ఆ రోగి ముఖాన చిరునవ్వు, హాస్పిటల్ లో కోవిడ్ రోగి బర్త్ డే, సెలబ్రేట్ చేసిన డాక్టర్లు, హెల్త్ కేర్ వర్కర్లు,

కోవిడ్ రోగులను ఉత్సాహపరిచేందుకు, వారిలో నూతనోత్సాహాన్ని నింపేందుకు డాక్టర్లు, హెల్త్ కేర్ వర్కర్లు కృషి చేస్తున్నారు.  దిగాలుగా ఉన్న వారి ముఖాల్లో చిరునవ్వు కనిపించేలా...

ఆ రోగి ముఖాన చిరునవ్వు, హాస్పిటల్ లో కోవిడ్ రోగి బర్త్ డే, సెలబ్రేట్ చేసిన డాక్టర్లు, హెల్త్ కేర్ వర్కర్లు,
Dotors Celebrate Covid Patient's Birthday At Surat Hospital In Viral Video
Umakanth Rao

| Edited By: Shaik Madarsaheb

Apr 24, 2021 | 9:12 AM

కోవిడ్ రోగులను ఉత్సాహపరిచేందుకు, వారిలో నూతనోత్సాహాన్ని నింపేందుకు డాక్టర్లు, హెల్త్ కేర్ వర్కర్లు కృషి చేస్తున్నారు.  దిగాలుగా ఉన్న వారి ముఖాల్లో చిరునవ్వు కనిపించేలా తమ శాయశక్తులా పాటు పడుతున్నారు. ఇందుకు ఉదాహరణగా గుజరాత్ సూరత్ లోని ఓ హాస్పిటల్ లో ఓ మహిళా రోగి జన్మదిన సెలబ్రేషన్స్ ని అక్కడి హెల్త్ కేర్ వర్ల్కర్లు, డాక్టర్లు జరిపారు.. ముంబైకి చెందిన వైరల్ భయానీ అనే ఫోటోగ్రాఫర్ ఈ వీడియో క్లిప్ ని షేర్ చేశారు. ‘తుమ్ జియో హజారో సాల్’ అనే పాటను పాడుతూ, చప్పట్లు కొడుతూ వారు ఆ రోగికి బర్త్ డే విషెస్ తెలిపారు. ఆ రోగి కూడా చిరునవ్వుతో వారి విషెస్ ని స్వీకరించింది. ఇలా  కోవి పేషంట్లకు తమ సేవలను అందించడమే కాక.. వారికి జీవితం మీద ఉత్సాహం కల్గించేందుకు, ఉల్లాసం నింపేందుకు డాక్టర్లు, వైద్య సిబ్బంది ఎంతగానో కృషి చేస్తున్నారని ఆ ఫోటోగ్రాఫర్ పేర్కొన్నారు. వీరిని అభినందించాలి అన్నారాయన.. సూరత్ లోని సివిల్ ఆసుపత్రిలో జరిగిన ఈ చిన్నపాటి ఫంక్షన్ మరెందరిలోనో స్ఫూర్తిని నింపుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

‘తుమ్ జియో హజారో సాల్’ అనే పాటను ప్రముఖ హిందీ నేపథ్య గాయని ఆశా భోస్లే 1959 లో పాడారు. సుజాత అనే ఆల్బమ్ లోనిది ఈ సాంగ్.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu