Indian Railways: ఆ రెండు రాష్ట్రాల మీదుగా వెళ్ళే 100 రైళ్ళను రద్దు చేసిన భారతీయ రైల్వే.. ఎందుకంటే..
ఈస్ట్ కోస్ట్ రైల్వే మీదుగా వెళ్లే 100 కంటే ఎక్కువ రైళ్లను భారతీయ రైల్వే రద్దు చేసింది.
Indian Railways: ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలపై ప్రభావం చూపనున్న ‘జవాద్’ తుఫాను కారణంగా ఈస్ట్ కోస్ట్ రైల్వే మీదుగా వెళ్లే 100 కంటే ఎక్కువ రైళ్లను భారతీయ రైల్వే రద్దు చేసింది. ఇందులో న్యూ ఢిల్లీ-పూరీ పురుషోత్తం ఎక్స్‌ప్రెస్, పాట్నా-ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్, ధన్‌బాద్-అలెప్పీ(బొకారో) ఎక్స్‌ప్రెస్‌తో సహా అనేక ఎక్స్‌ప్రెస్ రైళ్ళు ఉన్నాయి. చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ రాజేష్ కుమార్ చెబుతున్న దాని ప్రకారం, ముందు జాగ్రత్త చర్యగా ఈ రైళ్ల నిర్వహణను రద్దు చేశారు.
చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ రాజేష్ కుమార్ రైల్వే శాఖ తుపాను పరిస్థితిని గమనిస్తూ అన్ని జాగ్రత్తలు తీసుకుంటోందని చెప్పారు. ప్రయాణికుల సౌకర్యాన్ని బట్టి చర్యలు తీసుకుంటామన్నారు. జవాద్ తుఫాను తీవ్రత దృష్ట్యా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సీనియర్ అధికారులతో సమావేశమయ్యారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే దృష్ట్యా అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని ఎన్‌సీఎంసీ ఈ సమావేశంలో సూచించింది.
ఎన్‌డిఆర్‌ఎఫ్, ఎస్‌డిఆర్‌ఎఫ్ బృందాలు రంగంలోకి..
దీనితో పాటు ఎన్‌డిఆర్‌ఎఫ్, ఎస్‌డిఆర్‌ఎఫ్ బృందాలను రంగంలోకి దించాలని ఆదేశాలు జారీ చేశారు. సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అప్రమత్తంగా ఉండాలని కోరారు. అలాగే, అక్కడి అధికారులు కూడా కేంద్రంతో సమాచారాన్ని పంచుకుంటూనే ఉండాలని చెప్పారు. తద్వారా అవసరమైన చర్యలు సకాలంలో తీసుకోవచ్చని వివరించారు.
ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఈ రైళ్లను ప్రస్తుతానికి రద్దు చేశారు.
PIB ట్వీట్ చేయడం ద్వారా రైల్వే రద్దు చేసిన రైళ్ల జాబితాను విడుదల చేసింది. మీరు కూడా ఈ మార్గాల్లో ప్రయాణించబోతున్నట్లయితే, ఖచ్చితంగా ఈ జాబితాను తనిఖీ చేయండి. దీంతో పాటు ఈ 7 రైళ్ల రాకపోకలను కూడా పూర్తిగా రద్దు చేశారు.
As per the forecasting of @Indiametdept, #CycloneJawad will reach #Odisha on December 3rd & 4th.
As a precautionary measure and safety of passengers 95 Mail, Express Trains have been cancelled for December 3rd & 4th 2021.@RailMinIndia@EastCoastRail @PradeepJenaIAS pic.twitter.com/oWcTJGONic
— PIB in Odisha (@PIBBhubaneswar) December 1, 2021
ఈ రైళ్లు రద్దు అవుతాయి..
1. రైలు సంఖ్య (12802) న్యూఢిల్లీ-పూరి పురుషోత్తం ఎక్స్‌ప్రెస్ – 02.12.2021
2. రైలు నం. (22644) పాట్నా-ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్ – 03.12.2021
3. రైలు నం. (13351) ధన్‌బాద్ – అలెప్పీ ఎక్స్‌ప్రెస్ – 03.12.2021
4. రైలు సంఖ్య (12876) ఆనంద్ విహార్ – పూరి నీలాంచల్ ఎక్స్‌ప్రెస్ – 03.12.2021
5. రైలు సంఖ్య (12801) పూరి – న్యూఢిల్లీ పురుషోత్తం ఎక్స్‌ప్రెస్ – 03.12.2021
6. రైలు నెం (12815) పూరి-ఆనంద్ విహార్ నందన్‌కనన్ ఎక్స్‌ప్రెస్ – 04.12.2021
7. రైలు నం. (20817) భువనేశ్వర్ – న్యూఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్ – 04.12.2021
ఇవి కూడా చదవండి: Navjot Singh Sidhu: ఆ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా సిద్ధూ.. కాంగ్రెస్‌కి ఇక గుడ్ బై చెప్పేయడానికి రెడీ!
Maruti Suzuki: ఇకపై మారుతీ కారు కొనాలంటే షాకే.. భారీగా పెరగనున్న ధరలు.. ఎప్పటినుంచి అంటే..