AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat: గుజరాత్ పోర్ట్‌లో 260 కిలోల డ్రగ్స్ సీజ్.. రూ. 1,300 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా

Gujarat: దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాలు డ్రగ్స్ మాఫియా ముఠాలకు అడ్డాలుగా మారుతున్నాయి. తాజాగా వివిధ ప్రాంతాల్లో భారీగా డ్రగ్స్(Heroin) పట్టుబడడం కలకలం రేపింది. గుజరాత్, అసోం, మణిపూర్ ల్లో..

Gujarat: గుజరాత్ పోర్ట్‌లో 260 కిలోల డ్రగ్స్ సీజ్.. రూ. 1,300 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా
Heroin Seized
Surya Kala
|

Updated on: Apr 22, 2022 | 6:52 AM

Share

Gujarat: దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాలు డ్రగ్స్ మాఫియా ముఠాలకు అడ్డాలుగా మారుతున్నాయి. తాజాగా వివిధ ప్రాంతాల్లో భారీగా డ్రగ్స్(Heroin) పట్టుబడడం కలకలం రేపింది. గుజరాత్, అసోం, మణిపూర్ ల్లో భారీ డ్రగ్ రాకెట్ ముఠా గుట్ట రట్టు చేశారు అధికారులు. కోట్ల విలువ జేసే మత్తుపదార్ధాలను స్వాధీనం చేసుకున్నారు. గుజరాత్ లోని కండ్లా పోర్ట్‌లో( Kandla port) భారీగా డ్రగ్స్  పట్టుబడింది. గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఎటిఎస్), డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డిఆర్ఐ) లు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్ లో గురువారం కచ్‌లోని కాండ్లా ఓడరేవులో కంటైనర్ నుండి దాదాపు 260 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన డ్రగ్స్ విలువ అంతర్జీయ మార్కెట్ లో రూ. 1,300 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇరాన్ ఓడరేవు ద్వారా భారత్‌లోకి భారీగా హెరాయిన్‌ను అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న గుజ‌రాత్ ఏటీఎస్ డీఆర్ఐ అధికారుల‌ అప్రమత్తమయ్యారు. డ్రగ్స్‌ను కంటెయిన‌ర్లలో భార‌త్‌కు త‌ర‌లిస్తున్నార‌నే స‌మాచారం రావ‌డంతో ఈ జాయింట్ ఆప‌రేష‌న్‌ను చేప‌ట్టింది. ఆఫ్ఘనిస్తాన్  వచ్చిన 17 కంటైనర్‌లలో ఒకదాన్ని తనిఖీ  చేసి  కంటెయిన‌ర్ నుంచి పెద్దమొత్తంలో డ్రగ్స్‌ను అధికారులు సీజ్ చేశారు. ఇప్పటివరకు 13 బ్యాగులను స్వాధీనం చేసుకున్నామని.. ఒకొక్క బ్యాగ్ లో 20 కిలోల హెరాయిన్‌ ఉందని చెప్పారు. ఇంకా 16 కంటైనర్‌లను తనిఖీ చేయవలసి ఉంది.. వాటిలో కొన్ని మాదక ద్రవ్యాలు ఉన్నాయని తాము  అనుమానిస్తున్నాము, ”అని ATS అధికారి తెలిపారు.

జిప్సం పౌడర్‌గా గుర్తించబడిన సరుకు ఇరాన్‌లోని బందర్ అబ్బాస్ పోర్ట్ నుండి తీసుకువచ్చిందని. దీనిని బాలాజీ ట్రేడర్స్ అనే సంస్థ దిగుమతి చేసుకున్నదని అధికారి తెలిపారు.  గుజరాత్‌లోని 1,600 కిలోమీటర్ల తీరప్రాంతం దేశంలోకి మాదక ద్రవ్యాలను సరఫరాకు ఉపయోగిస్తున్నారు. ఈ తీరప్రాంతం అంతర్జాతీయ, అంతర్రాష్ట్ర డ్రగ్ మాఫియాలకు వరంగా మారిందనే చెప్పాలి.

కాగా మరోవైపు అసోంలో భారీ డ్రగ్ రాకెట్ గుట్టును గువ‌హ‌టి పోలీసులు ర‌ట్టు చేశారు. డ్రగ్స్ రాకెట్‌లో ఇద్దరు వ్యక్తుల‌ను అరెస్ట్ చేసిన పోలీసులు రూ 7.5 కోట్ల విలువైన 750 గ్రాముల‌ హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. గువ‌హ‌టిలోని గ‌ర్చుక్ ప్రాంతంలో నిందితుల‌ను పోలీసులు అరెస్ట్ చేసి భారీ మొత్తంలో డ్రగ్స్‌ను సీజ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్స్ స‌ర‌ఫ‌రాదారుల‌పై ఉక్కుపాదం మోపుతున్నామని.. పోలీసులు చెప్పారు. దాడులు తీవ్రత‌రం చేశామ‌ని అన్నారు.

మ‌రో ఘ‌ట‌న‌లో మ‌ణిపూర్‌కు చెందిన డ్రగ్స్ స‌ర‌ఫ‌రాదారును అసోం పోలీసులు అరెస్ట్ చేశారు. బ‌స్సుల్లో 260 గ్రాముల హెరాయిన్‌ను త‌ర‌లిస్తూ నిందితుడు ప‌ట్టుబ‌డ్డాడు. మ‌ణిపూర్ నుంచి వ‌స్తున్న బ‌స్‌ను ఆపి పోలీసులు త‌నిఖీ చేయ‌డంతో డ్రగ్స్ దందా బ‌ట్టబ‌య‌లైంది. అసోంలోని క‌ర్బి అంగ్లాంగ్ జిల్లాలో ఈ ఘ‌ట‌న జ‌రిగింద‌ని పోలీసులు తెలిపారు.

Also Read: Village Lockdown: ఆ గ్రామంలో అకస్మాత్తుగా మరణాలు.. దుష్ట శక్తుల వల్లనే మరణిస్తున్నారంటూ ఊరు చుట్టూ కంచె.. తాంత్రిక పూజలు