Navjot Singh Sidhu: ఆ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా సిద్ధూ.. కాంగ్రెస్‌కి ఇక గుడ్ బై చెప్పేయడానికి రెడీ!

పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సిద్ధూపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Navjot Singh Sidhu: ఆ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా సిద్ధూ.. కాంగ్రెస్‌కి ఇక గుడ్ బై చెప్పేయడానికి రెడీ!
Navjot Singh Sidhu

Navjot Singh Sidhu: పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సిద్ధూపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నవజ్యోత్ సిద్ధూ ఆప్‌లో చేరాలని అనుకున్నారని, అయితే అప్పుడు రాలేదన్నారు. ఇప్పుడు ఆయన ఆప్ లో చేరే అవకాశాలున్నాయని చెప్పారు. అయితే, సిద్ధూతో చివరిసారి చర్చలు జరిపిన విషయాన్ని వెల్లడించేందుకు కేజ్రీవాల్ నిరాకరించారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన కేజ్రీవాల్ సిద్ధూకు సంబంధించి పలు విషయాలు మాట్లాడారు. మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేజ్రీవాల్ మళ్లీ కాంగ్రెస్‌ను వీడేందుకు సిద్ధూ సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఈ ప్రకటనతో పంజాబ్‌లో సిద్ధూ ఆప్‌లో చేరడంపై కేజ్రీవాల్ చర్చలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అధ్యక్ష పీఠాన్ని వీడాలని సిద్ధూ పలుమార్లు ప్రయత్నించిన సంగతి తెల్సిందే.

కాంగ్రెస్ పార్టీతో సిద్ధూ సంతృప్తిగా లేరు. పంజాబ్ ముఖ్యమంత్రి కావాలని ఆయన చేస్తున్న ప్రయత్నాలకు కాంగ్రెస్ నుంచి ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి. ఇక పంజాబ్ లో ప్రస్తుతం కాంగ్రెస్ పరిస్థితి ఏమాత్రం బాలేదు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ నుంచి బయటకు రావాలని చాలాసార్లు సిద్ధూ ప్రయత్నించారు. సిద్ధూ 2022 తర్వాత తానే పంజాబ్ ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్నా.. కాంగ్రెస్ పార్టీలో అలా జరుగుతుందనే గ్యారెంటీ లేదు.

పంజాబ్‌లో ఆప్ సీఎం అభ్యర్ధి కోసం వేచి ఉంది. పంజాబ్‌లో ఆప్ పరంగా అతిపెద్ద చర్చ సీఎం ఎవరనే విషయం మీదే. సీఎం పదవి సిక్కు వర్గానికి చెందినవారికి ఇవ్వనున్నట్లు కేజ్రీవాల్ ఇప్పటికే చెప్పారు. కానీ, ఆయన పేరును వెల్లడించలేదు. సంగ్రూర్ ఎంపీ భగవంత్ మాన్ గురించి ఖచ్చితంగా పార్టీలో చర్చ జరుగుతోంది, కానీ కేజ్రీవాల్ బహిరంగంగా ఏమీ చెప్పడం లేదు.

ఎన్నికల ప్రకటన వెలువడినప్పటి నుంచి ఆయన ఇదే మాట చెబుతున్నారు. అయితే, కేజ్రీవాల్ తరచుగా సిద్ధూను ప్రశంసిస్తూ వస్తున్నారు. గతంలో కూడా సిద్ధూ లేవనెత్తిన అంశాలను మెచ్చుకుంటూనే కాంగ్రెస్ తనను అణచివేస్తోందని ఆరోపించారు.

పంజాబ్‌లో టిక్కెట్లు ఇవ్వడానికి ముందు, మేము ఎమ్మెల్యేలను సర్వే చేయించుకున్నామని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఈ సర్వేలో వెనుకబడిన ఇద్దరు ఎమ్మెల్యేలకు టికెట్ కట్ చేసినట్టు చెపారు. దీంతో వారు కాంగ్రెస్‌లో చేరారు. ”కాంగ్రెస్ మా ఎమ్మెల్యేలను చేర్చుకోవడం సంతోషంగా ఉంది. అయితే వారి మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ కాంగ్రెస్‌ను వీడారు. ఇప్పుడు మాజీ అధ్యక్షుడు సునీల్ జాఖర్ కూడా కాంగ్రెస్‌ను వీడేందుకు సిద్ధమవుతున్నారు” అంటూ ఆప్ అధినేత చెబుతున్నారు.

ఇవికూడా చదవండి: Viral Photo: ఈ ఫోటోలో ఉన్నది టాలీవుడ్‌లో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకున్న హీరో.. ఎవరో గుర్తుపట్టారా?

Akhanda Movie: ఎల్లలు దాటిన అభిమానం.. డల్లాస్‌ను మోత మోగించిన బాలయ్య ఫ్యాన్స్..

Viral news: మూగజీవిపై అమానుషం.. కుమారుడిని కరిచిందని శునకాన్ని కర్కశంగా హతమార్చిన వైనం..

Published On - 4:42 pm, Thu, 2 December 21

Click on your DTH Provider to Add TV9 Telugu