Diwali holidays: దీపావళికి 10 రోజుల సెలవు.. మరింత వేడుకగా పండగ సంబరాల్లో ఉద్యోగులు..!

దేశంలో జరిగే అతి పెద్ద వేడుకల్లో దీపావళి ఒకటి. దీపావళి సమీపిస్తున్నందున, ఉద్యోగులు మరిన్ని ప్రయోజనాల కోసం ఎదురు చూస్తున్నారు. ఇందులో బోనస్‌లు, బహుమతులు మొదలైనవి ఉంటాయి.

Diwali holidays: దీపావళికి 10 రోజుల సెలవు.. మరింత వేడుకగా పండగ సంబరాల్లో ఉద్యోగులు..!
Diwali Holidays
Follow us
Jyothi Gadda

| Edited By: Anil kumar poka

Updated on: Oct 12, 2022 | 5:55 PM

దీపావళి సెలవులు: దేశంలో జరిగే అతిపెద్ద వేడుకల్లో దీపావళి ఒకటి. దీపావళి సమీపిస్తున్నందున, ఉద్యోగులు మరిన్ని ప్రయోజనాల కోసం ఎదురు చూస్తున్నారు. ఇందులో బోనస్‌లు, బహుమతులు మొదలైనవి ఉంటాయి. అయితే ఈ  దీపావళి పండుగ సీజన్‌లో మీరు పని నుండి విరామం తీసుకుంటే ఎంత బాగుంటుందో ఎప్పుడైనా ఆలోచించారా? అయితే ఓ కంపెనీ అలా ఆలోచించింది. అంటే, బోనస్‌లు, బహుమతులు పక్కన పెడితే, చాలా భిన్నంగా ఈ సంస్థ తన ఉద్యోగులను సంతోషపరుస్తుంది. అంటే దీపావళిని పురస్కరించుకుని ఉద్యోగులకు 10 రోజుల సెలవులు ఇచ్చిన కంపెనీ….!! ఎక్కడుందో తెలుసా..?

ఇప్పుడు భారతదేశంలో పండుగల సీజన్. ఈ సీజన్‌లో దీపావళి అతిపెద్ద వేడుకగా పరిగణించబడుతుంది. భారతదేశంలో దీపావళిని చాలా పెద్ద వేడుకగా చూస్తారు. మరోవైపు, దీపావళి సందర్భంగా ప్రజలు ఈ పండుగను కుటుంబ సమేతంగా జరుపుకోవాలని కోరుకుంటారు. కానీ, తరచూ ఉద్యోగులకు పండుగల సమయంలో సెలవు లభించదు. ఇలాంటి సందర్భంలో ఈ సంస్థ తన ఉద్యోగులకు ఊహించని ఓ పెద్ద గిఫ్ట్ ఇచ్చింది. ఉద్యోగుల మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. గ్లోబల్ కంపెనీ వీవర్క్ భారతదేశంలోని తన ఉద్యోగులకు 10 రోజుల దీపావళి సెలవులను ప్రకటించింది. కంపెనీ ఇచ్చిన సర్ప్రైజ్ హాలిడే బ్రేక్ విని ఆశ్చర్యపోతున్నారు ఉద్యోగులు.

ఉద్యోగులు దీపావళిని కుటుంబంతో, తమ ప్రియమైనవారితో జరుపుకోవడానికి చాలా అవసరమైన పనికిరాని సమయాన్ని ఆస్వాదించడానికి సహాయపడటానికి ఈ సర్పైజ్‌ హాలిడేస్‌ని ప్రకటించినట్లు కంపెనీ తెలిపింది. దేశంలో ఎక్కడికైనా వెళ్లేందుకు, పని చేసేందుకు వీలుగా కంపెనీ ఇంతకుముందు ఉద్యోగులకు 10 రోజుల సెలవులు ఇచ్చింది. దీనికి ముందు మరో సంస్థ కూడా చర్యలు తీసుకుంది. ఇ-కామర్స్ స్టార్టప్ మీషో గత నెలలో ఇదే విధమైన చర్య తీసుకుంది. పండుగ అమ్మకాల వ్యవధిని ప్రకటించిన తర్వాత, ఉద్యోగులు పని చేయకుండా ఉండటానికి, మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడానికి 11 రోజుల సెలవులు ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి