Covid patient: హృదయ విదారకం.. కళ్లెదుటే కన్నతల్లి మృతి.. కాపాడుకునేందుకు కూతురు, కొడుకు..
Covid patient dies: తమిళనాడులో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు లేకపోవడంతో ఓ మహిళ మృతి చెందింది. అయితే.. చివరి నిమిషంలో కన్నతల్లిని కాపాడుకోవడానికి
Covid patient dies: తమిళనాడులో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు లేకపోవడంతో ఓ మహిళ మృతి చెందింది. అయితే.. చివరి నిమిషంలో కన్నతల్లిని కాపాడుకోవడానికి కూతురు, కొడుకు విశ్వప్రయత్నాలు చేశారు. వారి కళ్లముందే కన్నతల్లి కనుమూయడంతో గుండెలవిసేలా రోదించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ విడియో సంచలనంగా మారడంతో అధికారులు.. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. ఈ ఘటన కడలూరు జిల్లా చిదంబరం ప్రభుత్వ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. కడలూరు జిల్లా చిదంబరం కి చెందిన సెంథామరై (సెల్వి) సెప్టెంబర్ 24 న కరోనా లక్షణాలతో రాజా ముత్తయ్య ప్రభుత్వాస్పత్రిలో చేరింది. ఈ క్రమంలో మంగళవారం ఆమెకు ఒక్కసారిగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో కుటుంబసభ్యులు ఆసుపత్రి సిబ్బందికి సమాచారమిచ్చారు. ఆ సమయంలో విధుల్లో ఉన్నవలసిన డాక్టర్ లేకపోవడం, సీపీఆర్ మెషిన్ పనిచేయకపివడంతో ఆమె ఊపిరి ఆడక విలవిలలాడింది.
అయితే.. తన తల్లి బాధ చూడలేక.. కాపాడాలంటూ కొడుకు, కూతురు ఆస్పత్రి సిబ్బంది కాళ్ళు పట్టుకొని బతిమలాడారు. వైద్యుడు లేకపోవడంతో సిబ్బంది కూడా ఏమి చేయలేని ధీనస్థితిలో కొట్టుమిట్టాడారు. ఈ క్రమంలో కూతురు కన్నతల్లిని కాపాడుకోవడానికి.. శ్వాస అందించడానికి చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. చివరకు సెల్వి ఆసుపత్రిలో కన్నుమూసింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో.. సెల్విని కాపాడేందుకు ఆమె కూతురు, నర్సు సీపీఆర్ ఇస్తున్నారు. తన తల్లి శ్వాస తీసుకోవడంలో బాధపడుతోందని, ఆమెను చూసేందుకు డాక్టర్ లేడంటూ వీడియోలో రోదిస్తున్నాడు. సమాచారమిచ్చినా డాక్టర్ రాలేదంటూ కొడుకు ఏడుస్తున్నాడు. ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంతోనే తమ తల్లి మరణించిందని కూతురు, కొడుకు రోదించారు. దీనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. కాగా.. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో వైద్యుడిపై చర్యలు తీసుకోవాలని నెటిజెన్స్ డిమాండ్ చేస్తున్నారు.
వీడియో..
ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ స్పందించి.. విచారణకు ఆదేశించారు. మహిళ అక్టోబర్ 5న మరణించిందని.. ఆమె పేరు సెంథామరై అని అధికారులు పేర్కొన్నారు. ఆమె భర్త గోతండరామన్ కూడా కరోనావైరస్‌తో అక్టోబర్ 1 న మరణించాడు.
Also Read: