Drugs Seized: ఢిల్లీలో కలకలం.. రైతు నాయకుడి నుంచి భారీగా డ్రగ్స్ స్వాధీనం..

భారీ ఎత్తున డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న ఢిల్లీ పోలీసులు. గత కొద్ది రోజులుగా దేశ వ్యాప్తంగా దాడులు నిర్వహిస్తున్నారు అధికారులు. ఇందులో భాగంగా తాజాగా వచ్చిన పక్కా సమాచారంతో ఢిల్లీ పోలీసులు..

Drugs Seized: ఢిల్లీలో కలకలం.. రైతు నాయకుడి నుంచి భారీగా డ్రగ్స్ స్వాధీనం..
Delhi Police
Follow us

|

Updated on: Dec 02, 2021 | 6:12 PM

భారీ ఎత్తున డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న ఢిల్లీ పోలీసులు. గత కొద్ది రోజులుగా దేశ వ్యాప్తంగా దాడులు నిర్వహిస్తున్నారు అధికారులు. ఇందులో భాగంగా తాజాగా వచ్చిన పక్కా సమాచారంతో ఢిల్లీ పోలీసులు ఘిటోర్ని ప్రాంతంలో దాడులు నిర్వహించారు. పట్టుబడిన డ్రగ్స్ విలువ సుమారు కోటి రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఘిటోర్ని ప్రాంతంలోని ఫామ్ హౌస్ వెలుపల ఉన్న మినీ ట్రక్కు నుండి పోలీసులు ఈ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ సరఫరాదారు నిందితుడు తనను తాను రైతు నాయకుడిగా అభివర్ణించుకుంటున్నాడని పోలీసులు చెబుతున్నారు. మినీ ట్రక్కులో 9.5 కిలోల డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో పట్టుబడిన డ్రగ్స్‌ విలువ దాదాపు కోటి రూపాయలు ఉంటుందని సమాచారం.

పక్కా సమాచారం మేరకు డ్రగ్స్‌తో కూడిన మినీ ట్రక్కుపై పోలీసులు దాడి చేశారు. బుధవారం తొమ్మిదిన్నర కిలోల డ్రగ్స్ తో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయిన నిందితుడు రంజిత్ రైనాగా నిర్ధారించారు. అతని వయసు 51 ఏళ్లుగా, గుల్షన్ వయసు 36 ఏళ్లుగా చెబుతున్నారు ఢిల్లీ పోలీసులు. నిందితుడు రంజిత్ రైనా తనను తాను రైతు నాయకుడిగా చెప్పుకున్నాడు. నిందితుడు రంజిత్ రైనా హర్యానాలోని కురుక్షేత్ర నివాసి అని పోలీసులు వెల్లడించారు. ‘హర్యానా ఆగ్రో ఫారెస్ట్రీ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌’ అని ఇంటరాగేషన్‌లో తేలింది. ప్రస్తుతం అతని ఆరోపణలన్నింటిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. రెండో నిందితుడు గుల్షన్ కుమార్ కూడా కురుక్షేత్ర వాసిగా గుర్తించారు.

కోటి విలువైన డ్రగ్స్ తో ఇద్దరు నిందితులు అరెస్ట్

నిందితులిద్దరూ ఫామ్‌హౌస్‌ నుంచి బయటకు వస్తున్న సమయంలో అరెస్ట్‌ చేసినట్లుగా పోలీసులు తెలిపారు. పోలీసులు విచారణ ప్రారంభించారు. ఇప్పుడు ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయనే దానిపై ఆరా తీస్తున్నారు. దీంతో పాటు ఫామ్‌హౌస్‌పై కూడా విచారణ మొదలు పెట్టారు. త్వరలో ఫాంహౌస్ యజమానిని కూడా పోలీసులు విచారించే అవకాశం ఉంది. నవంబర్‌లో ముంబై పోలీసులు దాదాపు రూ.5 కోట్ల విలువైన డ్రగ్స్‌తో నైజీరియన్‌కు చెందిన వ్యక్తిని కూడా అరెస్టు చేశారు. పట్టుబడిన డ్రగ్స్‌ను ఢిల్లీ నుంచి తీసుకొచ్చారు పోలీసులు.

ఢిల్లీ నుంచి ముంబైకి రూ.5 కోట్ల విలువైన డ్రగ్స్

నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో డ్రగ్స్‌కు వ్యతిరేకంగా పెద్ద ప్రచారాన్ని ప్రారంభించింది. మహారాష్ట్రలోని పలు ప్రాంతాల నుంచి డ్రగ్స్‌ స్వాధీనం చేసుకోవడం ఇదే కారణం. ఇప్పుడు మరోసారి ఢిల్లీలోని ఘిటోర్ని ప్రాంతంలో డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన డ్రగ్స్ విలువ దాదాపు కోటి రూపాయలు ఉంటుందని తెలిపారు. ఈ కేసులో పోలీసులు పూర్తి సమాచారాన్ని సేకరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి: CM KCR: వానాకాలంలో వ‌రి.. యాసంగిలో ఆ పంట‌లే వేయండి.. రైతులకు సీఎం కేసీఆర్ సూచనలు..

Akhanda Movie: అఖండ మూవీ థియేటర్ సీజ్.. మ్యాట్నీ షోను అడ్డుకున్న అధికారులు.. ఎందుకంటే..

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?