళ్లై ఉన్నాడు.

రెండు రోజులుగా ఈడీ అధికారులు అరుణ్ రామచంద్ర పిళ్లైను ప్రశ్నిస్తున్నారు. ఈ సోమవారం నాడు రాత్రి అరుణ్ రామచంద్రపిళ్లైని అరెస్ట్ చేసినట్లుగా ఈడీ ప్రకటించింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇప్పటికే 11 మంది అరెస్టయ్యారు. లిక్కర్ స్కాంలో సీబీఐ అధికారులు తొలుత అరుణ్ రామచంద్ర పిళ్లైపై అభియోగాలు నమోదు చేశారు.

ఈ విషయమై హైద్రాబాద్ కేంద్రంగా పలు దఫాలు సోదాలు జరిగాయి. అరుణ్ రామచంద్ర పిళ్లైకి చెందిన సంస్థలు, ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించిన సమయంలో కీలకమైన దర్యాప్తు సంస్థలు జరిగాయి. హైదరాబాద్ శివారులోని రెండు కోట్ల విలువైన భూమిని ఈడీ అధికారులు అటాచ్‌డ్ చేస్తున్నట్లు ప్రకటించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం