AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అయ్యా బాబోయ్‌.. సింహం పిల్లలతో ఆటలు..స్టైల్‌గా ఫోటోలకు ఫోజులు.. ఏం చేసిందో చూస్తే..

వీడియోలో ఒక వ్యక్తి తన సింహం పిల్లలతో ఏంచక్కా ఆడుకుంటున్నాడు.. దానిని ఇన్‌స్టాలో షేర్ చేయడంతో అది కాస్త నెటిజన్లను కూడా షాక్‌ అయ్యేలా చేస్తోంది.

అయ్యా బాబోయ్‌.. సింహం పిల్లలతో ఆటలు..స్టైల్‌గా ఫోటోలకు ఫోజులు.. ఏం చేసిందో చూస్తే..
Pet Lion Cubs
Jyothi Gadda
|

Updated on: Oct 11, 2022 | 1:56 PM

Share

సింహాలు, పులులు వంటివి అడవి మృగాలు..అవి వాటికి చెందిన ఆవాసాల్లో ఉంటేనే శ్రేయస్కారం.. ప్రైవేట్ వ్యక్తుల ఇళ్లలో అవి పెంపుడు జంతువులు కాదు. వీటిని బంధించి కూడా పోషించలేం. అవి ప్రైవేటు వ్యక్తుల సంరక్షణలో ఉన్నప్పుడు యజమానులతో పాటు ఇతరు ప్రాణాలకు కూడా ప్రమాదం పొంచిఉన్నట్టే. కానీ, కొందరు పిల్లులు, కుక్కలే కాదు.. కొండ చిలువలు, రెండు తలల పాము, తాబేళ్లను కూడా కొందరు తమ ఇళ్లల్లో పెంపుడు జంతువులుగా పెంచుకుంటున్నారు. కానీ సింహం, పులులతో ఆటలు మాత్రం వద్దు.. ఎందుకంటే అవీ క్రూర జంతువులు..తాజాగా అలాంటి ఓ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. వీడియోలో ఒక వ్యక్తి తన సింహం పిల్లలతో ఏంచక్కా ఆడుకుంటున్నాడు.. దానిని ఇన్‌స్టాలో షేర్ చేయడంతో అది కాస్త నెటిజన్లను కూడా షాక్‌ అయ్యేలా చేస్తోంది. ఆ వీడియోలో ఉన్న రెండు సింహం పిల్లల ఆటలు చూస్తే..మీరు కూడా ఆశ్చర్యపోయడం ఖాయం.

ఈ వీడియోను @basit_ayan_2748 Instagram ఖాతాలో షేర్‌ చేశారు. కారు బానెట్‌పై కూర్చొని ఈ సింహం పిల్లలను ఆడిస్తున్నాడు.. పైగా చిత్ర విచిత్రంగా ఫోటోలు, వీడియోలకు పోజులిస్తున్నట్టుగానే ఉంది. పైగా వీడియో తీసే వరకు మనం కదలకుండా నిశ్శబ్దంగా కూర్చునే ఉండాలని వాటికి చెప్పినట్టుగా సింహం పిల్లలు సైతం ఫోజులివ్వటం అందరినీ అవాక్కయ్యేలా చేసింది. ఆ సింహం పిల్లలను అతడు నెమ్మదిగా నిమరుతుంటే…అందులో ఒకటి కోపంగా చూసింది. దీంతో అతను వెనకడుగు వేశాడు. కరిచినంత పనిచేసినా.. తిరిగి వాటి దగ్గరకు అతను వెళ్లాడు. అవీ కారు రూఫ్ ఎక్కబోయాయి.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Md Gulzar (@basit_ayan_3748)

గత నెలలో వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. వీడియోకు 2.74 లక్షల లైకులు వచ్చాయి. 3 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. భిన్నమైన కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు నెటిజన్లు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం చూడండి..