Pensioners Alert: పెన్షన్ దారులకు గమనిక..! అక్టోబర్ 1 నుంచి ఈ నిబంధనలలో మార్పు..
Pensioners Alert: అక్టోబర్ 1, 2021 నుంచి పెన్షన్ నిబంధనలలో మార్పులు జరుగనున్నాయి. వీటిని పెన్షన్ దారులు కచ్చితంగా గుర్తించాల్సి ఉంది. లేదంటే పెన్షన్ డబ్బు
Pensioners Alert: అక్టోబర్ 1, 2021 నుంచి పెన్షన్ నిబంధనలలో మార్పులు జరుగనున్నాయి. వీటిని పెన్షన్ దారులు కచ్చితంగా గుర్తించాల్సి ఉంది. లేదంటే పెన్షన్ డబ్బు పొందడంలో ఇబ్బంది ఎదురవచ్చు. ఈ కొత్త మార్పు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ గురించి. ఈ సర్టిఫికెట్ దేశంలోని అన్ని ప్రధాన తపాలా కార్యాలయాల జీవన్ ప్రామాన్ సెంటర్‌లో (JPC) సబ్‌మిట్ చేయవచ్చు. 80 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పెన్షనర్లు అక్టోబర్ 1 నుంచి నవంబర్ 30, 2021 వరకు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ (DLC) సమర్పించాలి. మిగిలిన పెన్షనర్లు నవంబర్ 1 నుంచి నవంబర్ 30 వరకు సమర్పించాలి.
జీవన్ ప్రమాణ కేంద్రాలు లేని హెడ్ పోస్ట్ ఆఫీసులలో ఈ కేంద్రాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం ప్రకారం జీవన్ ప్రామాన్ సెంటర్ చేసిన తర్వాత ID ని యాక్టివేట్ చేయాలి. సెప్టెంబర్ 20, 2021లోగా ఈ పని పూర్తి చేయాలి. డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ నియమం గత సంవత్సరం నుంచి ప్రారంభించారు. కానీ కరోనా మహమ్మారి వల్ల వృద్ధుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఇది నిలిపివేశారు. కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లందరికీ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సమర్పించే తేదీని నవంబర్1, 2020 నుంచి డిసెంబర్ 31, 2020 వరకు పొడిగించారు. ఈ మినహాయింపు కాలంలో పెన్షనర్ల మొత్తం డబ్బును విడుదల చేశారు.
ఈ పని పూర్తిగా ఆన్‌లైన్‌గా మారినందున పెన్షనర్లు బ్యాంక్ లేదా పోస్టాఫీసును సందర్శించాల్సిన అవసరం లేదు. డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్‌ని ఇంటినుంచే ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చు. గతంలో ఈ సర్టిఫికెట్‌ను బ్యాంకులు లేదా పోస్టాఫీసులో చేతితో సమర్పించాల్సి ఉండేది కానీ ఇప్పుడు ఈ సదుపాయం ఆన్‌లైన్‌లో కల్పించారు. దీంతో డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ ప్రాసెస్ సులువుగా పూర్తవుతుంది. దీని ఆధారంగా పెన్షనర్ ఖాతాలో డబ్బు విడుదలవుతుంది. వృద్ధ పెన్షనర్లు బ్యాంకు లేదా పోస్టాఫీసు వద్ద దీర్ఘ లైన్లలో నిలబడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సర్టిఫికెట్ పంపే పని ఇంట్లో నుంచే చేయవచ్చు. దాని ఆధారంగా ఖాతాలో డబ్బు జమవుతుంది. మరొక నియమం ఏంటంటే డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ పొందడానికి ఆధార్ అవసరం లేదు. చాలా మంది పెన్షనర్లు ఈ కేసులో ఫిర్యాదు చేశారు. ఆధార్ కార్డ్ అందుబాటులో లేనందున వారు పెన్షన్ పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అంతేకాదు కొంతమంది బొటన వేలి ముద్ర సరిపోవడం లేదని ఫిర్యాదు చేశారు.
మరిన్ని ఇక్కడ చదవండి :
Anushka Shetty : మరో విభిన్న పాత్రలో నటించనున్న అందాల అనుష్క.. ఏ మూవీలో అంటే..