Viral: మీ పిల్లలు చాక్లెట్లు, ఐస్‌క్రీమ్‌లు తింటున్నారా..?.. అయితే గుండెల్లో దడ పుట్టించే న్యూస్

Ram Naramaneni

Ram Naramaneni |

Updated on: Apr 22, 2022 | 8:23 AM

మీ పిల్లలు చాక్లెట్లు తింటున్నారా!... వాళ్లకు ఇష్టమని ఎండాకాలం ఐస్‌క్రీమ్‌లు కొనిస్తున్నారా! అయితే మీరు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం.

Viral: మీ పిల్లలు చాక్లెట్లు, ఐస్‌క్రీమ్‌లు తింటున్నారా..?.. అయితే గుండెల్లో దడ పుట్టించే న్యూస్
Chocolate
Follow us

మీ పిల్లలు చాక్లెట్లు తింటున్నారా!… వాళ్లకు ఇష్టమని ఎండాకాలం ఐస్‌క్రీమ్‌లు కొనిస్తున్నారా! అయితే మీరు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. ఎందుకంటే… చెన్నై(chennai) మహానగరంలో డ్రగ్స్ చాక్లెట్స్‌ కలకలం రేపుతున్నాయి. స్కూల్స్, కాలేజీల సమీపంలో డ్రగ్స్(Drugs) చాక్లెట్స్‌ అమ్ముతున్నారనే వార్తల నేపథ్యంలో.. పిల్లల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. పాఠశాలలు, కళాశాలల సమీపంలో డ్రగ్స్ చాక్లెట్స్‌ సప్లై అవుతున్నట్టు అధికారులకు సమాచారం రావడంతో అలెర్ట్ అయ్యారు. పరిసరాల్లో ఉన్న కిరాణా స్టోర్స్, సూపర్ మార్కెట్స్‌లో ఆకస్మిక తనిఖీలు చేశారు. డ్రగ్స్‌ మిక్స్‌ చేసి అమ్ముతున్నారనే అనుమానాలకు బలం చేకూర్చేలా.. అక్కడున్న ఐటమ్స్‌పై లేబుళ్లు లేవు. జెల్లీ, ఐస్ క్రీం, చాక్లెట్స్‌లను పెద్ద మొత్తంలో స్వాధీనం చేసుకున్నారు. వాటిని ల్యాబ్‌కి పంపించి పరీక్షలు నిర్వహిస్తున్నారు అధికారులు. ఈ లేబుల్స్‌ లేని ఐటమ్స్‌ ఎక్కడ తయారవుతున్నాయి? వాటిని ఎక్కడ నుంచి సప్లై చేస్తున్నారు? అే అంశాలపై విచారణ చేస్తున్నారు అధికారులు. డ్రగ్స్‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. భారతదేశానికి అద్వితీయ సంపదైన యువతను చిత్తు చేసే మత్తుపై.. గవర్నమెంట్స్‌ ఇంకాస్త ఎక్కువ ఫోకస్ పెట్టాల్సిన ఆవశ్యకత కనిపిస్తుంది.

Also Read: Viral: ఇంట్లో ఎవరూ లేరు వచ్చేమంది.. కింగ్‌లా అక్కడికి వెళ్లిన కుర్రాడికి దిమ్మతిరిగే షాక్..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Click on your DTH Provider to Add TV9 Telugu